ఆయుష్
azadi ka amrit mahotsav

న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రేపు ఔషధ మొక్కలపై చింతన్ శిబిర్‌ను నిర్వహిస్తున్న జాతీయ ఔషధ మొక్కల బోర్డు


చింతన్ శిబిర్‌ను ప్రారంభించనున్న కేంద్ర సహాయ మంత్రి శ్రీ ప్రతాప్ రావ్ జాదవ్
ఈ రంగంలో విధానం, పరిశోధన, సుస్థిరాభివృద్ధిపై చర్చించనున్న నిపుణులు

నాడు పోస్టు చేయడమైనది: 10 FEB 2026 1:47PM by PIB Hyderabad

2026, ఫిబ్రవరి 11న ఔషధ మొక్కలపై చింతన్ శిబిర్‌ను ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ ఔషధ మొక్కల బోర్డు (ఎన్ఎంపీబీనిర్వహించనుందిదీనిలో దేశంలో ఔషధ మొక్కల రంగానికి సంబంధించిన ముఖ్యమైన విధానాలుపరిశోధనఅమలులో ఎదురవుతున్న సమస్యలపై దీనిలో చర్చిస్తారు.

ప్రారంభ కార్యక్రమానికి ఆయుష్ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), ఆరోగ్యంకుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్ రావ్ జాదవ్ ముఖ్య అతిథిగా హాజరవుతారుఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కొటేచా గౌరవ అతిథిగా హాజరవుతారుఆయుష్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శిఆర్థిక సలహాదారు శ్రీ హొవ్యేద అబ్బాస్ ప్రత్యేక అతిథిగా హాజరవుతారు.

చింతన్ శిబిర్ అనంతరం బోర్డు సమావేశం జరుగుతుందిఆ తర్వాత జరిగే టెక్నికల్ సెషన్లుప్యానెల్ చర్చల్లో నిపుణులువిధాన రూపకర్తలుపరిశోధకులుపారిశ్రామిక ప్రతినిధులు పాల్గొంటారుఔషధ మొక్కల రంగంలో విధాన నియమాలను బలోపేతం చేయడం.. పరిశోధనఆవిష్కరణలను ప్రోత్సహించడంఅమల్లో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించడంపై చర్చల్లో ప్రధాన దృష్టి సారిస్తారు.

విధానపరమైన జోక్యంపరిశోధనా పురోగతులుసంస్థాగత బలోపేతానికి ఔషధ మొక్కల రంగంలో ప్రధాన విభాగాలను గుర్తించేలా వ్యూహాత్మక దిశను చింతన్ శిబిర్ అందిస్తుందని భావిస్తున్నారుసాగు విస్తరణకుపరిరక్షణకువిలువ జోడింపునకుమార్కెట్ అనుసంధానాన్ని అందించే సమన్వయపూర్వకమైనభవిష్యత్తుకు తగిన ప్రణాళికను రూపొందించడంలో ఈ చర్చల ఫలితాలు సహకరిస్తాయిఅలాగే ఆయుష్ వ్యవస్థను బలోపేతం చేస్తూ.. ఈ రంగంలో సుస్థిరాభివృద్ధిని ప్రోత్సహిస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2225811) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Punjabi