రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

భారతీయ తీర రక్షక దళ నౌక సముద్ర ప్రతాప్‌ను ప్రారంభించిన రక్షణ మంత్రి.. భారత్‌లో మొదటిసారి కాలుష్య నియంత్రణ నౌకను నిర్మించిన జీఎస్ఎల్


ఐసీజీ నౌకల్లో అతి పెద్ద నౌక ఇదే..దేశ పర్యావరణ సంబంధ ప్రతిస్పందనల సామర్థ్యాల్నీ,

కోస్తా ప్రాంతాల్లో గస్తీనీ, సముద్ర వాణిజ్య భద్రతనీ పెంచడానికి రంగ ప్రవేశం


మొదటిసారిగా, ముందువరుసలోని ఓ తీరరక్షక దళ నౌకలో మహిళా అధికారుల నియామకం


”పరిణతి చెందిన భారత రక్షణ పరిశ్రమ అనుబంధ విస్తారిత వ్యవస్థకు ప్రతీకగా ఐసీజీఎస్ సముద్ర ప్రతాప్..

సముద్ర వాణిజ్యంలో ప్రస్తుత కాలపు సవాళ్లను ఎదుర్కోవడానికి జీఎస్ఎల్ అధునాతన దృష్టికోణంతో దీన్ని రూపొందించింది’’


ఎలాంటి దుస్సాహసాన్నైనా ధైర్యంగా, దీటుగా తిప్పికొడతామని ప్రత్యర్థులకు స్పష్టమైన సందేశాన్ని ఇచ్చిన ఐసీజీ..

బహుముఖ పాత్ర దీని సొంతం: శ్రీ రాజ్‌నాథ్ సింగ్

‘‘భారత్ ఒక బాధ్యతాయుత సముద్ర వాణిజ్య శక్తి.. హిందూ-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరత్వాలకు పూచీ’’


‘‘నిర్ణీత పనులే కాకుండా, రహస్య సమాచార శక్తిగా ఐసీజీ మారాలి’’

प्रविष्टि तिथि: 05 JAN 2026 12:52PM by PIB Hyderabad

సముద్ర ప్రతాప్’ను కేంద్ర రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ 2026 జనవరి 5న గోవాలో ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ (ఐసీజీఎస్)లో చేర్చారునౌకానిర్మాణంసముద్ర వాణిజ్య సామర్థ్యాలనె పెంచుకోవడంలో స్వయంసమృద్ధిని సాధించే దిశగా ఒక ప్రధాన ముందడుగును ఇది సూచించిందిగోవా షిప్‌యార్డ్ (జీఎస్ఎల్నిర్మించిన రెండు కాలుష్య నియంత్రణ నౌకల్లో ఈ నౌక మొదటిది. 60 శాతానికి పైగా స్వదేశీ సామగ్రిని ఉపయోగించి నిర్మించిన సముద్ర ప్రతాప్మన దేశంలో మొదటి సారి దేశీయంగా తయారయిన కాలుష్య నియంత్రణ నౌకఐసీజీలోని నౌకలన్నింటి కన్నా అతి పెద్ద నౌకసముద్ర ప్రతాప్‌ చేరికతో కాలుష్య నియంత్రణమంటల అదుపుసముద్ర వాణిజ్య భద్రతపర్యావరణ సంరక్షణ విధుల్లో భారతీయ తీర రక్షక దళ కార్యకలాపాల సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందిదీంతో భారత విశాల సముద్ర వాణిజ్య మండలాల్లో ఇది వరకటితో పోలిస్తే మరింత నిఘాతో పాటు ప్రతిస్పందన పూర్వక మిషన్లను చేపట్టే సత్తా కూడా పటిష్ఠమవుతుంది.

భారత్‌లో పరిపక్వ స్థితికి ఎదిగిన రక్షణ పరిశ్రమ అనుబంధ విస్తారిత వ్యవస్థకు ఈ నౌక ఒక నిదర్శనంగా నిలుస్తోందని రక్షణ మంత్రి వర్ణించారుసంక్లిష్టమైన తయారీ సంబంధ సవాళ్లను ప్రభావవంతంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని దీనికి సమకూర్చారన్నారునౌకానిర్మాణ ప్రక్రియలో దేశీయంగా తయారు చేసిన సామగ్రిని 90 శాతం వరకూ పెంచడానికి నిరంతర ప్రయత్నాలు సాగుతున్నాయని మంత్రి తెలిపారు.
‘‘
ఐసీజీఎస్ సముద్ర ప్రతాప్‌ను ప్రత్యేకంగా కాలుష్య నియంత్రణ కోసమే తయారు చేశారుఅయితే దీని భూమిక అంత వరకే పరిమితం కాదుఒకే వేదికపై అనేక సామర్థ్యాల్ని మిళితం చేసినందువల్లఈ నౌక తీరప్రాంత గస్తీని ప్రభావవంతంగా నిర్వహించగలుగుతుందిసముద్ర వాణిజ్య భద్రతను పటిష్ఠపరచగలుగుతుందివర్తమాన సముద్ర వాణిజ్య సంబంధిత సవాళ్లను ఎదుర్కోవడానికి సరళత్వాన్నీసన్నద్ధతనీ పెంచడమే గోవా షిప్‌యార్డు అనుసరించిన ఆధునిక దృష్టికోణం లక్ష్యం ’’ అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వివరించారు.
సముద్ర కాలుష్యం మొదలు తీరప్రాంతాల్లో స్వచ్ఛతఅన్వేషణసహాయక కార్యకలాపాలుసముద్ర వాణిజ్య చట్టాలకు సంబంధించిన నేర నియంత్రణ వరకూ చూస్తే.. బహుళ విధ పాత్రలను ఐసీజీ పోషిస్తున్నందుకుగాను ఐసీజీని రక్షణ మంత్రి ప్రశంసించారుతీరరక్షక దళం తన కర్తవ్యాలను నిర్వర్తిస్తున్న తీరును బట్టి చూస్తేదేశ శత్రువులకు వాళ్లు భారత సముద్ర సరిహద్దులపై కన్నేసినాలేదా ఏదైనా దుస్సాహసానికి తెగబడినా వాళ్లకు దీటైన గుణపాఠం చెబుతామని దీంతో ఒక సుస్పష్ట సందేశాన్ని ఇచ్చినట్లయిందని ఆయన అన్నారు.
ఈ నౌకలో ఆధునిక కాలుష్య గుర్తింపు వ్యవస్థలుకాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ప్రత్యేకించిన నౌకలతో పాటు ఆధునిక అగ్నిమాపక సామర్థ్యాలను కూడా జోడించారుదీనిలో హెలికాప్టర్ హంగర్విమానయాన సహాయక సౌకర్యాలు ఉన్నాయిఇవి దీని వరకూ చేరుకోవడాన్నిదీని ప్రభావశీలత్వాన్నీ చాలావరకూ పెంపొందించ గలుగుతాయిఈ హంగుల కారణంగాఈ నౌక సముద్రంలో అననుకూలంగా స్థితులు తలెత్తినా నిలకడైన సేవల్ని అందించగలుగుతుందనీఫలితంగా వాస్తవ కార్యకలాపాలకు మంచి ఊతం లభించగలదన్న విశ్వాసాన్ని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వ్యక్తం చేశారు.
వాతావరణ మార్పుభూతాపం వంటి సవాళ్ల నడుమ సముద్ర వాణిజ్య పర్యావరణ సంరక్షణ ఒక వ్యూహాత్మక అవసరం మాత్రమే కాదు.. అది ఒక నైతిక బాధ్యత కూడా అని రక్షణ మంత్రి అన్నారుచమురు తెట్టు ఏర్పడ్డ వేళ తగిన ప్రతిచర్యల్ని చేపట్టినందుకూమంటలను అదుపు చేసినందుకూసహాయక కార్యకలాపాలకు నడుం బిగించినందుకూ ఐసీజీని మంత్రి ప్రశంసించారుదీంతో భారత్ పురోగామి పర్యావరణ ప్రతిస్పందన సామర్థ్యాలు కలిగిన కొన్ని దేశాల సరసన స్థానాన్ని సంపాదించిందని ఆయన తెలిపారు. ‘‘త్వరిత గుర్తింపుకచ్చితమైన స్టేషన్-కీపింగ్కుశల రికవరీ వ్యవస్థల ద్వారా  సామర్థ్యాలను సముద్ర ప్రతాప్ మరింత బలోపేతం చేస్తుందికాలుష్యానికి సంబంధించిన సంఘటనలు తలెత్తితే సమయానుగుణ నియంత్రణ సాధ్యమవుతుందిదీంతో ప్రవాళ భిత్తికలుమడ అడవులుమత్స్య పోషణలతో పాటు సముద్రంలో వివిధ జీవులకు హాని కలగకుండా చూడడానికి కూడా వీలవుతుందిఇది తీరప్రాంత సముదాయాలునీలి ఆర్థిక వ్యవస్థ స్థిరత్వంతో నేరుగా ముడిపడి ఉంది’’ అని  ఆయన అన్నారు.

