పార్లమెంటరీ వ్యవహారాలు
42 సంప్రదింపుల కమిటీల ఏర్పాటు
నాడు పోస్టు చేయడమైనది:
04 FEB 2026 5:10PM by PIB Hyderabad
18వ లోక్సభ ఏర్పడిన తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా కన్సల్టేటివ్ కమిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ (సంప్రదింపుల కమిటీ నిర్వహణ వ్యవస్థ-సీసీఎంఎస్) పోర్టల్‌ను ప్రారంభించారు. మొత్తం 42 సంప్రదింపుల కమిటీలు (సలహా కమిటీలు) ఏర్పాటు చేశారు. వాటి సభ్యత్వ వివరాలను సీసీఎంఎస్ పోర్టల్ https://oams.nic.in/ccms/Index.aspx లో చూడవచ్చు. ఈ వేదిక సంబంధిత భాగస్వాముల మధ్య సులభమైన సంభాషణలు, ఎజెండా వివరాలు, సమావేశ నివేదికలు మొదలైన పత్రాల మార్పిడికి సహాయపడుతుంది. పోర్టల్ మెరుగుల కోసం అవసరమైన చర్యలు, భాగస్వాముల అవసరాలను తీర్చడానికి మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు సమీక్షలు, చర్యలు చేపడుతోంది.
అన్ని కార్యకలాపాలు కాగితరహిత పద్ధతిలో జరగడం వల్ల, ఈ పోర్టల్ జాప్యాన్ని, కాగితపు పనిని పరిపాలనా వ్యయాన్ని గణనీయంగా తగ్గించడానికి ఉద్దేశించారు. పోర్టల్ వినియోగాన్ని మెరుగుపరచడానికి, సౌలభ్యాన్ని, డేటా భద్రతను, వాటాదారుల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడానికి సమయానుకూలంగా వివిధ చర్యలు తీసుకుంటున్నారు.
ఈ సమాచారాన్ని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి (స్వతంత్ర),పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ నేడు లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలియజేశారు.
***
(రిలీజ్ ఐడి: 2223809)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10