ఔషధాల విభాగం
azadi ka amrit mahotsav

రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ: ఔషధ విభాగం వైద్య పరికరాల తయారీ, నూతన ఆవిష్కరణలు

प्रविष्टि तिथि: 16 DEC 2025 3:37PM by PIB Hyderabad

వైద్య పరికరాల దేశీయ తయారీని ప్రోత్సహించే ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం దేశీయ తయారీ సామర్థ్యం సృష్టికి భారీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా, ప్రోత్సాహకాలు కల్పించడం ద్వారా దేశీయంగా వైద్య పరికరాల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద దేశంలో తయారు చేస్తున్న అత్యున్నత స్థాయి వైద్య పరికరాల జాబితాను అనుబంధంలో జత చేశారు. దిగుమతి చేసుకున్న ఉత్పత్తులతో పోలిస్తే, ఈ వైద్య పరికరాలు 10% నుంచి 30% వరకు తక్కువ ధర కలిగి ఉన్నాయి. దీనివల్ల దేశీయ ఆరోగ్య సంరక్షణ ఖర్చులు తగ్గించేందుకు వీలవుతుంది.

ఈ పథకం కింద, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో ఒక్కొక్కటి చొప్పున వైద్య పరికరాల పార్కులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పార్కులలో అత్యాధునిక తయారీ వ్యవస్థను సృష్టించడం లక్ష్యం. ఈ పార్కులలో నెలకొల్పే  గ్రీన్‌ఫీల్డ్ యూనిట్లకు  ప్లగ్-అండ్-ప్లే సదుపాయాలు కల్పించే ఆధునిక తయారీ వాతావరణాన్ని సృష్టించి, అత్యంత పోటీగల దేశీయ తయారీ దేశీయ తయారీ వ్యవస్థను అభివృద్ధి చేస్తారు. అవుతుంది.

ఈ పార్కుల్లో భూమిని గణనీయమైన సబ్సిడీ రేట్లకు అందిస్తున్నారు. చాలా సందర్భాల్లో స్టాంప్ డ్యూటీపై మినహాయింపులు లేదా రాయితీలు కూడా ఇస్తున్నారు. దీనివల్ల భూమి కొనుగోలు, ప్రాజెక్టు ఏర్పాటుకు అయ్యే ప్రారంభ పెట్టుబడి వ్యయం గణనీయంగా తగ్గుతుంది. ఈ ప్రారంభ వ్యయ ఉపశమనం గ్రీన్‌ఫీల్డ్ పెట్టుబడిదారులకు చాలా కీలకం. భూమి సేకరణ ఖర్చులు,తరువాత ఉమ్మడి సదుపాయాలుగా అందుబాటులోకి వచ్చే నిర్మాణాల ఏర్పాటు ఖర్చులకు బదులు, తమ పెట్టుబడిలో అధిక భాగాన్ని యంత్రాలు, పరికరాలు, సాంకేతికత సమీకరణ, ఆటోమేషన్, నాణ్యతా వ్యవస్థలకు మళ్లించడానికి ఇది వీలు కల్పిస్తుంది.

ఈ పార్కుల సాధారణ లక్షణం పటిష్టమైన ఉమ్మడి మౌలిక సదుపాయాలను కలిగి ఉంటాయి. ఇందులో ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈలకు) అవసరమైన 3డీ డిజైన్ ప్రింటింగ్ కేంద్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాల కూర్పు, ఎలెక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫియరెన్స్ అండ్ కంపాటిబిలిటీ సెంటర్,  మౌల్డింగ్, స్టెరిలైజేషన్, జీవ అనుకూల పరీక్షలు, టాక్సికాలజీ, ఎలక్ట్రానిక్ విడిభాగాల పరీక్ష, విడిభాగాల తనిఖీ, గామా రేడియేషన్ సౌకర్యం,   పశువుల ప్రయోగశాల వంటివి ఉంటాయి. ఇలాంటి సదుపాయాలను సామూహిక ప్రాతిపదికన అందించడం ద్వారా, సాధారణంగా స్వంతంగా ఏర్పాటు చేస్తే పూర్తిగా వినియోగంలోకి రాని ఖరీదైన, భారీ మూలధన అవసరమైన మౌలిక సదుపాయాల్లో సంస్థలు సొంతంగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరాన్ని ఈ పార్కులు తొలగిస్తాయి. దీని వల్ల తయారీ, పరీక్షలు ధృవీకరణకు సంబంధించిన ప్రతి యూనిట్ ఖర్చు గణనీయంగా తగ్గడమే కాకుండా, ఉత్పత్తికీ, అభివృద్ధికీ పట్టే సమయం కూడా తగ్గుతుంది.

