రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భువనేశ్వర్ రాజధాని ప్రాంత రింగు రోడ్డు నిర్మాణానికి బిడ్డర్ల నుంచి ఎన్‌హెచ్ఏఐకు అపూర్వ స్పందన

నాడు పోస్టు చేయడమైనది: 10 FEB 2026 3:06PM by PIB Hyderabad

ఒడిశాలో 111 కి.మీపొడవైన ఆరు వరుసల యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ క్యాపిటల్ రీజియన్ రింగు రోడ్డు (భువనేశ్వర్ బైపాస్ప్రాజెక్టు నిర్మాణానికి బిడ్డర్ల నుంచి ఎన్‌హెచ్ఏఐకి అపూర్వ స్పందన లభించిందిమూడు ప్యాకేజీలుగా చేపట్టే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎన్‌హెచ్ఏఐ టెండర్లను ఆహ్వానించిందిఅన్ని ప్యాకేజీలకు బిడ్డర్ల నుంచి ప్రోత్సాహకరమైన స్పందన లభించిందిఈ ప్రాజెక్టులోని ప్యాకేజీ-Iకు 23, ప్యాకేజీ-IIకు 25, ప్యాకేజీ IIIకు 16 బిడ్లు వచ్చాయిఅన్ని ప్యాకేజీలకు ఉన్న పోటీనివీటిపై టెండరుదారులకున్న ఆసక్తిని ఇది తెలియజేస్తోందిమార్చి 2026 నాటికి బిడ్లు ఖరారవుతాయని భావిస్తున్నారుప్రాజెక్టులు కేటాయించిన వెంటనే పనులు ప్రారంభమవుతాయిఅలాగే 2.5 ఏళ్ల కాల పరిమితిలో వీటిని పూర్తి చేయాల్సి ఉంటుంది.

కేంద్ర మంత్రి వర్గం ఆరు వరుసల యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ క్యాపిటల్ రీజియన్ రింగు రోడ్డు (భువనేశ్వర్ బైపాస్ప్రాజెక్టుకు ఆమోద ముద్ర వేసిందిరామేశ్వర్ నుంచి టాంగీ వరకు హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హెచ్ఏఎంవిధానంలో 111కి.మీపొడవైన రోడ్డును మూడు ప్యాకేజీలుగా ఈ ప్రాజెక్టు ద్వారా అభివృద్ధి చేస్తారుఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.8,307.74 కోట్లుసుమారుగా 96 శాతం మేర భూసేకరణ పూర్తయిందిఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అటవీవన్యప్రాణిపర్యావరణ అనుమతులు సైతం పూర్తయ్యాయి.

ప్రాంతీయ అనుసంధానాన్నిభువనేశ్వర్కటక్ఖోర్ధా పట్టణ ప్రాంతాల్లో రద్దీని తగ్గించి రవాణాను ఈ క్యాపిటల్ రీజియన్ రింగు రోడ్డు (భువనేశ్వర్ బైపాస్మెరుగుపరుస్తుందిఈ నియంత్రిత ప్రవేశం కలిగిన ఈ కారిడార్ ప్రాంతీయ అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందిరవాణా ఖర్చులను తగ్గిస్తుందిపెద్ద మొత్తంలో ఉద్యోగావకాశాలను కల్పిస్తుందిదీర్ఘకాలంలో ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుందిఅదే సమయంలో ఈ ప్రాంతంలో సురక్షితమైనవేగవంతమైనసుస్థిరమైన ప్రయాణాన్ని అందిస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2225964) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी