సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
ఈ-గవర్నెన్స్ కార్యక్రమాల అమలులో అత్యుత్తమ ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించడమే ఈ-గవర్నెన్స్ జాతీయ అవార్డుల లక్ష్యం
ఈ-గవర్నెన్స్ జాతీయ అవార్డులు 2026 కోసం చివరి రోజైన 29.12.2025న 802 నామినేషన్లు
प्रविष्टि तिथि:
02 JAN 2026 5:29PM by PIB Hyderabad
ఈ-గవర్నెన్స్ కార్యక్రమల అమలులో అత్యుత్తమ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడమే ఈ-గవర్నెన్స్ జాతీయ అవార్డుల లక్ష్యం. 2026 సంవత్సరానికి గాను జాతీయ ఈ-గవర్నెన్స్ అవార్డుల కోసం ఏడు విభాగాలను చేర్చారు
విభాగం (I)- డిజిటల్ మార్పు కోసం సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ద్వారా ప్రభుత్వ ప్రక్రియ పునర్నిర్మాణం. ఈ విభాగంలో 4 అవార్డులను ప్రదానం చేస్తారు.
విభాగం (II)- పౌర కేంద్రీకృత సేవల కోసం కృత్రిమ మేధ, ఇతర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల వినియోగంలో వినూత్నత. ఈ విభాగంలో, 3 అవార్డులు ప్రదానం చేస్తారు.
విభాగం (III)- సైబర్ భద్రతలో ఉత్తమ ఈ-గవర్నెన్స్ పద్ధతులు/వినూత్న కార్యక్రమాలు. ఈ విభాగంలో 3 అవార్డులను అందజేస్తారు
విభాగం (IV)- జిల్లా స్థాయిలో ఈ-గవర్నెన్స్ కార్యక్రమాలు. ఈ విభాగంలో 2 అవార్డులు ప్రదానం చేస్తారు.
విభాగం (V)- సేవలను విస్తరించేందుకు గ్రామ పంచాయతీలు లేదా సమానమైన స్థానిక సంస్థల ద్వారా చేపట్టిన క్షేత్ర స్థాయి కార్యక్రమాలు. ఈ విభాగంలో 2 అవార్డులను అందేజేస్తారు.
విభాగం (VI)- రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు/జిల్లాల ద్వారా జాతీయ అవార్డు పొందిన, మిషన్ మోడ్ ఈ-గవర్నెన్స్ ప్రాజెక్టుల పునరావృతం, విస్తరణ. ఈ విభాగంలో 1 అవార్డు అందజేస్తారు.
విభాగం (VII)- కేంద్ర మంత్రిత్వ శాఖలు/రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ద్వారా డిజిటల్ వేదికల్లో డేటా విశ్లేషణ వినియోగం ద్వారా డిజిటల్ మార్పు. ఈ విభాగంలో 1 అవార్డు అందజేస్తారు.
జాతీయ ఈ-గవర్నెన్స్ అవార్డులు 2026 కోసం రూపొందించిన పోర్టల్‌ను 23 సెప్టెంబర్ 2025న ప్రారంభించారు. దీనిని 6 అక్టోబర్ 2025 నుంచి.. 29 డిసెంబర్ 2025 వరకు నామినేషన్ల స్వీకరణ కార్యకలాపాల కోసం వినియోగించారు.
నామినేషన్ల చివరి తేదీ అయిన 29.12.2025 నాటికి జాతీయ ఈ-గవర్నెన్స్ అవార్డుల పోర్టల్‌లో మొత్తం 802 నామినేషన్లు స్వీకరించారు. వివిధ విభాగాల వారీగా అందిన నామినేషన్ల వివరాలు కింది విధంగా ఉన్నాయి:
విభాగం (I): డిజిటల్ మార్పు కోసం సాంకేతికత వినియోగం ద్వారా ప్రభుత్వ ప్రక్రియ పునర్నిర్మాణం-341
విభాగం (II): పౌర కేంద్రీత సేవలను అందించేందుకు కృత్రిమ మేధ, ఇతర ఆధునిక సాంకేతికతల వినియోగంలో ఆవిష్కరణలు-104
విభాగం (III): సైబర్ భద్రతలో ఉత్తమ ఈ-గవర్నెన్స్ పద్ధతులు/వినూత్న కార్యక్రమాలు-23
విభాగం (IV): జిల్లా స్థాయిలో ఈ-గవర్నెన్స్ కార్యక్రమాలు-235
విభాగం (V): సేవలను విస్తరించేందుకు గ్రామ పంచాయతీలు లేదా సమానమైన స్థానిక సంస్థల ద్వారా చేపట్టిన క్షేత్ర స్థాయి కార్యక్రమాలు-1.66 లక్షలు
విభాగం (VI): రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు/జిల్లాల ద్వారా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ గవర్నెన్స్ ప్రాజెక్టుల విస్తరణ-38
విభాగం (VII): కేంద్ర మంత్రిత్వ శాఖలు/రాష్ట్రాల ద్వారా డిజిటల్ వేదికల్లో డేటా విశ్లేషణ వినియోగంతో డిజిటల్ మార్పు-61
జాతీయ అవార్డుల కోసం దరఖాస్తుల మూల్యాంకనంలోని దశలు
(i) డీఏఆర్‌పీజీ జాయింట్ సెక్రటరీ అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ దరఖాస్తులను షార్ట్-లిస్ట్ చేయడం (ii) భారత ప్రభుత్వ అండర్ సెక్రటరీ స్థాయి అధికారుల ద్వారా షార్ట్‌లిస్ట్ చేసిన దరఖాస్తుల స్పాట్ స్టడీ (iii) డీఏఆర్‌పీజీ జాయింట్ సెక్రటరీ అధ్యక్షతన రెండోస్క్రీనింగ్ కమిటీ ద్వారా మళ్లీ మూల్యాంకనం (iv)డీఏఆర్‌పీజీ కార్యదర్శి అధ్యక్షతన జ్యూరీ కమిటీ అవార్డులపై తుది నిర్ణయం తీసుకుంటుంది.
2026 జాతీయ ఈ-గవర్నెన్స్ అవార్డుల్లో (i) ట్రోఫీ (ii) సర్టిఫికేట్ (iii) స్వర్ణ అవార్డు పొందిన సంస్థకు రూ. 10 లక్షల ప్రోత్సాహం, వెండి అవార్డు లభించిన సంస్థకు రూ. 5 లక్షల ప్రోత్సాహాన్ని అందిస్తారు. దీనిని ప్రాజెక్టు,కార్యక్రమం అమలు చేయడానికి లేదా ప్రజా సంక్షేమానికి సంబంధించిన ఏదైనా రంగంలో అంతరాలను తగ్గించడానికి ఉపయోగించాలి.
***
(रिलीज़ आईडी: 2211480)
आगंतुक पटल : 3