రక్షణ మంత్రిత్వ శాఖ
వైజాగ్ నేవీ మారథాన్ 2025
వైజాగ్ నేవీ మారథాన్- 2025లో 17,000 మందికి పైగా పాల్గొనటంతో విశాఖపట్నంలో నెలకొన్న ఉత్సవ వాతావరణం
నాడు పోస్టు చేయడమైనది:
14 DEC 2025 4:45PM by PIB Hyderabad
సాటిలేని ఉత్సాహం, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ 2025 డిసెంబర్ 14న జరిగిన వైజాగ్ నేవీ మారథాన్ 10వ ఎడిషన్ ఘనంగా ముగిసింది. 17 దేశాలకు చెందిన వారితో సహా 17,000 మందికి పైగా పాల్గొనటంతో ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం కొత్త ప్రమాణాన్ని నిర్దేశించింది. రూ. 10 లక్షల కంటే ఎక్కువ నగదు బహుమతి ఉన్న ఈ మారథాన్‌లో దేశవిదేశాల నుంచి క్రీడాకారులు, ఫిట్‌నెస్ ఔత్సాహికులను ఒక చోటకు వచ్చారు.
42 కి.మీల పూర్తి మారథాన్ ప్రారంభోత్సవానికి, నగదు బహుమతి పంపిణీ చేసే కార్యక్రమానికి ఈస్టర్న్ నావల్ కమాండ్ వైస్ అడ్మిరల్, ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ సంజయ్ భల్లా హాజరయ్యారు. ఐక్యత, సమాజ నిబద్ధతకు ఉన్న స్ఫూర్తిని బలోపేతం చేస్తూ కొనసాగిన సగం మారథాన్, సంకల్ప్ రన్‌ను ఎన్‌డబ్ల్యూడబ్ల్యూఏ అధ్యక్షులు (తూర్పు ప్రాంతం) శ్రీమతి ప్రియ భల్లా ప్రారంభించారు. 10 కి.మీ.ల మారథాన్‌ను జిల్లా కలెక్టర్, 5 కి.మీ.ల పరుగును పోలీస్ కమిషనర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఫ్లాగ్ ఆఫీసర్లు, జీవీఎంసీ కమీషనర్, సీనియర్ ప్రముఖులు, భారతీయ స్టేట్ బ్యాంక్- ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వంటి భాగస్వాములకు చెందిన సీనియర్ అధికారులతో సహా పలువురు విశిష్ట అతిథులు హాజరయ్యారు. ఇది ఈ కార్యక్రమానికి ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తోంది.
జిల్లా అధికార యంత్రాంగం, నగర పోలీసులు, స్థానిక ప్రజల నిరంతర మద్దతుతో ఖచ్చితమైన ప్రణాళికను సమర్థవంతమైన అమలు చేయటం ద్వారా ఈ మారథాన్ పాల్గొన్నవారికి అసాధారణమైన అనుభూతినిచ్చింది.
ఈ విడతలో కొన్ని కొత్త అంశాలను జోడించగా పాత వాటిని కొన్నింటిని మెరుగుపరిచారు. మారథాన్‌లో పాల్గొనే వారికి ప్రవేశ రుసుంలో ఆకర్షణీయ డిస్కాంట్లు ఇచ్చారు. పాల్గొన్నవారికి అందించే వివిధ వస్తువులతో కూడిన ప్యాకేజీని మరింత మెరుగుపరిచారు. పాల్గొన్నవారందరికీ భీమా కవరేజీని అందించారు. భద్రత, శ్రేయస్సును మరింత పకడ్బందీగా చూసుకున్నారు.
విదేశాలకు చెందిన వారు కూడా పాల్గొనటం అనేది మారథాన్ స్థాయి, అంతర్జాతీయ ఆకర్షణ పెరగటాన్ని తెలియజేస్తోంది. ఈ ప్రాంతంలోని ప్రధాన మారథాన్‌లలో ఒకటిగా ఇది స్థానాన్ని సంపాదించుకుంది.
పాల్గొన్నవారి అంకితభావం, బృంద స్ఫూర్తి, అభిరుచికి వైజాగ్ నేవీ మారథాన్ 2025 నిదర్శనంగా నిలిచింది. ఈ కార్యక్రమం రాబోయే సంవత్సరాల్లో మరింత పెద్దగా మారేందుకు సిద్ధంగా ఉంది. ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారితో పాటు హాజరైన వారందరికీ ఈస్ట్రన్ నావల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం ఇంత గొప్పగా విజయవంతమయ్యే విషయంలో మద్దతునిచ్చిన జిల్లా అధికార యంత్రాంగం, నగర పోలీసులు, స్వచ్ఛంద సంస్థలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
***
(రిలీజ్ ఐడి: 2204180)
సందర్శకుల సూచీ సంఖ్య : : 48