ఉక్కు మంత్రిత్వ శాఖ
భారత్ స్టీల్ - 2026 సదస్సు: మీడియా భాగస్వాములను ఆహ్వానించిన ఉక్కు మంత్రిత్వ శాఖ
प्रविष्टि तिथि:
05 JAN 2026 8:17PM by PIB Hyderabad
భారత్ స్టీల్ - 2026 పేరుతో ఏప్రిల్ 16, 17 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ సదస్సునీ, ప్రదర్శననీ నిర్వహిస్తోంది. భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఉక్కు రంగ భవిష్యత్తుపై చర్చించేందుకు విధాన రూపకర్తలు, పరిశ్రమల అధిపతులు, సాంకేతిక నిపుణులు, పెట్టుబడిదారులు, అంతర్జాతీయ వాటాదారులకు ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ వేదికగా ఈ భారత్ స్టీల్ కార్యక్రమం ఉపకరిస్తుంది.
భారత ఉక్కు రంగ భవిష్యత్ దార్శనికత, ప్రభుత్వ విధానాల దిశానిర్దేశం, పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పటమే ఈ సదస్సు లక్ష్యం. భారత ప్రభుత్వానికి, ప్రపంచ ఉక్కు వ్యవస్థ మధ్య బలమైన సమన్వయాన్ని పెంపొందించటానికి ఇది వేదిక అవుతుంది. భారత ప్రభుత్వ ఉన్నతాధికారులు, కీలక కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, భారత, ప్రపంచ ప్రముఖ ఉక్కు, గనుల కంపెనీల సీఈఓలు, అంతర్జాతీయ సాంకేతిక రంగ నిపుణులు, ఆర్థిక సంస్థలు, వాణిజ్య సంస్థలు, అంతర్జాతీయ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. ఉక్కు రంగంలో సుస్థిరత, ఆవిష్కరణలు, దీర్ఘకాలిక వృద్ధిపై దృష్టి సారించే ముఖ్యమైన విధానపరమైన చర్చలు, పారిశ్రామిక ప్రకటనలు, వాణిజ్య సహకారాలు, విజ్ఞానాన్ని పంచుకోవటం వంటి సెషన్లకు భారత్ స్టీల్ వేదిక కానుంది.
స్థాయి, ప్రాముఖ్యత, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని దృష్టిలో పెట్టుకుని భారత్ స్టీల్ కార్యక్రమం జాతీయంగా, ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించి సమగ్ర, ప్రభావవంతమైన, బహుముఖ వేదికల ద్వారా వార్తల్ని అందించేందుకు ప్రముఖ మీడియా సంస్థలతో భాగస్వామ్యం కోసం ఉక్కు మంత్రిత్వ శాఖ ఎదురుచూస్తోంది.
భారత్ స్టీల్ 2026తో భాగస్వామ్యానికి డిజిటల్ మీడియా, ప్రింట్ (మ్యాగజైన్లు, వార్తాపత్రికలు), ఎలక్ట్రానిక్, టీవీ వంటి వివిధ విభాగాల మీడియా భాగస్వాములను కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తోంది. ఈ సదస్సులోని కీలక సందేశాలను, విధానపరమైన నిర్ణయాలను, పారిశ్రామిక దృక్పథాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లటంలో మీడియా భాగస్వాములు కీలక పాత్ర పోషిస్తారు.
ప్రత్యేక బ్యానర్లు, సోషల్ మీడియా ప్రచారం ద్వారా వెబ్, డిజిటల్ ప్రచారం, ప్రింట్ మీడియాలో ప్రకటనల ప్రచురణ, సంపాదకీయాల కవరేజీ, ఎలక్ట్రానిక్, టెలివిజన్ మాధ్యమాల ద్వారా ప్రచార కంటెంట్, ఇంటర్వ్యూలు, చర్చలు, ఈవెంట్ విశేషాల ప్రసారం వంటివి ప్రతిపాదిత సహకార పరిధిలో ఉంటాయి. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, వారితో సంబంధాలు కొనసాగించటానికి కార్యక్రమానికి ముందు, ఈవెంట్ సమయంలో, కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా ఈ ప్రచారాన్ని కొనసాగించాలని సంబంధిత శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
భారత్ స్టీల్ తో భాగస్వామ్యం కుదుర్చుకునే మీడియా సంస్థలకు మెరుగైన గుర్తింపు, ప్రభుత్వ, పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అయ్యే అవకాశం, ప్రత్యేక కంటెంట్, ఇంటర్య్వూలు, పత్రికా సమావేశాలు, సదస్సు సమయంలో ప్రత్యక్ష కవరేజీకి అవకాశం ఉంటుంది. ఉక్కు రంగంలో ప్రభుత్వ కీలక వేదికల్లో ఒకటైన ఈ సదస్సులో మీడియా సంస్థలు చురుగ్గా పాలుపంచుకోవటానికి ఈ భాగస్వామ్యం వీలు కల్పిస్తుంది.
ఆసక్తి గల మీడియా సంస్థలు, సంస్థ ప్రొఫైల్‌ను ఈ మెయిల్ అడ్రసులకు పంపవచ్చు:
bharat-steel[at]gov[dot]in
corpcom@nmdc.co.in
siddharthgautam@tantraa.net
మరిన్ని వివరాలు, సందేహాల నివృత్తి కోసం:
శ్రీ సిద్ధార్థ్ ప్రహ్లాదన్: +91 99117 73993, శ్రీ సిద్ధార్థ్ గౌతమ్: +91 98991 34806ని మీడియా సంస్థలు సంప్రదించవచ్చు.
***
(रिलीज़ आईडी: 2211935)
आगंतुक पटल : 12