వ్యవసాయ మంత్రిత్వ శాఖ
2026 సీజన్‌కు కొబ్బరి కనీస మద్దతు ధరకు కేబినెట్ ఆమోదం
प्रविष्टि तिथि:
12 DEC 2025 4:28PM by PIB Hyderabad
2026 సీజన్ కోసం కొబ్బరి కనీస మద్దతు ధరకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. సాగుదారులకు లాభదాయక ధరలను అందించడం కోసం అన్ని తప్పనిసరి పంటల కనీస మద్దతు ధరను అఖిల భారత సగటు ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 1.5 రెట్ల స్థాయిలో నిర్ణయించనున్నట్లు ప్రభుత్వం 2018-19 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించింది. 2026 సీజన్‌కు తగిన సగటు నాణ్యత గల మిల్లింగ్ కొబ్బరి కోసం ఎంఎస్‌పీని క్వింటాలుకు రూ.12,027గా, బాల్ కొబ్బరికి రూ.12,500గా నిర్ణయించారు.
2026 సీజన్ కోసం ఎంఎస్‌పీ గత సీజన్ కంటే మిల్లింగ్ కొబ్బరి క్వింటాలుకు రూ.445, బాల్ కొబ్బరి క్వింటాలుకు రూ.400 పెరిగింది. 2014 మార్కెటింగ్ సీజన్‌లో వరుసగా క్వింటాలుకు రూ.5,250, రూ.5,500గా ఉన్న మిల్లింగ్ కొబ్బరి, బాల్ కొబ్బరిల ఎంఎస్‌పీని ప్రస్తుతం క్వింటాలుకు రూ.12,027, రూ.12,500లకు పెరిగింది. అంటే 2026 మార్కెటింగ్ సీజన్‌కు ఇవి వరుసగా 129 శాతం, 127 శాతం వృద్ధిని నమోదు చేశాయి.
ఈ అధిక ఎంఎస్‌పీ కొబ్బరి సాగుదారులకు మెరుగైన లాభదాయక రాబడిని నిర్ధరించడమే కాకుండా... దేశీయంగా, అంతర్జాతీయంగా కొబ్బరి ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి సరిపడా కొబ్బరి ఉత్పత్తిని విస్తరించేలా రైతులను ప్రోత్సహిస్తుంది.
ధర మద్దతు పథకం కింద కొబ్బరి సేకరణ కోసం నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్‌లు సెంట్రల్ నోడల్ ఏజెన్సీలుగా వ్యవహరిస్తుంటాయి.
***
(रिलीज़ आईडी: 2203156)
आगंतुक पटल : 6