జల శక్తి మంత్రిత్వ శాఖ
నదుల అనుసంధానంలో పురోగతి, అనుమతులు, నిధులు
నాడు పోస్టు చేయడమైనది:
15 DEC 2025 4:08PM by PIB Hyderabad
జాతీయ ప్రణాళిక (ఎన్‌పీపీ) కింద జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) మొత్తం 30 అనుసంధాన ప్రాజెక్టులను గుర్తించింది. వీటిలో మొత్తం 30 అనుసంధానాలకు సంబంధించి ముందస్తు సాధ్యాసాధ్యాల నివేదికలను (పీఎఫ్ఆర్‌లు), 26 అనుసంధానాలకు సంబంధించి సాధ్యాసాధ్యాల నివేదికలను (ఎఫ్ఆర్), 13 అనుసంధానాలకు సంబంధించి వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలను (డీపీఆర్) సంస్థ పూర్తి చేసింది. మొత్తం 30 అనుసంధాన ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిగతులను అనుబంధంలో చూడొచ్చు.
అనుసంధాన ప్రాజెక్టుల అమలులో ప్రస్తుత స్థితిగతులు:
గోదావరి (పోలవరం) – కృష్ణా (విజయవాడ) అనుసంధాన ప్రాజెక్టు జాతీయ ప్రణాళిక (1980)లోని ద్వీపకల్ప విభాగంలో అంతర్భాగం. అనంతరం ఇందిరాసాగర్ పోలవరం ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ అనుసంధాన వ్యవస్థను స్వాయత్తం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత, 2014 నాటి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం కింద ప్రకటించిన పోలవరం సాగునీటి జాతీయ ప్రాజెక్టులో భాగంగా.. ఈ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు అథారిటీ పరిధిలోకి వచ్చింది. లింక్ కెనాల్‌లో నీటి సరఫరా అప్పటి నుంచి మొదలైంది.
ఇంకా, ఎన్‌పీపీ కింద అయిదు అనుసంధాన ప్రాజెక్టులను ప్రాధాన్య ప్రాజెక్టులుగా గుర్తించారు. అవి:
-
కెన్ - బెట్వా అనుసందాన ప్రాజెక్టు (కేబీఎల్పీ)
-
సవరించిన పర్బతీ – కాళీసింధ్ - చంబల్ (పీకేసీ) అనుసంధాన ప్రాజెక్టు
గోదావరి–కావేరి అనుసంధాన ప్రాజెక్టు.. ఇందులో మూడు ఉప విభాగాలున్నాయి:
-
గోదావరి (ఇచ్చంపల్లి) - కృష్ణ (నాగార్జునసాగర్)
-
కృష్ణ (నాగార్జునసాగర్) - పెన్నా (సోమశిల)
-
పెన్నా (సోమశిల) – కావేరీ (గ్రాండ్ ఆనకట్ట)
ప్రాధాన్యతా అనుసంధాన ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి:
కెన్–బెట్వా అనుసంధాన ప్రాజెక్టు (కేబీఎల్పీ):
ఎన్‌పీపీ పరిధిలోని ప్రాజెక్టుల్లో అమలు దశకు చేరిన ఏకైక ప్రాధాన్యతా ప్రాజెక్టు కెన్-బెట్వా అనుసంధాన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 44,605 కోట్లు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంస్థ అయిన కెన్-బెట్వా అనుసంధాన ప్రాజెక్టు అథారిటీ (కేబీఎల్‌పీఏ) ద్వారా రూ. 39,317 కోట్ల సాయాన్ని కేంద్రం అందిస్తుంది. ప్రారంభ కార్యకలాపాల్లో ప్రధానంగా భూ సేకరణ, పునరావాసం, పర్యావరణ నిర్వహణ ప్రణాళిక అమలుపై దృష్టి సారించారు. ఈ ప్రాజెక్టు 2030 నాటికి పూర్తి కావాల్సి ఉంది. ప్రాజెక్టులో ప్రధాన భాగమైన దౌధన్ ఆనకట్ట నిర్మాణ పనులు ఇప్పటికే మంజూరయ్యాయి.
