రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
4 గిన్నిస్ ప్రపంచ రికార్డులను నమోదు చేసినందుకు ఎన్‌హెచ్ఏఐ బృందం, రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ ను అభినందించిన కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ
प्रविष्टि तिथि:
20 JAN 2026 9:26PM by PIB Hyderabad
6-వరుసల బెంగళూరు-కడప-విజయవాడ ఆర్థిక కారిడార్‌లోని ప్యాకేజీ-2, ప్యాకేజీ-3లలో నిరంతరాయంగా తారు రహదారిని నిర్మించినందుకు గాను 4 గిన్నిస్ ప్రపంచ రికార్డులను నెలకొల్పిన సందర్భంగా ఎన్‌హెచ్ఏఐ బృందాన్ని, నిర్మాణ సంస్థ- రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ ను కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ అభినందించారు.
కఠినమైన నాణ్యతా ప్రమాణాలతో అధునాతన సాంకేతికత వల్ల సాధ్యమైన ఈ విజయం పెరుగుతున్న భారత్ ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని, నిర్మాణ సామర్థ్యాన్ని తెలియజేస్తోందని కేంద్ర మంత్రి అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో ప్రపంచ స్థాయి రహదారుల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనలో కొత్త ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పడంలో దేశానికి ఉన్న నిబద్ధతను ఇది బలపరుస్తుందని ఆయన పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 2216730)
आगंतुक पटल : 4