ఈ మూడు పార్కులు విద్యుత్తు, నీరు, గిడ్డంగులు, పార్కు నిర్వహణ వంటి కీలక వినియోగాలపై రాయితీ టారిఫ్‌లతో రూపొందాయి. తక్కువ ధరకు భూమి లభ్యత, సామూహిక మౌలిక సదుపాయాలు,  రాయితీ వినియోగాల కలయిక పెట్టుబడి, నిర్వహణ సామర్థ్యాలను రెండింటినీ మెరుగుపరుస్తుంది. మొత్తంగా ఈ చర్యలు తయారీదారులకు ఎక్కువ ఆదాయాన్ని సాధించేందుకు, ధరల పోటీతత్వాన్ని పెంచేందుకు వీలు కల్పిస్తాయి. ఫలితంగా, భారత్ వైద్య పరికరాల ఉత్పత్తికి పటిష్టమైన అంతర్జాతీయ కేంద్రంగా నిలుస్తుంది.

వైద్య పరికరాల పరిశ్రమ బలోపేతం పథకంలో భాగమైన వైద్య పరికరాల రంగంలో సామర్థ్యం పెంపు నైపుణ్యాభివృద్ధి ఉప పథకం ప్రస్తుతం అమలు దశలో ఉంది. ఈ ఉప పథకం కింద, వైద్య పరికరాల పరిశ్రమకు అవసరమైన నైపుణ్యం గల మానవ వనరుల డిమాండ్‌ను తీర్చేందుకు, ఈ రంగంలో అర్హతగల సాంకేతిక సిబ్బంది లభ్యతను గణనీయంగా పెంచేందుకు 18 దరఖాస్తులకు ఆమోదం లభించింది.  వైద్య పరికరాలకు సంబంధించిన విభాగాలలో రెండేళ్ల డిగ్రీ కార్యక్రమాలు, స్వల్పకాలిక కోర్సులు నిర్వహించడానికి ఈ ఆమోదం లభించింది. ఆమోదం పొందిన ఈ కార్యక్రమాల ద్వారా పథకం మూడేళ్ల కాలంలో మొత్తం 750 శిక్షణ సీట్లు అందుబాటులోకి వస్తాయి. వీటిలో పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ కార్యక్రమాలు, స్వల్పకాలిక నైపుణ్యాభివృద్ధి సర్టిఫికెట్ కోర్సులు రెండూ ఉన్నాయి. ప్రస్తుతం, మొదటి విద్యా సంవత్సరంలో మొత్తం 187 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు.

ఫార్మా-మెడ్‌టెక్ రంగంలో పరిశోధన ప్రోత్సాహం (పీఆర్ఐపీ) పథకాన్ని ఔషధ విభాగం ప్రారంభించింది. నూతన వైద్య పరికరాలు సహా ప్రాధాన్యతా రంగాలలో పరిశ్రమ, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌ల పరిశోధన అభివృద్ధి ప్రాజెక్టులకు ఈ పథకం ఆర్థిక సహాయం అందిస్తుంది.

నిరంతర నూతన ఆవిష్కరణలు, తరువాత తరం మెడ్‌టెక్ అభివృద్ధికి పరిశ్రమ, విద్యా సంస్థల మధ్య  సహకారాన్ని ప్రోత్సహించేందుకు ఈ పథకం కింద పేర్కొన్న వ్యూహాలు కలిగిఉంది.

i. వైద్య పరికరాలలో నిర్దిష్ట పరిశోధన సామర్థ్యాలను పెంపొందించడం లక్ష్యం. ఇందులో భాగంగా, పరిశ్రమ, - విద్యా సంస్థల అనుసంధానం, పరిశోధన మౌలిక సదుపాయాల సంస్థాగత బలోపేతం, ప్రతిభావంతులను సిద్ధం చేయడానికి చర్యలు తీసుకున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్)లో అత్యాధునిక సౌకర్యాలతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేశారు. ఫార్మాస్యూటికల్ సైన్సెస్, వైద్య సాంకేతికతలలో వివిధ ప్రత్యేకతలలో పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టరేట్ విద్య అందించేందుకు, అత్యున్నత పరిశోధన నిర్వహించేందుకు నైపర్ జాతీయ ప్రాముఖ్యతగల సంస్థగా ఉంది.