సవరించిన పర్బతీ– కాళీసింధ్– చంబల్ (పీకేసీ) అనుసంధాన ప్రాజెక్టు:
చంబల్ నదీ వ్యవస్థను మరింత సానుకూలంగా వినియోగించుకోవడం కోసం.. ఈఆర్‌సీపీని పీకేసీ అనుసంధాన పథకంతో ఏకీకృతం చేయడంపై అధ్యయనం చేశారు. తద్వారా సవరించిన పీకేసీ అనుసంధాన పథకాన్ని రూపొందించారు. అనంతరం నదుల అనుసంధానంపై ప్రత్యేక కమిటీ (ఎస్సీఐఎల్ఆర్) ద్వారా దీనిని జాతీయ ప్రాధాన్యతా ప్రాజెక్టుగా ప్రకటించారు.
డీపీఆర్ తయారీ కోసం మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖతో ఓ అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. సంబంధిత రాష్ట్రాల గౌరవ ముఖ్యమంత్రులు, గౌరవ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఓ ఒప్పంద అంగీకార పత్రం (ఎంవోఏ)పై సంతకాలు చేశారు. రాజస్థాన్ భాగాలకు సంబంధించిన డీపీఆర్‌లను కేంద్ర జల సంఘం సమీక్ష కోసం ఇ-పీఏఎంఎస్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేశారు.
గోదావరి – కావేరీ అనుసంధాన ప్రాజెక్టు:
ఈ అనుసంధాన పథకం కింద ఉన్న మూడు అనుసంధాన పథకాలకు సంబంధించిన డీపీఆర్‌లు తయారు చేసి, సంబంధిత రాష్ట్రాలతో నిరంతర చర్చల అనంతరం.. మధ్యంతర ఏర్పాటుగా కృష్ణా బేసిన్‌లో బెడ్తి – వార్దా అనుసంధానం ద్వారా నీటిని చేర్చే ప్రతిపాదనతో పాటు, గోదావరి నుంచి దాదాపు 4189 ఎంసీఎం నీటిని మళ్లించే ప్రతిపాదనను రూపొందించారు. సాంకేతిక సాధ్యాసాధ్యాల నివేదిక (టీఎఫ్ఆర్), ముసాయిదా డీపీఆర్, ఈ ప్రతిపాదన అమలు కోసం ఒప్పంద అంగీకార పత్ర (ఎంవోఏ) ముసాయిదాలను ఎన్‌డబ్ల్యూడీఏ రూపొందించి, సంబంధిత రాష్ట్రాలకు అందించింది.
సాధ్యాసాధ్య నివేదికలు, వివరణాత్మక ప్రాజెక్టు నివేదికల (డీపీఆర్) రూపకల్పన సమయంలోనే ప్రతి నదీ అనుసంధాన ప్రాజెక్టుకూ పర్యావరణ ప్రభావ అంచనా (ఈఐఏ) నిర్వహించారు. ఈ అధ్యయనం భౌతిక, జీవ, సామాజిక - ఆర్థిక వాతావరణంపై ప్రాజెక్టు చూపగల సానుకూల, ప్రతికూల ప్రభావాలను క్రమపద్ధతిలో అంచనా వేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రణాళిక, నిర్ణాయక ప్రక్రియల్లో పర్యావరణ అంశాలను ఏకీకృతం చేసేలా చూస్తుంది.
కెన్ - బెట్వా అనుసంధాన ప్రాజెక్టు (కేబీఎల్పీ) విషయానికి వస్తే.. పర్యావరణ ప్రభావ అంచనా (ఈఐఏ) పూర్తై, పర్యావరణ అనుమతి మంజూరైంది. కేబీఎల్పీకి సంబంధించి.. ఆవాస నాణ్యతను మెరుగుపరచడానికి, పక్కనే ఉన్న రక్షిత ప్రాంతాలను అనుసంధానిస్తూ కీలక వన్యప్రాణి కారిడార్ల నిర్వహణకు, అలాగే పులులు, రాబందులు, ఘరియళ్ల వంటి ప్రధాన జాతుల సమగ్ర పరిరక్షణ, నిర్వహణను సులభతరం చేయడానికి సమీకృత ప్రకృతి వనరుల నిర్వహణ ప్రణాళిక (ఐఎల్ఎంపీ)ను రూపొందించారు. పన్నా టైగర్ రిజర్వుతోపాటు దాని చుట్టుపక్కల ఉన్న పర్యావరణ సునిశిత ప్రాంతాల్లో జీవవైవిధ్య పరిరక్షణను ప్రోత్సహించడం కూడా ఐఎల్‌ఎంపీ లక్ష్యం.
ఐఎల్‌ఎంపీని క్రమబద్ధంగా, నిర్దిష్ట కాలపరిమితి లోపు అమలు చేయడం లక్ష్యంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన గ్రేటర్ పన్నా ల్యాండ్‌స్కేప్ కౌన్సిల్ (జీపీఎల్సీ) ఏర్పాటైంది. దౌధన్ ఆనకట్ట నిర్మాణం కోసం.. భూసేకరణ, పునరావాసం, పునరుద్ధరణలో న్యాయబద్ధమైన పరిహారం, పారదర్శకత హక్కు చట్టం- 2013 (ఆర్ఎఫ్‌సీటీఎల్ఏఆర్ చట్టం- 2013) ప్రకారం మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేపడుతోంది. ఈ ప్రాజెక్టు వల్ల దాదాపు 7193 కుటుంబాలు ప్రభావితమవుతాయని సెక్షన్ 11 నోటిఫికేషన్ జారీ చేసిన సమయంలో అంచనా వేశారు. ఒక ప్రత్యేక పునరావాస, పునరుద్ధరణ ప్యాకేజీని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించింది.
పోలవరం సాగునీటి ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతోంది. గోదావరి (పోలవరం) – కృష్ణ (విజయవాడ) అనుసంధాన ప్రాజెక్టు కూడా ఇందులో ఉంది. కేంద్ర ప్రభుత్వం దీనికి ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. పోలవరం సాగునీటి ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటివరకు అందించిన మొత్తం కేంద్ర సాయం/ ఆర్థిక చేయూత రూ. 20,658 కోట్లు.
కెన్ బెట్వా అనుసంధాన ప్రాజెక్టుకు సంబంధించి.. కేబీఎల్‌పీ కోసం రూ. 4469.41 కోట్ల బడ్జెట్ కేటాయింపులు చేయగా.. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో అయిన వాస్తవిక వ్యయం రూ. 3969.79 కోట్లు.
నదుల అనుసంధాన ప్రాజెక్టుల అమలులో రాష్ట్రాల సహకారం అత్యంత కీలకం. రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధన అత్యంత సవాలుతో కూడిన పని. ఇది అంతర్రాష్ట్ర సమస్యలు, భూసేకరణ లేదా చట్టబద్ధమైన అనుమతుల వంటి కారణాల వల్ల నదుల అనుసంధాన ప్రాజెక్టుల అమలులో జాప్యానికి కారణమవుతుంది. నీటి కేటాయింపు, అంతర్రాష్ట్ర నదుల అనుసంధానం, తమ ప్రస్తుత నీటిపారుదల, విద్యుత్ అవసరాలపై చూపే ప్రభావం గురించి రాష్ట్రాలకు ఆందోళనలున్నాయి. కొన్ని ప్రాజెక్టులకు అంతర్జాతీయ కోణాలున్నాయి. వాటికి పొరుగు దేశాల సహకారం అవసరమవుతుంది.
