రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

తొలి సముద్ర యాత్రకు సిద్ధంగా ఉన్న ఐఎన్ఎస్‌వీ కౌండిన్య – ఇది ప్రాచీన పరిజ్ఞానంతో రూపొందించిన భారతీయ నౌకాదళానికి చెందిన నౌక


చారిత్రక సముద్ర మార్గాలను పునర్దర్శించనున్న నౌక

प्रविष्टि तिथि: 23 DEC 2025 11:09AM by PIB Hyderabad

భారత పురాతన నౌకా నిర్మాణాన్నిసముద్రయాన సంప్రదాయాలను పునరుజ్జీవింప చేస్తూ రూపొందించిన భారత నౌకా దళంలోని సెయిలింగ్ నౌక ఐఎన్ఎస్‌వీ కౌండిన్య 2025 డిసెంబర్ 29న తన తొలి సముద్రయానాన్ని ప్రారంభించనుందిగుజరాత్‌లోని పోర్ బందర్ నుంచి మస్కట్ఒమన్ వరకు ఈ నౌకా యాత్ర కొనసాగుతుందిఅనేక శతాబ్దాలుగా హిందూ మహా సముద్రం‌తో భారత్‌ను అనుసంధానించిన చారిత్రక సముద్రయాన మార్గాలను తిరిగి గుర్తు చేసేలా ఈ యాత్ర కొనసాగుతుంది.

భారతీయ నౌకా నిర్మాణానికి సంబంధించిన పురాతన వర్ణనల నుంచి స్ఫూర్తి పొంది.. పూర్తిగా సంప్రదాయ విధానమైన ‘స్టిచ్డ్-ప్లాంక్’ పద్ధతిలో దీనిని నిర్మించారుచరిత్రచేతి వృత్తి నైపుణ్యంఆధునిక నావికా అనుభవాల అరుదైన కలయికను ఐఎన్ఎస్‌వీ కౌండిన్య ప్రతిబింబిస్తుందిఆధునిక నౌకల మాదిరిగా కాకుండా.. ఈ నౌకలో చెక్క ఫలకాలను కొబ్బరిపీచుతో తయారుచేసిన తాడుసహజ రెసిన్లను ఉపయోగించి ఒకదానితో ఒకటి అతికించారుఒకప్పుడు భారతీయ తీర ప్రాంతం వెంబడిహిందూ మహా సముద్ర తీర ప్రాంతంలో విస్తరించిన నౌకా నిర్మాణ సామర్థ్యాన్ని ఇది తెలియజేస్తుందిఆధునిక సముద్రయానంలోహశోధన శాస్త్రం లేని రోజుల్లో పశ్చిమాసియాఆఫ్రికాఆగ్నేయాసియా కు సుదీర్ఘ సాహసయాత్రలు చేసేలా భారతీయ నావికులకు ఈ సాంకేతికత వీలు కల్పించింది.

(https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=2130294®=3&lang=2)

దేశీయ విజ్ఞాన వ్యవస్థలను తిరిగి అన్వేషించిపునరుద్ధరించేందుకు భారత్ చేపడుతున్న చర్యల్లో భాగంగా .. సాంస్కృతిక మంత్రిత్వ శాఖభారతీయ నౌకా దళంహోడీ ఇన్నోవేషన్స్ సంస్థ మధ్య కుదిరిన త్రైపాక్షిక ఒప్పందం ద్వారా ఈ ప్రాజెక్టును చేపట్టారునౌకా నిర్మాణంలో నిపుణుడైన శ్రీ బాబూ శంకరన్ మార్గనిర్దేశంలో సంప్రదాయ హస్త కళాకారులు ఈ నౌకను నిర్మించారుదీనికి అవసరమైన పరిశోధననమూనాపరీక్షల్లో భారతీయ నౌకాదళంవిద్యా సంస్థలు విస్తృతంగా తోడ్పాటునందించాయిఈ నౌక సముద్రయానానికి అనుకూలంగా ఉంటుంది.

ఈ నౌకకు ప్రసిద్ధ నావికుడు కౌండిన్య పేరును పెట్టారుఈయన ప్రాచీన కాలంలో భారత్ నుంచి ఆగ్నేయాసియాకు ప్రయాణం చేశారని భావిస్తారుఈ నౌక సముద్రయాన దేశంగా భారత్ పోషించిన చారిత్రక పాత్రను ప్రతిబింబిస్తుంది.

 

***


(रिलीज़ आईडी: 2207945) आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Marathi , Urdu , हिन्दी , Gujarati , Tamil