సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ప్రసార భారతి ద్వారా విపత్తు హెచ్చరికలు, సంక్షేమ పథకాల సమాచారం చివరి స్థాయి వరకు చేరుకునే వ్యవస్థను బలోపేతం చేసిన ప్రభుత్వం
బహుళ మాధ్యమ విధానంతో పౌరులకు ప్రాంతీయ భాషల్లోనే విపత్తు హెచ్చరికలు
గ్రామీణ, సరిహద్దు ప్రాంతాల్లో సంక్షేమ పథకాల సమాచారాన్ని విస్తరిస్తున్న వేవ్స్ ఓటీటీ, డీడీ ఫ్రీడిష్, ఆకాశవాణి
प्रविष्टि तिथि:
10 DEC 2025 4:08PM by PIB Hyderabad
గ్రామీణ, మారుమూల, సరిహద్దు ప్రాంతాలలో ప్రజలకు సంక్షేమ పథకాలు, సూచనలు, విపత్తు సంబంధిత సమాచారాన్ని అందించవలసిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది.
ప్రభుత్వం తన ప్రజా ప్రసార సంస్థ - ప్రసార భారతి (దూరదర్శన్, ఆకాశవాణి) ద్వారా ఎఫ్ఎం/ ఎండబ్ల్యూ/ఎస్డబ్ల్యూ రేడియో నెట్‌వర్క్‌లు, టెరెస్ట్రియల్ టీవీ ట్రాన్స్‌మీటర్లు, డిడి ఫ్రీడిష్, డిజిటల్ వేదికలు, డిజిటల్ మొబైల్ అప్లికేషన్‌లను ఉపయోగించి ప్రజలకు విస్తృతంగా సమాచారాన్ని చేరవేస్తోంది.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) విపత్తు హెచ్చరికలను నిర్దిష్ట రంగాలను లక్ష్యంగా చేసుకుని పంపడం కోసం కామన్ అలర్టింగ్ ప్రోటోకాల్ (సీఏపీ) ఆధారిత ఇంటిగ్రేటెడ్ అలర్ట్ సిస్టమ్‌ను అమలు చేస్తోంది.
ఈ హెచ్చరికలను ఎస్ఎంఎస్, మొబైల్ యాప్‌లు, సాచెట్ (ఎస్ఏసీహెచ్ఈటీ) పోర్టల్, గగన్/నావిక్ శాటిలైట్ టెర్మినల్స్, ఆర్ఎస్ఎస్ ఫీడ్‌ల ద్వారా ప్రాంతీయ భాషలలో జారీ చేస్తున్నారు.
ఎలక్ట్రానిక్ ప్రసార సాధనాలు, వార్తా పత్రికలు, ప్రాంతీయ భాషా సమాచారం, ప్రచార వాహనాలు వీధి నాటకాల ప్రదర్శన వంటి విస్తృతమైన అవగాహన కార్యక్రమాల ద్వారా కూడా ఎన్డీఎంఏ సమాజ సన్నద్ధతను బలోపేతం చేస్తోంది.
చివరి వ్యక్తి వరకు సమాచార చేరవేత వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఈ కింద చర్యలు తీసుకుంది.
*డీడీ ఫ్రీడిష్ ద్వారా విస్తరణ: ఇది గ్రామీణ, సరిహద్దు ప్రాంతాలతో సహా దేశవ్యాప్త కవరేజీని అందించే డైరెక్ట్ టు హోమ్ (డీటీహెచ్) వేదిక. ఇది అన్ని దూరదర్శన్ ఛానెళ్లు, 48 ఆకాశవాణి ఛానెళ్లు, ఎంపిక చేసిన ప్రైవేట్ ఛానెళ్లు, 260కి పైగా విద్యా ఛానెళ్లను కలిగి ఉంది.
*ప్రజా సమాచార కార్యక్రమాలపై దృష్టి: ప్రభుత్వ పథకాలు, విపత్తు సంబంధిత సమాచారాన్ని l దూరదర్శన్, డీడీ న్యూస్ ప్రత్యేక కార్యక్రమాలు, డాక్యుమెంటరీలు, నివేదికలను ప్రసారం చేస్తాయి. వీటిని ప్రతి రోజూ వార్తా ప్రసారాల్లోనూ, చర్చా మే, ఆపదా కా సామ్నా, క్యాబినెట్ కే బడే ఫైస్లే, సైబర్ అలర్ట్ వంటి కార్యక్రమాల ద్వారా అందిస్తారు.
"డిజిటల్ అందుబాటు: సమాచార వ్యాప్తి కోసం ప్రసార భారతి సోషల్ మీడియా నెట్‌వర్క్‌ను కూడా ఉపయోగిస్తోంది. 260కి పైగా ఆకాశవాణి స్టేషన్లు ఆండ్రాయిడ్, ఐఓఎస్ లలో 'న్యూస్ ఆన్ ఎయిర్' యాప్ ద్వారా అందుబాటులో ఉన్నాయి.
వేవ్స్ ఓటీటీ వేదిక: ప్రసార భారతి ప్రారంభించిన వేవ్స్ ఓటీటీ వేదిక దూరదర్శన్, ఆకాశవాణి ఛానళ్ల లైవ్ స్ట్రీమింగ్‌తో పాటు, ఎంపిక చేసిన ప్రైవేట్ వార్తా ఛానెళ్లు, వినోద కార్యక్రమాల ఛానళ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. దీని వల్ల ప్రజలకు సమాచార, వినోద కార్యక్రమాలు మరింతగా అందుబాటు లోకి వచ్చాయి.
కోసి, పూర్ణియా డివిజన్‌లలో ప్రస్తుతం ఐదు ఆకాశవాణి ఎఫ్ఎం స్టేషన్లు పనిచేస్తున్నాయి.
|
Sl. No.
|
Locations of Station
|
District
|
Division
|
|
1
|
Bathnaha (10 kW)
|
Araria
|
Purnia
|
|
2
|
Katihar (100 W)
|
Katihar
|
Purnia
|
|
3
|
Kishanganj (100 W)
|
Kishanganj
|
Purnia
|
|
4
|
Purnia (10 kW)
|
Purnia
|
Purnia
|
|
5
|
Saharsa (100 W)
|
Saharsa
|
Kosi
|
సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖల సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ ఈ రోజు లోక్ సభలో శ్రీ రాజేష్ రంజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా, ఈ వివరాలు వెల్లడించారు.
***
(रिलीज़ आईडी: 2201868)
आगंतुक पटल : 7