అంతర్రాష్ట్ర నదీ అనుసంధానం కోసం రాష్ట్రాల మధ్య సహకారం కీలకమైనది. సమన్వయంతో అమలయ్యేలా చూసేందుకు.. భారత ప్రభుత్వం సంబంధిత రాష్ట్రాలతో ఏకాభిప్రాయాన్ని పెంపొందించడంలో క్రియాశీలంగా నిమగ్నమై ఉంది. వారి అభిప్రాయాలను తెలుసుకుని ఆందోళనలు, భయాలను పరిష్కరించేలా సంప్రదింపుల విధానాన్ని అవలంబిస్తోంది. పీఎఫ్ఆర్, ఎఫ్ఆర్, డీపీఆర్‌లు సహా ఎన్‌డబ్ల్యూడీఏ రూపొందించిన అన్ని అధ్యయన నివేదికలను.. అభిప్రాయ సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలతో పంచుకుంటారు. రాష్ట్రాల అభిప్రాయాలకు వాటిలో స్థానం కల్పిస్తారు.
ఎన్‌డబ్ల్యూడీఏ సొసైటీ (గౌరవ జలశక్తి శాఖ మంత్రి అద్యక్షతన), ఎన్‌డబ్ల్యూడీఏ నిర్వహణ సంస్థ (జల వనరుల కార్యదర్శి అధ్యక్షతన), నదుల అనుసంధానంపై ప్రత్యేక కమిటీ (ఎస్సీఐఎల్ఆర్), నదుల అనుసంధానం కోసం టాస్క్‌ఫోర్స్ (టీఎఫ్ఐఎల్ఆర్) వంటి కీలక నిర్ణాయక వేదికల్లోనూ రాష్ట్రాలకు భాగస్వామ్యం ఉంటుంది. ఈ వేదికలు ప్రత్యేక సంప్రదింపు సమావేశాలతోపాటు.. క్రియాశీల భాగస్వామ్యాన్ని, రాష్ట్రాలకు సంబంధించిన నిర్దిష్ట సమస్యల పరిష్కారాన్ని సులభతరం చేస్తాయి. తద్వారా, అనుసంధాన పథకాలను సకాలంలో, సహకారంతో అమలు చేయడానికి వీలు కల్పిస్తాయి.
రాజ్యసభలో ఇచ్చిన ఓ లిఖితపూర్వక సమాధానంలో జలశక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ రాజ్ భూషణ్ చౌదరి ఈ సమాచారాన్ని అందించారు.
***
అనుబంధం -
ఎన్‌పీపీ కింద ఉన్న నదీ అనుసంధాన ప్రాజెక్టుల వివరాలు, ప్రస్తుత స్థితి
ద్వీపకల్ప విభాగం
|
క్ర.సం.