సురక్షిత వాణిజ్యానికీభద్రమైన జీవనానికీసురక్షిత పర్యావరణానికీ పూచీ పడేది స్వచ్ఛ సముద్రమేనని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారుఐసీజీఎస్ సముద్ర ప్రతాప్ వంటి వేదికలు భారత్ ఒక్క తన సముద్ర వాణిజ్య సంబంధిత బాధ్యతను మాత్రమే అర్థం చేసుకోవడానికి పరిమితం కావడం లేదనీవాటిని నెరవేర్చడానికి పూర్తి స్థాయిలో సన్నద్ధమైందని సూచిస్తున్నాయని ఆయన అన్నారుసముద్ర ప్రతాప్ రంగ ప్రవేశం భారత విస్తృత సముద్ర వాణిజ్య దార్శనికతతో ముడిపడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ‘‘సముద్ర వాణిజ్య వనరులు ఏ ఒక్క దేశానికి చెందిన సంపదో కాదుఅవి మానవాళి ఉమ్మడి వారసత్వమని మేం నమ్ముతాంవారసత్వాన్ని పంచుకున్నప్పడుదానిని సంరక్షించాల్సిన బాధ్యతను కూడా పంచుకోవాలిఈ కారణంగానే భారత్ ప్రస్తుతం ప్రపంచ వేదికపై శాంతిస్థిరత్వంలతో పాటు పర్యావరణానికి సంబంధించిన సిద్ధాంతాల పక్షాన గట్టిగా నిలబడింది’’ అని ఆయన అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా సముద్ర వాణిజ్యంలో అనిశ్చితి కొనసాగుతున్న ప్రస్తుత కాలంలోభారత్ కేవలం తన ప్రయోజనాలను రక్షించుకోవడమే కాకుండా పూర్తి హిందూ-పసిఫిక్ ప్రాంతంలో శాంతినీస్థిరత్వాన్నీ కూడా పరిరక్షిస్తోందని చాలా సార్లు నిరూపించిందని రక్షణ మంత్రి అన్నారుఈ వైఖరి భారత్‌ను బాధ్యత కలిగిన సముద్ర వాణిజ్య శక్తిగా నిలబెడుతోందని ఆయన చెప్పారు.
సాంకేతిక విజ్ఞాన ఆధారితబహుళ విధ ముప్పుల నడుమ సముద్ర వాణిజ్య రంగాన్ని నిరంతరం బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం నిబద్ధతతో ఉందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. ‘‘ఐసీజీ ఒక స్పందనాత్మక దళంగా మాత్రమే పనిచేయడం కాకుండాచురుకైన దళంగా ఎదగాలిదీనికి సహకారాన్ని అందించడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ముందుకు వస్తుందినౌకల సేకరణ కావచ్చు.. లేదా కొత్త విభాగాలను ఏర్పాటు చేయడానికి భూమిని అద్దెకివ్వడం కావచ్చు.. మానవ వనరులకు సంబంధించిన అంశాలు కావచ్చు.. ఐసీజీని అన్ని రకాలుగా ఆధునికీకరించడానికి మేం కృషి చేస్తున్నాం’’ అని ఆయన అన్నారు.  
మొదటి సారిఈ నౌకలో ఇద్దరు మహిళా అధికారులు పనిచేయనున్నారుసమ్మిళితమైనస్త్రీ-పురుష సమానత్వాన్ని ప్రోత్సహించాలన్న ప్రభుత్వ దృష్టికోణాన్ని ఆచరణలో పెడుతున్నందుకు ఐసీజీని రక్షణ మంత్రి మెచ్చుకొన్నారుఇవాళ మహిళా అధికారులు పైలట్లుగాపరిశీలకురాళ్లుగాఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లుగాలాజిస్టిక్స్ అధికారులుగాన్యాయాధికారులుగా నియామకాలు అందుకుంటుండడం గర్వకారణందీంతో పాటు వారికి హోవర్‌క్రాఫ్ట్ కార్యకలాపాల కోసం కూడా శిక్షణనిస్తున్నారుముందువరుసలో చురుకైన విధుల్లోనూ వారిని నియమిస్తున్నారని ఆయన అన్నారు. ‘‘ప్రస్తుతంమహిళలు సహాయక పాత్రను నిర్వహించడానికే పరిమితం కావడం లేదువారు ముందువరుసలో యోధురాళ్ల రూపంలో దేశానికి సేవ చేస్తున్నారుఐసీజీఎస్ సముద్ర ప్రతాప్‌లో నియామకం పొందిన ఇద్దరు మహిళా అధికారులు భావితరం వారికి ఆదర్శంగా నిలుస్తున్నారుఐసీజీ అందరికీ అవకాశాల కల్పనతో పాటు అభివృద్ధికి దోహదం చేస్తూనే ఉంటుంది’’ అని ఆయన అన్నారు.
స్వయంసమృద్ధి సాధన దిశగా ఐసీజీ చేస్తున్న ప్రయత్నాలను శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారుప్రభుత్వం ఇచ్చిన ఆత్మనిర్భరత నినాదం ఇప్పుడు పనితీరులో ఓ భాగంగా స్థిరపడిపోయిందని ఆయన అన్నారుమేక్ ఇన్ ఇండియాఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలకు అనుగుణంగాస్వదేశీ వనరులను ప్రోత్సహించడంలో కీలక భూమికను ఐసీజీ పోషించిందిప్రస్తుతం మన తీర రక్షక దళ నౌకల తయారీసేవలుమరమ్మతు మన దేశంలోనే పూర్తి అవుతున్నాయిఇది దీనంతట ఇదే ఒక గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు’’ అని ఆయన అన్నారు.

వర్తమాన కాలం సవాళ్లను ఎదుర్కోవడానికిఐసీజీ ఒక వేదికనిర్ణీత పనుల నుంచి రహస్య సమాచార-ఆధారితఏకీకరణ కేంద్రిత దళంగా మార్పు చెందాల్సిన అవసరం ఎంతయినా ఉందని రక్షణ మంత్రి స్పష్టం చేశారుసముద్ర వాణిజ్య చట్టాల అమలుపర్యావరణ పరిరక్షణసముద్ర వాణిజ్య రంగంలో సైబర్ భద్రత వంటి రంగాల్లో ఐసీజీలో ప్రత్యేక ఉద్యోగాల్ని కల్పించాల్సిన ఆవశ్యకత కూడా ఉందని ఆయన సూచించారు.
ఇటీవల కొన్నేళ్లలో ఐసీజీ ప్రాంతీయ స్థాయిలో ప్రమాణాల్ని నెలకొల్పిందనీఇక ఈ భూమికను ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా విస్తరించాల్సిన సమయం ఆసన్నమైందనీ శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారురాబోయే కాలంలో సముద్ర వాణిజ్య పాలన రంగంలో ప్రమాణాల రూపురేఖల్ని మనమే తీర్చిదిద్దాల్సి ఉంటుందనీసామర్థ్యాల్ని పెంచే కార్యక్రమాలను పటిష్ఠపరచాలనీసహకార పూర్వక వ్యవస్థల్ని ప్రోత్సహించాల్సి ఉంటుందనీ ఆయన అన్నారుఐసీజీ తన కార్యకలాపాలకు సంబంధించిన సిద్ధాంతాలనూసంస్థాగత అభ్యాసాలనూసాంకేతిక నవకల్పనలనూ ప్రపంచవ్యాప్తంగా అనుసరించదగ్గ అత్యుత్తమ ప్రమాణాల స్థాయికి తీసుకుపోగలగాలని మంత్రి అన్నారురక్షణ రంగాన్ని సుదృఢపరచడంలో ఐసీజీ ముఖ్య తోడ్పాటును అందించగలదన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్రక్షణ కార్యదర్శి శ్రీ రాజేశ్ కుమార్ సింగ్ఐసీజీ డైరెక్టర్ జనరల్ శ్రీ పరమేశ్ శివమణిజీఎస్ఎల్ చైర్మన్మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బ్రజేశ్ కుమార్ ఉపాధ్యాయ్‌లతో పాటు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారులు కూడా పాల్గొన్నారు.
ఐసీజీఎస్ సముద్ర ప్రతాప్ గురించి

