గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలలు
నాడు పోస్టు చేయడమైనది:
04 FEB 2026 1:41PM by PIB Hyderabad
దేశంలో 2026 జనవరి 1 నాటికి మంజూరు చేసిన ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలలు (ఈఎమ్ఆర్ఎస్‌లు) 723, పనిచేస్తున్న ఈఎమ్ఆర్ఎస్‌లు 499 అని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ దుర్గాదాస్ ఉయికే నక్షత్రం గుర్తు లేని ప్రశ్నకు రాజ్య సభలో ఈ రోజు ఇచ్చిన సమాధానంలో తెలియజేశవారు. రాష్ట్రం వారీ, కేంద్ర పాలిత ప్రాంతం వారీ మంజూరు చేసిన, కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఈఎమ్ఆర్ఎస్‌ల సంఖ్యను అనుబంధ పత్రంలో పేర్కొన్నారు.
గత అయిదు సంవత్సరాల్లో ఈఎమ్ఆర్ఎస్‌ల కోసం కేటాయించిన నిధులతో పాటు ఉపయోగించిన మొత్తం నిధుల సంవత్సరం వారీ వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి:
(రూ.కోట్లలో)
|
క్రమ సంఖ్య
|
ఆర్థిక సంవత్సరం
|
కేటాయించిన నిధి
(ఆర్ఈ)
|
ఉపయోగం తీరు
|
|
1
|
2020-21
|
1,200.00
|
936.28
|
|
2
|
2021-22
|
1,153.00
|
1,322.78
|
|
3
|
2022-23
|
1,999.90
|
2,014.95
|
|
4
|
2023-24
|
2,471.81
|
2,446.24
|
|
5
|
2024-25
|
4,748.92
|
4,713.21
|
పన్నెండో తరగతి వరకు నిర్వహిస్తున్న ఈఎమ్ఆర్ఎస్‌లు, 480 మంది విద్యార్థుల వరకు చదువుకుంటున్న ఈఎమ్ఆర్‌ఎస్‌లకు ఒక్కో ఈఎమ్ఆర్ఎస్‌కు 31 బోధన పదవులనూ, 21 బోధనేతర పదవులనూ మంజూరు చేశారు. 2025 డిసెంబరు 31 నాటికి ఈఎమ్ఆర్ఎస్‌లలో రెగ్యులర్ బోధన సిబ్బంది సంఖ్య 6,605 మందిగా ఉంటే, బోధనేతర సిబ్బంది సంఖ్య 1,832గా ఉంది. ప్రత్యక్ష నియామకానికి అదనంగా, డిప్యూటేషన్ విధానంలో సిబ్బంది బదులుగా పంపడానికి గాను ఎన్ఈఎస్‌టీఎస్ సూచించింది. దీనికి తోడు, రాష్ట్రాల ఈఎమ్ఆర్ఎస్ సొసైటీలు ఉద్యోగ ఖాళీలు ఏవైనా ఉంటే గనక అతిథి టీచర్ల సేవలను పొందుతున్నాయి. విద్యాబోధన కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా చూడటానికి బోధనేతర సిబ్బందిని అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన గాని, లేదా స్థానికంగా ఇతరత్రా ఏర్పాట్లు గాని చేస్తున్నాయి కూడా. అనుబంధ పత్రం
‘‘ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలల’’ విషయంలో శ్రీ సమీరుల్ ఇస్లామ్ అడిగిన నక్షత్రం గుర్తు లేని ప్రశ్న సంఖ్య 627కు రాజ్యసభలో ఇచ్చిన సమాధానంలో పార్ట్ (ఎ)లో ప్రస్తావించిన అనుబంధ పత్రం ఇది..
2026 జనవరి 1 నాటికి రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం వారీగా మంజూరు చేసిన ఈఎమ్ఆర్ఎస్‌లతో పాటు పనిచేస్తున్న ఈఎమ్ఆర్ఎస్‌లు
|
క్రమ సంఖ్య
|
రాష్ట్రం పేరు
|
మంజూరు చేసిన
ఈఎమ్ఆర్ఎస్‌లు
|
ప్రస్తుతం
పనిచేస్తున్న
ఈఎమ్ఆర్ఎస్‌లు
|
|
1
|
ఆంధ్రప్రదేశ్
|
28
|
28
|
|
2
|
అరుణాచల్ ప్రదేశ్
|
10
|
5
|
|
3
|
అస్సాం
|
17
|
6
|
|
4
|
బీహార్
|
3
|
2
|
|
5
|
ఛత్తీస్‌గఢ్
|
75
|
75
|
|
6
|
దాద్రా, నగర్ హవేలీ; దమన్, డియూ
|
1
|
1
|
|
7
|
గుజరాత్
|
47
|
44
|
|
8
|
హిమాచల్ ప్రదేశ్
|
4
|
4
|
|
9
|
జమ్మూ, కాశ్మీర్
|
6
|
6
|
|
10
|
జార్ఖండ్
|
91
|
51
|
|
11
|
కర్నాటక
|
12
|
12
|
|
12
|
కేరళ
|
4
|
4
|
|
13
|
లద్దాఖ్
|
3
|
-
|
|
14
|
మధ్య ప్రదేశ్
|
71
|
63
|
|
15
|
మహారాష్ట్ర
|
39
|
37
|
|
16
|
మణిపూర్
|
21
|
5
|
|
17
|
మేఘాలయ
|
37
|
2
|
|
18
|
మిజోరం
|
17
|
11
|
|
19
|
నాగాలాండ్
|
22
|
3
|
|
20
|
ఒడిశా
|
111
|
47
|
|
21
|
రాజస్థాన్
|
31
|
31
|
|
22
|
సిక్కిం
|
4
|
4
|
|
23
|
తమిళనాడు
|
8
|
8
|
|
24
|
తెలంగాణ
|
23
|
23
|
|
25
|
త్రిపుర
|
21
|
12
|
|
26
|
ఉత్తర ప్రదేశ్
|
4
|
3
|
|
27
|
ఉత్తరాఖండ్
|
4
|
4
|
|
28
|
పశ్చిమ బెంగాల్
|
9
|
8
|
|
|
Total మొత్తం
|
723
|
499
|
***
(రిలీజ్ ఐడి: 2223156)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5