ప్రధాన మంత్రి కార్యాలయం
సంస్కృతంలో యోగ శ్లోకాలు బోధిస్తున్న శాశ్వత జ్ఞానాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
10 DEC 2025 8:53AM by PIB Hyderabad
యోగాకు ఉన్న పరివర్తనాత్మక శక్తిని చాటిచెబుతున్న ఒక సంస్కృత భాషా శ్లోకాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రజలతో పంచుకున్నారు. ఈ శ్లోకం యోగా తాలూకు ప్రగతిశీల పంథాను వర్ణిస్తుంది. శారీరక స్వస్థత మొదలు పరమ మోక్షం వరకు సైతం ఆసనాలు, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణలతో పాటు సమాధి స్థితుల అభ్యాసంతో ఇది సిద్ధిస్తుందని శ్లోకం చెబుతుంది.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘ఆసనేన రూజో హన్తి ప్రాణాయామేన పాతకమ్
వికారం మానసం యోగీ ప్రత్యాహారేణ సర్వదా
ధారణాభిర్నోధైర్యం యాతి చైతన్యమద్భుతమ్
సమాధౌ మోక్షమాప్నోతి త్యక్త్వా కర్మ శుభాశుభమ్’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 2201352)
आगंतुक पटल : 3