ii. ఈ పథకం కింద, భారతదేశంలో సంస్థాగత పరిశోధన సామర్థ్యాలను పెంచేందుకు, సంస్థాగత మేధో సంపత్తిని అభివృద్ధి చేసేందుకు, ఆచరణలోకి తెచ్చేందుకు, వాణిజ్యీకరించేందుకు పరిశ్రమ, స్టార్టప్‌లు ప్రభుత్వ విద్యా, పరిశోధనా సంస్థలు సమన్వయంతో కలిసి పనిచేయడానికి ప్రోత్సహిస్తారు. పథకం మార్గదర్శకాలలో పేర్కొన్న ప్రతిష్ఠాత్మక సంస్థలతో ఈ సహకారం ఉంటుంది.

దీనికి తోడు, నైపర్ కౌన్సిల్ నైపర్,  ఫార్మాస్యూటికల్స్ వైద్య పరికరాల తయారీ పరిశ్రమ మధ్య వ్యూహాత్మక సమన్వయాన్ని ప్రోత్సహించడానికి సంస్థాగత యంత్రాంగంగా నైపర్ అకాడెమియా-ఇండస్ట్రీ కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. నైపర్ లు,  పరిశ్రమల మధ్య సమన్వయాన్ని సులభతరం చేయడంతో పాటు పరిశోధన ఆధారిత వృద్ధి, ఆవిష్కరణలు, నైపుణ్యం,  విద్యా పరిశోధనను పారిశ్రామిక వినియోగాలుగా మార్చేందుకు ఇది దోహదపడుతుంది. 

అనుబంధం

ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ - పీఎల్ఐ) పథకం కింద భారతదేశంలో తయారవుతున్న కొన్ని అత్యాధునిక  వైద్య పరికరాల వివరాలు 

  • లీనియర్ యాక్సిలరేటర్ (ఎల్ఐఎన్ఏసీ) 

  • లేజర్ అబ్లేషన్ సిస్టమ్

  • రొటేషనల్ కోబాల్ట్ మెషిన్

  • సి-ఆర్మ్ మెషిన్

  • క్యాథ్ ల్యాబ్

  • సిటి స్కాన్ మెషిన్

  • మామోగ్రఫీ మెషిన్

  • ఎంఆర్ఐ మెషిన్

  • ఎంఆర్ఐ కాయిల్స్

  • పిఈటీ  డిటెక్టర్

  • సర్జికల్ ఎక్స్-రే సి-ఆర్మ్ 

  • అల్ట్రాసోనోగ్రఫీ 

  • ఫిక్స్‌డ్ లైన్ ఫ్రీక్వెన్సీ(ఎల్ఎఫ్),  హై ఫ్రీక్వెన్సీ (హెచ్ఎఫ్)  సహా ఎక్స్-రే, 

  • ఎక్స్-రే పానెళ్లు 

  • ఎక్స్-రే పరికరాలు 

  • అనస్థీషియా కిట్లు 

  • అనస్థీషియా యూనిట్ గ్యాస్ స్కావెంజర్లు

  • అనస్థీషియా యూనిట్ వేపరైజర్లు

  • అనస్థీషియా యూనిట్ వెంటిలేటర్లు

  • అనస్థీషియా వర్క్‌స్టేషన్ 

  • ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేటర్లు (ఏఈడీ)

  • బై-ఫేసిక్ డీఫిబ్రిలేటర్లు 

  • డీఫిబ్రిలేటర్లు, ఏఈడీ

  • డయాలసిస్ మెషిన్ 

  • ఎమర్జెన్సీ వెంటిలేటర్లు

  • హీమోడయాలసిస్ కాథెటర్ 

  • హై ఫ్లో ఆక్సిజన్ పరికరాలు 

  • ఇంటెన్సివ్ కేర్ వెంటిలేటర్లు

  • ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ కాథెటర్ సిస్టమ్

  • మైక్రో-కాథెటర్ ట్యూబింగ్ (న్యూరోవాస్కులర్) 

  • ఆక్సిజన్ కాన్‌సెన్‌ట్రేటర్‌లు 

  • గుండె కవాటాలు 

  • తుంటి ఇంప్లాంట్లు 

  • మోకాలి ఇంప్లాంట్లు 

  • పీటీసీఏ బెలూన్ కాథెటర్ 

  • స్టెంట్లు 

కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియా పటేల్ ఈ రోజు రాజ్యసభలో ఒక లిఖితపూర్వక సమాధానం ద్వారా ఈ వివరాలు తెలిపారు. 

 

***


(रिलीज़ आईडी: 2204922) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी