సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రెంకే కమిషన్ సిఫార్సుల అమలు

प्रविष्टि तिथि: 11 FEB 2026 11:46AM by PIB Hyderabad

విముక్త తెగలుసంచారపాక్షిక సంచార తెగల సమస్యల అధ్యయనానికి సామాజిక న్యాయంసాధికారత మంత్రిత్వ శాఖ 2005 మార్చిలో రెంకే కమిషన్ (విముక్తసంచారపాక్షిక సంచార తెగల జాతీయ సంఘం)ను ఏర్పాటు చేసిందిఈ కమిషన్ జూలై 2008లో నివేదికను సమర్పించింది.

 

కమిషన్ సిఫార్సులను పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వంవిముక్తసంచారపాక్షిక సంచార తెగల (ఎన్‌సీడీఎన్‌టీకోసం మూడేళ్ల కాలపరిమితితో జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేసిందిఎన్‌సీడీఎన్‌టీ సిఫార్సు మేరకు ఫిబ్రవరి 2019లో విముక్తసంచారపాక్షిక సంచార తెగల అభివృద్ధిసంక్షేమ బోర్డు ఏర్పాటైంది.

 

ఈ సామాజిక వర్గాల సంక్షేమంఆర్థిక సాధికారత కోసం.. విముక్తసంచార తెగల ఆర్థిక సాధికారత పథకం(సీడ్)ని 2022లో ప్రారంభించారు. 2021-22 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరానికిగానూ సీడ్ పథకానికి రూ.200 కోట్లను కేటాయించారు.

 

సామాజిక న్యాయంసాధికారత శాఖ సహాయమంత్రి శ్రీ బి.ఎల్వర్మ ఇవాళ రాజ్యసభలో లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.

 

***


(रिलीज़ आईडी: 2226529) आगंतुक पटल : 59
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , English , हिन्दी