హోం మంత్రిత్వ శాఖ
త్రిపుర శాసనసభ స్పీకర్ శ్రీ బిశ్వ బంధు సేన్ మృతికి కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా సంతాపం
తన జీవితంలో ఎక్కువ సమయాన్ని ప్రజాసేవకే అంకితం చేసిన నిబద్ధత కలిగిన నాయకుడైన శ్రీ సేన్ మృతి, ఆ రాష్ట్ర రాజకీయ రంగానికి తీరని లోటు
ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు నా సానుభూతి
प्रविष्टि तिथि:
26 DEC 2025 4:44PM by PIB Hyderabad
త్రిపుర శాసనసభ స్పీకర్ శ్రీ బిశ్వ బంధు సేన్ మృతి పట్ల కేంద్ర హోం, సహకార మంత్రి శ్రీ అమిత్ షా సంతాపం వ్యక్తం చేశారు.
‘‘త్రిపుర శాసనసభ స్పీకర్ శ్రీ బిశ్వ బంధు సేన్ మృతి దిగ్భ్రాంతి కలిగించింది. తన జీవితంలో అధిక భాగం ప్రజా సేవకే అంకితం చేసిన శ్రీ సేన్ మృతి, ఆ రాష్ట్ర రాజకీయ రంగానికి తీరని లోటు. ఆయన కుటుంబానికి, స్నేహితులకు, అభిమానులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి శాంతి శాంతి’’ అని సామాజిక మాధ్యమం ఎక్స్ లో కేంద్ర మంత్రి శ్రీ అమిత్ షా పోస్టు చేశారు.
***
(रिलीज़ आईडी: 2209005)
आगंतुक पटल : 18