|
పేరు
|
లాభం పొందే రాష్ట్రాలు
|
ప్రస్తుత స్థితి
|
|
1
|
మహానది (మణిభద్ర) - గోదావరి (దవళేశ్వరం) లింక్
|
ఆంధ్రప్రదేశ్, ఒడిశా
|
సాధ్యాసాధ్యాలపై నివేదిక పూర్తయింది
|
|
ప్రత్యామ్నాయ మహానది (బార్ముల్)- రుషికుల్య–గోదావరి దవళేశ్వరం) లింక్
|
ఆంధ్రప్రదేశ్, ఒడిశా
|
సాధ్యాసాధ్యాలపై నివేదిక పూర్తయింది
|
|
2
|
గోదావరి (పోలవరం) – కృష్ణ (విజయవాడ) లింక్ @
|
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ
|
సాధ్యాసాధ్యాలపై నివేదిక పూర్తయింది
|
|
3
|
a.) గోదావరి (ఇచ్చంపల్లి) – కృష్ణ (నాగార్జునసాగర్) లింక్
|
తెలంగాణ
|
సాధ్యాసాధ్యాలపై నివేదిక పూర్తయింది
|
|
b.) ప్రత్యామ్నాయ గోదావరి (ఇచ్చంపల్లి) – కృష్ణ (నాగార్జునసాగర్) లింక్*
|
తెలంగాణ
|
డీపీఆర్ పూర్తయింది
|
|
4
|
గోదావరి (ఇచ్చంపల్లి/ ఎస్ఎస్ఎంపీపీ) – కృష్ణ (పులిచింతల) లింక్
|
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
|
డీపీఆర్ పూర్తయింది
|
|
5
|
a.) కృష్ణ (నాగార్జునసాగర్) - పెన్నార్ (సోమశిల) లింక్
|
ఆంధ్రప్రదేశ్
|
సాధ్యాసాధ్యాలపై నివేదిక పూర్తయింది
|
|
b.) ప్రత్యామ్నాయ కృష్ణా (నాగార్జునసాగర్) - పెన్నార్ (సోమశిల ) లింక్ *
|
ఆంధ్రప్రదేశ్
|
డీపీఆర్ పూర్తయింది
|
|
6
|
కృష్ణ (శ్రీశైలం) - పెన్నార్ లింక్
|
ఆంధ్రప్రదేశ్
|
డీపీఆర్ పూర్తయింది
|
|
7
|
కృష్ణ (ఆల్మట్టి) - పెన్నార్ లింక్
|
కర్ణాటక, ఆంధ్రపదేశ్
|
డీపీఆర్ పూర్తయింది
|
|
8
|
a.) పెన్నార్ (సోమశిల) - కావేరి (గ్రాండ్ ఆనకట్ట) లింక్
|
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి
|
సాధ్యాసాధ్యాలపై నివేదిక పూర్తయింది
|
|
b.) ప్రత్యామ్నాయ పెన్నార్ (సోమశిల) - కావేరి (గ్రాండ్ ఆనకట్ట) లింక్*
|
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి
|
డీపీఆర్ పూర్తయింది
|
|
9
|
కావేరి (కట్టాలై) - వైగై - గుండార్ లింక్
|
తమిళనాడు
|
డీపీఆర్ పూర్తయింది
|
|
10
|
పర్బతీ – కాళీసింధ్ – చంబల్ లింక్
|
మధ్యప్రదేశ్, రాజస్థాన్
|
సాధ్యాసాధ్యాలపై నివేదిక పూర్తయింది
|
|
b) సవరించిన పర్బతీ పర్బతీ – కాళీసింధ్ – చంబల్ లింక్
|
మధ్యప్రదేశ్, రాజస్థాన్
|
అమలు కోసం రెండు రాష్ట్రాలు ఎంవోఏపై సంతకం చేశాయి
|
|
11
|
దమన్‌గంగా - పింజల్ లింక్
|
మహారాష్ట్ర (ముంబయికి నీటి సరఫరా మాత్రమే)
|
డీపీఆర్ పూర్తయింది. ‘ప్రాధాన్య అనుసంధానాల’ జాబితా నుంచి తొలగించారు
|
|
12
|
పార్- తాపి- నర్మదా లింక్
|
గుజరాత్, మహారాష్ట్ర
|
డీపీఆర్ పూర్తయింది. ‘ప్రాధాన్య అనుసంధానాల’ జాబితా నుంచి తొలగించారు
|
|
13
|
కెన్ - బెట్వా లింక్
|
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్
|
డీపీఆర్ పూర్తయింది. ప్రాజెక్టు అమలవుతోంది.
|
|
14
|
పంబ - అచ్చంకోవిల్ - వైప్పర్ లింక్
|
తమిళనాడు, కేరళ
|
సాధ్యాసాధ్యాలపై నివేదికక పూర్తయింది
|
|
15
|
బెడ్తి - వార్దా లింక్ @@
|
కర్ణాటక
|
డీపీఆర్ పూర్తయింది
|
|
16
|
నేత్రావతి – హేమావతి లింక్ ***
|
కర్ణాటక
|
సాధ్యాసాధ్యాలకు సంబంధించి ముందస్తు నివేదిక (పీఎఫ్ఆర్) పూర్తయింది
|
* మణిభద్ర, ఇచ్చంపల్లి డ్యాంలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో.. గోదావరి నదిలోని వినియోగంలోకి రాని జలాలను మళ్లించే ప్రాజెక్టు మొదటి దశ కోసం ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనం ద్వారా గోదావరి (ఇచ్ఛంపల్లి) – కృష్ణ (నాగార్జునసాగర్) - పెన్నా (సోమశిల) – కావేరి (గ్రాండ్ ఆనకట్ట) అనుసంధాన పథకాలకు సంబంధించిన డీపీఆర్ పూర్తయింది. దీనిని గోదావరి - కావేరి అనుసంధానంగా పిలుస్తున్నారు. కావేరీ పరీవాహక ప్రాంతానికి ఆనుకుని ప్రవహించే వెల్లార్ నదికి ఉపనది అయిన మణిముక్త నది వద్ద అనుసంధాన కాలువ పూర్తయ్యేలా నివేదికను మరింత నవీకరించారు.
@@ బెడ్తి – వార్దా అనుసంధానం – పీఎఫ్ఆర్ తయారు చేసిన వెంటనే డీపీఆర్ కూడా తయారైంది. సాధ్యాసాధ్యాలపై నివేదిక (ఎఫ్ఆర్)ను ఇంకా రూపొందించలేదు.
@ గోదావరి (పోలవరం) – కృష్ణ (విజయవాడ) అనుసంధానం - ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ దీనిని అమలు చేస్తోంది.
*** నేత్రావతి – హేమవతి అనుసంధానం: కర్ణాటక ప్రభుత్వం యెట్టిన్‌హోళె ప్రాజెక్టును అమలు చేయడంతో.. పీఎఫ్‌ఆర్ తయారీ అనంతరం తదుపరి అధ్యయనాలు చేపట్టలేదు. ఈ అనుసంధానం ద్వారా మళ్లించడానికి నేత్రావతి బేసిన్‌లో అదనపు నీరు అందుబాటులో లేదు.
హిమాలయ విభాగం
|
క్ర.సం.
|
పేరు
|
ప్రయోజనం పొందే రాష్ట్రాలు/ దేశాలు
|
ప్రస్తుత స్థితి
|
|
1.
|
కోసి - మేచి లింక్**
|
బీహార్, నేపాల్
|
పీఎఫ్ఆర్ పూర్తయింది
|
|
2.
|
కోసి-ఘాగ్రా లింక్
|
బీహార్, ఉత్తరప్రదేశ్, నేపాల్
|
సాధ్యాసాధ్యాలపై నివేదిక పూర్తయింది
|
|
3.
|
గండక్ – గంగ లింక్
|
ఉత్తరప్రదేశ్, నేపాల్
|
సాధ్యాసాధ్యాలపై నివేదిక పూర్తయింది
|
|
4.
|
ఘాఘ్రా – యమున లింక్
|
ఉత్తరప్రదేశ్, నేపాల్
|
సాధ్యాసాధ్యాలపై నివేదిక పూర్తయింది
|
|
5.
|
సార్దా – యమున లింక్
|
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్
|
సాధ్యాసాధ్యాలపై నివేదిక పూర్తయింది
|
|
6.
|
యమున – రాజస్థాన్ లింక్
|
హర్యానా, రాజస్థాన్
|
సాధ్యాసాధ్యాలపై నివేదిక పూర్తయింది
|
|
7.
