జౌళి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

న్యూఢిల్లీలో చౌపాల్ కార్యక్రమాన్ని ప్రారంభించిన జౌళి మంత్రిత్వ శాఖ


హస్తకళ సంప్రదాయాలను ప్రోత్సహించడం, వ్యవస్థాపకతను పెంపొందించడం, స్థిరమైన హస్తకళ సమూహాల ఏర్పాటును సులభతరం చేయడమే చౌపాల్ కార్యక్రమ లక్ష్యం

प्रविष्टि तिथि: 12 DEC 2025 7:06PM by PIB Hyderabad

జాతీయ చేనేత వారోత్సవాల సందర్భంగా జౌళి మంత్రిత్వ శాఖ పరిధిలోని డెవలప్‌మెంట్‌ కమిషనర్ (హస్తకళలుకార్యాలయం నేడు న్యూఢిల్లీలో చౌపాల్ కార్యక్రమాన్ని ప్రారంభించిందిఈ కార్యక్రమానికి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి నీలం షమీ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారుమంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులువివిధ రాష్ట్రాల నోడల్ అధికారులుచేతివృత్తుల రంగానికి చెందిన భాగస్వాములు పాల్గొన్నారు.

జాతీయ చేతివృత్తుల అభివృద్ధి కార్యక్రమ లక్ష్యాలకు అనుగుణంగా.. హస్తకళల సంప్రదాయాలపై అవగాహన కల్పించడంపారిశ్రామికవేత్తలను తయారు చేయడం, స్థిరమైన హస్తకళా సమూహాల ఏర్పాటును సులభతరం చేయడమే చౌపాల్ కార్యక్రమ లక్ష్యంసంస్కరణఆచరణపరివర్తనసమాచార ప్రసారం అనే మంత్రాల ఆధారంగా దేశంలోని 100 ఆకాంక్షిత హస్తకళా జిల్లాలలో కళాకారుల నమోదుపథకాలపై అవగాహననైపుణ్యాభివృద్ధిపారిశ్రామిక అభివృద్ధి కోసం చౌపాళ్లను జిల్లా స్థాయిలో శాశ్వత వేదికలుగా ఏర్పాటు చేయనున్నారు.

దేశంలో హస్తకళల  వ్యవస్థను బలోపేతం చేయడానికిగ్రామీణ స్థాయిలో కళాకారులను శక్తిమంతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని జౌళిశాఖ కార్యదర్శి పేర్కొన్నారుచౌపాల్ కార్యక్రమం హస్తకళలపై అవగాహనను పెంపొందించడానికియువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికిపారిశ్రామిక అవకాశాలను పెంచే వేదికగా పనిచేస్తుందని ఆమె తెలిపారుతద్వారా దేశవ్యాప్తంగా హస్తకళ సమూహాలలో స్థిరమైన జీవనోపాధికి దోహదపడుతుందని అన్నారు.

ఈ కార్యక్రమ తొలి దశకు ఎంపిక చేసిన 100 హస్తకళలకు చెందిన ఆకాంక్షాత్మక జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నోడల్ అధికారులతో జౌళిశాఖ కార్యదర్శి మాట్లాడారుఈ కార్యక్రమంలో భాగంగా ఆమె జిల్లా స్థాయి అవగాహనచేరిక చర్యలను బలోపేతం చేయడానికి అవసరమైన ఆడియో-విజువల్ సామగ్రిఇతర పరికరాలను కలిగిన చౌపాల్ కిట్‌లను పంపిణీ చేశారుఈ కిట్‌లు కళాకారుల ప్రదర్శనలుఅవగాహన కార్యక్రమాలుసామర్థ్య నిర్మాణ శిక్షణలుడిజిటల్ నమోదు వంటి కార్యాచరణలను  సులభతరం చేస్తాయి.

 

***


(रिलीज़ आईडी: 2203357) आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी