జాతీయ మానవ హక్కుల కమిషన్
azadi ka amrit mahotsav

మేఘాలయలోని తూర్పు జయంతియా హిల్స్‌‌లో అక్రమ బొగ్గు గనిలో జరిగిన పేలుడులో 18 కార్మికులు చనిపోయారన్న నివేదికలను సుమోటోగా స్వీకరించిన ఎన్‌హెచ్ఆర్‌సీ


రెండు వారాల్లోగా పూర్తి వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని మేఘాలయ

ప్రధాన కార్యదర్శికి, పోలీస్ డైరెక్టర్ జనరల్‌కు నోటీసులు జారీ చేసిన కమిషన్

సహాయక చర్యల స్థితి, బాధిత కుటుంబాలకు పరిహారం, పోలీసు దర్యాప్తుతో పాటు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకున్న చర్యలు ఈ నివేదికలో ఉంటాయని అంచనా

నాడు పోస్టు చేయడమైనది: 11 FEB 2026 2:42PM by PIB Hyderabad

మేఘాలయలోని తూర్పు జయంతియా హిల్స్‌లో ఉన్న థాంగ్‌స్కాయి ప్రాంతంలో అక్రమంగా నిర్వహిస్తున్న బొగ్గు గనిలో 2026 ఫిబ్రవరి 5న జరిగిన పేలుడులో 18 మంది కార్మికులు మరణించారన్న పత్రికా కథనాలను జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సీసుమోటోగా స్వీకరించిందిఈ ఘటనలో మరికొందరు శిథిలాల కింద చిక్కుకుని ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి.

 

ఈ వార్తా నివేదికలోని అంశాలను గమనించిన కమిషన్అదే నిజమైతే బాధితుల మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన తీవ్రమైన అంశంగా పరిగణిస్తుందిఅందువల్ల రెండు వారాల్లోగా ఈ అంశంపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని మేఘాలయ ప్రధాన కార్యదర్శిపోలీసు డైరెక్టర్ జనరల్‌కు నోటీసులు జారీ చేసింది.

 

సహాయక చర్యల స్థితిబాధిత కుటుంబాలకు పరిహారంపోలీసు దర్యాప్తుతో సహా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికార వర్గాలు తీసుకున్న/ప్రతిపాదించిన చర్యల వివరాలు నివేదికలో ఉంటాయని భావిస్తున్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2226483) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali-TR