అంతరిక్ష విభాగం
పార్లమెంటు ప్రశ్న: నావిక్ దిక్సూచి వ్యవస్థలు
प्रविष्टि तिथि:
10 DEC 2025 4:30PM by PIB Hyderabad
వివిధ రంగాల్లో నావిక్ వినియోగాన్ని విస్తరించటానికి అంతరిక్ష శాఖ (డీఓఎస్) నిరంతరం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టులు, భారతీయ పరిశ్రమకు సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, సాంకేతిక మద్దతు, పరీక్షా మద్దతు, వినియోగ కార్యక్రమాల వంటి కార్యకలాపాలను చేపట్టింది. ఉత్పత్తులు, పరిష్కారాల్లో నావిక్ సమర్థవంతమైన, స్థిరమైన, అంతరాయం లేని స్వీకరణకు వీలు కల్పించేందుకు జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమ ప్రమాణాల్లో నావిక్ ను చేర్చటానికి డీఓఎస్ ప్రయత్నించింది. ప్రస్తుతం, వివిధ తయారీదారుల నుంచి 60కి పైగా స్మార్ట్‌ఫోన్లు నావిక్‌కు మద్దతిస్తున్నాయి.
నావిక్ ఆధారిత అప్లికేషన్ల విస్తరణకు అభివృద్ధి చేసిన పైలట్ ప్రాజెక్టుల్లో ఇవి ఉన్నాయి. i) వాస్తవ సమయ రైలు ట్రాకింగ్‌లో 10,000కు పైగా రైళ్లకు నావిక్ సామర్థ్య ట్రాకింగ్ పరికరాలను అమర్చారు. ii) చేపల వేట నౌకల ట్రాకింగ్‌లో 30,000కు పైగా నౌకలకు నావిక్ సామర్థ్యం గల ట్రాన్స్‌పాండర్లను అమర్చారు. iii) ప్రభుత్వ, వాణిజ్య వాహనాల ట్రాకింగ్‌లో 140కు పైగా పరికరాల నమూనాలను ధ్రువీకరించి, 15 లక్షలకు పైగా వాహనాల్లో అమర్చారు. iv) భారతదేశ వ్యాప్తంగా ఒకే విధమైన ఐఎస్‌టీ ఉండేలా నావిక్ టైమ్ ట్రాన్స్‌ఫర్ రిసీవర్లను ఉపయోగించి టైమ్ స్కేళ్లను ఏర్పాటు చేస్తున్నారు.
నావిక్ వినియోగాన్ని ప్రభుత్వం ఇంకా తప్పనిసరి చేయలేదు. దీనికి సంబంధించిన చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. నావిక్ పౌర సిగ్నల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. నావిక్ కవరేజ్ ప్రాంతంలోని వినియోగదారులు ఎవరైనా తమ స్థాన నిర్ధారణ, దిశానిర్దేశం, సమయపాలన (పీఎన్‌టీ) అప్లికేషన్లకు వీటిని ఉపయోగించుకోవచ్చు. పరస్పర కార్యాచరణ, సిగ్నల్ సమన్వయం కోసం నావిక్‌తో అంతర్జాతీయ జీఎన్ఎస్ఎస్ సర్వీస్ ప్రొవైడర్లు క్రమం తప్పకుండా మాట్లాడి, సహకరిస్తారు.
***
(रिलीज़ आईडी: 2201708)
आगंतुक पटल : 13