గనుల మంత్రిత్వ శాఖ
ఎక్సప్లొరేషన్ బ్లాకుల రెండో విడత లైసెన్సుల వేలాన్ని ప్రారంభించనున్న గనుల మంత్రిత్వశాఖ
నాడు పోస్టు చేయడమైనది:
11 FEB 2026 3:36PM by PIB Hyderabad
ఎక్స్‌ప్లోరేషన్ లైసెన్స్ (అన్వేషణ లైసెన్స్) బ్లాకుల రెండో విడత వేలం ప్రక్రియను 12 ఫిబ్రవరి 2026న న్యూఢిల్లీలోని సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ ఇనిస్టిట్యూట్ (సీఎస్ఓఐ)లో గనుల మంత్రిత్వ శాఖ ప్రారంభించనుంది. ఇది ఖనిజ అన్వేషణను బలోపేతం చేయడం, దీర్ఘకాలిక ఖనిజ భద్రతను నిర్ధారించడమే లక్ష్యంగా భారత్ చేపట్టిన సంస్కరణలలో మరో కీలక ప్రస్థానాన్ని సూచిస్తుంది.
కేంద్ర బొగ్గు, గనుల మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. గనుల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ఇతర ముఖ్య భాగస్వాములు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఈ సందర్భంగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన నెక్స్ట్ జనరేషన్ డిజిటల్ పోర్టల్‌ను గనుల మంత్రిత్వ శాఖ ఆవిష్కరించనుంది. ఇది ఒకే క్లౌడ్ ఆధారిత వేదికపై డేటా సేకరణ, విశ్లేషణ, విజువలైజేషన్, పంపిణీ వంటి సేవలను సమగ్రంగా అందిస్తుంది. ఏఐ/ఎంఎల్ ఆధారిత సాధనాలతోపాటు నేషనల్ జియోసైన్స్ డేటా రిపోజిటరీతో పరస్పర అనుసంధానం కలిగిన ఈ పోర్టల్.. ఖనిజ అన్వేషణ వ్యవస్థలో పారదర్శకతను, సామర్థ్యాన్ని, డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడాన్ని గణనీయంగా పెంచుతుందని భావిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా భాగస్వాముల కోసం సమగ్ర రోడ్‌షో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఎక్స్‌ప్లోరేషన్ లైసెన్స్ విధానం, వేలం ప్రక్రియ విధానాలు, అన్వేషకులకు అందుబాటులో ఉన్న ప్రోత్సాహకాలపై వివరాలు అందిస్తారు. అలాగే ఎంఎస్ఎంఈ పోర్టల్ ద్వారా ఈ-వేలం ప్రక్రియ, వేలం నిబంధనలు, అర్హత కలిగిన అన్వేషణ ఖర్చులో కొంతభాగం తిరిగి చెల్లించే నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్ట్ (ఎన్ఎంఈటీ) పథకంపై ప్రదర్శనలు ఉంటాయి. భాగస్వాముల సందేహాలు, సూచనలను పరిష్కరించేందుకు ఒక సమావేశాన్ని కూడా నిర్వహించనున్నారు.
ఎక్స్‌ప్లోరేషన్ లైసెన్స్ మొదటి విడత వేలం విజయవంతంగా ప్రారంభించిన నేపథ్యంలో ప్రస్తుతం రెండో విడత వేలాన్ని నిర్వహిస్తున్నారు. మొదటి విడతలో కీలక ఖనిజాలు, జింక్, డైమండ్, రాగి, ప్లాటినం గ్రూప్ కీలక ఖనిజాలను కలిగిన 13 ఎక్స్‌ప్లోరేషన్ లైసెన్స్ బ్లాకుల వేలాన్ని 13 మార్చి 2025న గోవాలో కేంద్ర బొగ్గు, గనుల మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి, గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ సంయుక్తంగా ప్రారంభించారు.
***
(రిలీజ్ ఐడి: 2226486)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6