దేశ సముద్ర వాణిజ్య ప్రయోజనాలను పరిరక్షించడంతో పాటు సురక్షితస్వచ్ఛ సాగర జలాలను సురక్షితంస్వచ్ఛంగా ఉంచాలన్న ఐసీజీ సంకల్పాన్ని సముద్ర ప్రతాప్ చాటిచెబుతోందిఈ నౌక 4,170 టన్నుల బరువు,114.5 మీటర్ల పొడవు ఉందిసముద్ర మార్గంలో 22 మైళ్ల (నాట్స్)కు మించిన వేగంతో ఇది ప్రయాణించగలదుదీనిని 7,500 కిలోవాట్ డీజిల్ ఇంజిన్ల సాయంతో నడుపుతారుఇవి దేశీయంగా అభివృద్ధిపరిచిన నియంత్రణయోగ్య పిచ్ ప్రొపెల్లర్గేర్‌బుక్సుల సాయంతో కదులుతాయిదీంతో ఈ నౌక శ్రేష్ఠమైన గతిశీలత్వాన్నీసరళత్వాన్నీ సంతరించుకొని 6,000 సముద్ర మైళ్ల మేర సహనశక్తిని కలిగి ఉంటుంది.
ఈ నౌకలో అత్యాధునిక వ్యవస్థల్ని ఏర్పాటు చేశారువాటిలో.. కాలుష్య నియంత్రణకు ఉద్దేశించిన ఒక ప్రయోగశాలసులభంగా తీసుకుపోదగ్గ బార్జిలుఅధిక సామర్థ్యం కలిగి ఉండే స్కిమ్మర్లుచెత్తను పోగుచేసుకొని తీసేసే నీటిపై తేలియాడే రకం బూమ్స్సైడ్-స్వీపింగ్ ఆర్మ్‌స్ వంటివి కూడా ఉన్నాయిమంటలను ఆర్పివేసేందుకు ఉద్దేశించిన ఒక వ్యవస్థ (ఎఫ్ఐ-ఎఫ్ఐ క్లాస్ వన్)ను ఈ నౌకకు అమర్చారుడైనమిక్ పొజిషనింగ్సమీకృత బ్రిడ్జి వ్యవస్థసమీకృత ప్లాట్‌ఫార్మ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ఆటోమేషన్‌నుపనితీరు సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు స్వయం చాలక శక్తితో కూడి ఉండే విద్యుత్తు నిర్వహణ వ్యవస్థ‌ను కూడా ఈ నౌకకు సమకూర్చారుదీనిలో 30 మి.మీసీఆర్ఎన్-91 శతఘ్నిరిమోట్ కంట్రోల్‌తో పనిచేయగల 127 మి.మీస్టెబిలైజ్‌డ్ శతఘ్నులు రెండుఆధునిక అగ్నిమాపక వ్యవస్థలు ఉన్నాయి.
ఈ నౌక కోచి ప్రధాన కేంద్రంగా తన విధులను నిర్వహిస్తుందితీరరక్షక దళం పశ్చిమ ప్రాంత కమాండర్ నిర్వాహక నియంత్రణలో ఈ నౌక పనిచేస్తుందిదీనిని కేరళమాహేలు పరిధిగా ఉన్న నంబర్ కోస్ట్ గార్డ్ జిల్లా ప్రధాన కేంద్రం ద్వారా పనిచేయిస్తారు.

 

***


(रिलीज़ आईडी: 2211645) आगंतुक पटल : 23
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Tamil