|
రాజస్థాన్-సబర్మతి లింక్
|
రాజస్థాన్, గుజరాత్
|
సాధ్యాసాధ్యాలపై నివేదిక పూర్తయింది
|
|
8.
|
చునార్ – సోన్ బ్యారేజ్ లింక్
|
బీహార్, ఉత్తరప్రదేశ్
|
సాధ్యాసాధ్యాలపై నివేదిక పూర్తయింది
|
|
9.
|
సోన్ ఆనకట్ట – గంగా లింక్ దక్షిణ ఉపనదులు
|
బీహార్, జార్ఖండ్
|
సాధ్యాసాధ్యాలపై ముసాయిదా నివేదిక పూర్తయింది
|
|
10.
|
మానస్- సంకోష్- తీస్తా-గంగ (ఎంఎస్టీజీ) లింక్
|
అస్సాం, పశ్చిమ బెంగాల్, బీహార్
|
సాధ్యాసాధ్యాలపై నివేదిక పూర్తయింది
|
|
11.
|
జోగిఘోపా-తీస్తా-ఫరక్కా లింక్ (ఎంఎస్‌టీజీకి ప్రత్యామ్నాయం)
|
అస్సాం, పశ్చిమ బెంగాల్, బీహార్
|
పీఎఫ్ఆర్ పూర్తయింది
(ఈ ప్రతిపాదనను విరమించుకున్నారు)
|
|
12.
|
ఫరక్కా - సుందర్‌బన్స్ లింక్
|
పశ్చిమ బెంగాల్
|
సాధ్యాసాధ్యాలపై నివేదిక పూర్తయింది
|
|
13.
|
గంగా (ఫరక్కా) - దామోదర్- సువర్ణరేఖ లింక్
|
పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్
|
సాధ్యాసాధ్యాలపై నివేదిక పూర్తయింది
|
|
14.
|
సువర్ణరేఖ - మహానది లింక్
|
పశ్చిమ బెంగాల్, ఒడిశా
|
సాధ్యాసాధ్యాలపై నివేదిక పూర్తయింది
|
30 అనుసంధాన ప్రాజెక్టుల్లో 4 సాధ్యాసాధ్య నివేదికలను (ఫీజిబిలిటీ రిపోర్టులు) సిద్ధం చేయవలసిన అవసరం లేదు:
** కోసి-మెచి అంతర్రాష్ట్ర అనుసంధానం – పీఎఫ్ఆర్ రూపొందించి, అంతర్జాతీయ అంశాల కారణంగా ప్రతిపాదనను విరమించుకున్నారు. అనంతరం బీహార్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు.. కోసి-మెచి రాష్ట్రాంతర్గత అనుసంధాన ప్రాజెక్టును ఎన్‌డబ్ల్యూడీఏ చేపట్టింది.
జోగిఘోపా – తీస్తా – ఫరక్కా అనుసంధానం – పీఎఫ్ఆర్ రూపొందించి, అనంతరం ప్రతిపాదనను విరమించుకున్నారు.
బెడ్తి – వార్దా అనుసంధానం – పీఎఫ్ఆర్ రూపొందించిన అనంతరం నేరుగా డీపీఆర్ తయారు చేశారు. సాధ్యాసాధ్యాలపై నివేదికను తయారు చేయలేదు.
నేత్రావతి – హేమవతీ అనుసంధానం - పీఎఫ్‌ఆర్ తయారీ అనంతరం తదుపరి అధ్యయనాలు చేపట్టలేదు. ఎందుకంటే కర్ణాటక ప్రభుత్వం యెట్టిన్‌హోళె ప్రాజెక్టును అమలు చేసిన తర్వాత, ఈ అనుసంధాన మార్గం ద్వారా మళ్లించడానికి నేత్రావతి బేసిన్‌లో అదనపు నీరు అందుబాటులో లేదు.
****
(రిలీజ్ ఐడి: 2204524)
సందర్శకుల సూచీ సంఖ్య : : 19