అణుశక్తి విభాగం
azadi ka amrit mahotsav

పార్లమెంటు ప్రశ్న: శాంతి చట్టం పర్యవసానాలు

प्रविष्टि तिथि: 29 JAN 2026 6:02PM by PIB Hyderabad

అణు విద్యుత్ ఉత్పత్తి కోసం అణు ఇంధనాన్ని, అయనీకరణ వికిరణాన్ని ప్రోత్సహించడానికి, అభివృద్ధి చేయడానికి... ఆరోగ్య సంరక్షణ, ఆహారం, నీరు, వ్యవసాయం, పరిశ్రమ, పరిశోధన, పర్యావరణ రంగాల్లో దానిని విస్తృతంగా ఉపయోగించడానికి... అణు విజ్ఞానం, సాంకేతికతలో ఆవిష్కరణల కోసం... అలాగే దాని సురక్షితమైన, భద్రమైన వినియోగానికి ఒక పటిష్ఠమైన నియంత్రణ విధానాన్ని ఏర్పాటు చేయడం కోసం శాంతి చట్టాన్ని రూపొందించారు. 

కృత్రిమ మేధ, హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, క్వాంటం టెక్నాలజీలు, స్వదేశీ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్‌లను ఉపయోగించే ఉన్నత స్థాయి డేటా-ఆధారిత పరిశోధన, డేటా సెంటర్ల కోసం అణు ఇంధనం స్థిరమైన, నమ్మదగిన, నిరంతర విద్యుత్ సరఫరాను అందించగలదు. ఆరోగ్య సంరక్షణ, ఆహారం, నీరు, వ్యవసాయం, పరిశ్రమ, పరిశోధన, పర్యావరణం రంగాల్లో అణు విద్యుత్ విస్తృత ఉపయోగం కలిగి ఉంటుంది. అధునాతన పదార్థాల పరిశోధన, కచ్చితత్వ తయారీ, అంతరిక్ష సాంకేతికతలు, పారిశ్రామిక ఆటోమేషన్‌ సహా భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న అప్లికేషన్లకు మద్దతు ఇవ్వడానికి కృత్రిమ మేధస్సు కోసం దాని వినియోగంతో పాటు భారత అభివృద్ధి ఆకాంక్షలను నెరవేర్చడంలో... సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో ఇది కీలకమైనది. 

శాంతి చట్టంలోని కీలక నిబంధనలు అణు పదార్థాలు, అణు విద్యుత్ కేంద్రాల భద్రత, సంరక్షణ చర్యలను అమలు చేయడానికి వీలు కల్పిస్తాయి. ఇందులో నిరంతర పర్యవేక్షణ, అకౌంటింగ్, నిఘా వంటివి భాగంగా ఉంటాయి. 

అణు విద్యుత్ ప్లాంట్లలో అణు భద్రతను అమలు చేయడానికి భారత్ ఇప్పటికే బలమైన వ్యవస్థను కలిగి ఉంది. దేశంలో పౌర అణు విద్యుత్ కేంద్రాల భద్రతను నిర్ధారించే బాధ్యత పూర్తిగా అణుశక్తి నియంత్రణ మండలి (ఏఈఆర్‌బీ)పైనే ఉంది. ఏఈఆర్‌బీకి చట్టబద్ధ హోదాను కల్పించడం కోసం శాంతి చట్టం భద్రతా పర్యవేక్షణ పనితీరును నిర్వహించే నియంత్రణ సంస్థగా ఏఈఆర్‌బీని ఏర్పాటు చేసింది. ఇది దేశంలో అణు, రేడియేషన్ భద్రత నియంత్రణ కోసం చట్టపరమైన విధానాన్ని బలోపేతం చేస్తుంది. శాస్త్రీయ విధానం, ఆపరేటింగ్ అనుభవం, ఉత్తమ అంతర్జాతీయ పద్ధతుల ఆధారంగా అత్యున్నత భద్రతా ప్రమాణాలను కొనసాగించడానికి ప్రయత్నిస్తుంది. సమ్మతిని ధృవీకరించడానికి లైసెన్స్ పొందిన కేంద్రాలను క్రమం తప్పకుండా తనిఖీ చేసే అధికారం ఏఈఆర్‌బీ ఇన్‌స్పెక్టర్లకు ఉంది. అనుమతులకు సంబంధించి లోపాన్ని గుర్తించిన సందర్భాల్లో దిద్దుబాటు కోసం సిఫార్సులను, సాంకేతిక మార్గదర్శకత్వాన్ని ఏఈఆర్‌బీ అందిస్తుంది. అనుమతులు లేకపోవడం వంటి తీవ్రమైన పరిస్థితుల్లో ఆపరేటింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేయు, రద్దు చేయు అధికారం ఏఈఆర్‌బీకి ఉంటుంది.

కేంద్ర శాస్త్ర-సాంకేతిక, భూ విజ్ఞాన శాస్త్ర శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యతలు), ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణు ఇంధనం, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు రాజ్యసభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని తెలియజేశారు.

 

***


(रिलीज़ आईडी: 2220489) आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी