ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జోర్డాన్, ఇథియోపియా, ఒమన్‌లలో ప్రధాని పర్యటన

प्रविष्टि तिथि: 11 DEC 2025 8:43PM by PIB Hyderabad

మహారాజు అబ్దుల్లా II బిన్ అల్ హుస్సేన్ ఆహ్వానం మేరకు.. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025 డిసెంబరు 15 – 16 తేదీల్లో హషేమైట్ రాజ్యమైన జోర్డాన్‌లో పర్యటించనున్నారుఈ పర్యటన సందర్భంగా గౌరవ మహారాజు అబ్దుల్లా II బిన్ అల్ హుస్సేన్‌తో భారత ప్రధానమంత్రి సమావేశమై.. భారత్జోర్డాన్ మధ్య సంబంధాల పూర్తి పరిధిని సమీక్షించడంతోపాటు పలు ప్రాంతీయ అంశాలపైనా చర్చిస్తారురెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పర్యటన జరుగుతోందిభారత్ జోర్డాన్ ద్వైపాక్షిక సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికిపరస్పర వృద్ధిసంక్షేమం కోసం సహకారానికి కొత్త మార్గాల అన్వేషణకుఅలాగే.. ప్రాంతీయ శాంతిసమృద్ధిభద్రతస్థిరత్వాన్ని ప్రోత్సహించడంలో అంకితభావాన్ని పునరుద్ఘాటించేందుకు ఇదో మంచి అవకాశం.

పర్యటన రెండో దశలో భాగంగా.. ఇథియోపియా ప్రధానమంత్రి డాక్టర్ అబియ్ అహ్మద్ అలీ ఆహ్వానం మేరకు.. భారత ప్రధానమంత్రి 2025 డిసెంబరు 16 - 17 తేదీల్లో ఆ దేశంలో అధికారికంగా పర్యటిస్తారుప్రధానమంత్రి శ్రీ మోదీ ఇథియోపియాలో పర్యటించడం ఇదే తొలిసారిభారత్ ఇథియోపియా ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి.. అన్ని అంశాలపైనా వారు విస్తృతంగా చర్చిస్తారుఅభివృద్ధి చెందుతున్న దేశాలుగా.. రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలనుద్వైపాక్షిక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా ఉమ్మడి నిబద్ధతను ఈ పర్యటన పునరుద్ఘాటిస్తోంది.

పర్యటన చివరి దశలో భాగంగాఒమన్ మహారాజు సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ ఆహ్వానం మేరకు.. భారత ప్రధానమంత్రి 2025 డిసెంబరు 17 – 18 తేదీల్లో ఆ దేశంలో పర్యటిస్తారుప్రధానమంత్రి శ్రీ మోదీ ఒమన్‌లో పర్యటించడం ఇది రెండోసారిశతాబ్దాల నాటి స్నేహ సంబంధాలువాణిజ్య అనుసంధానాలుబలమైన ప్రజా సంబంధాల ప్రాతిపదికగా.. భారత్ఒమన్ సర్వతోముఖ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పంచుకుంటున్నాయిఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని ఈ పర్యటన సూచిస్తుంది2023 డిసెంబరులో ఒమన్ సుల్తాన్ భారత్‌లో పర్యటించిన అనంతరం జరుగుతున్న పర్యటన ఇదివాణిజ్యంపెట్టుబడులుఇంధనంరక్షణభద్రతసాంకేతికతవ్యవసాయంసంస్కృతీ రంగాలు సహా ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని సమగ్రంగా సమీక్షించడానికి ఇరుపక్షాలకు ఈ పర్యటన ఒక మంచి అవకాశంఅలాగే పరస్పర ప్రయోజనాలున్న ప్రాంతీయఅంతర్జాతీయ అంశాలపైనా చర్చిస్తారు.

 

***


(रिलीज़ आईडी: 2202664) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Marathi , हिन्दी , Gujarati