అణుశక్తి విభాగం
azadi ka amrit mahotsav

పార్లమెంటు ప్రశ్న: యురేనియం వనరులు, సరఫరా వ్యవస్థల బలోపేతం

నాడు పోస్టు చేయడమైనది: 04 DEC 2025 6:19PM by PIB Hyderabad

అణు ఇంధన విభాగం (డీఏఈ)లో అంతర్భాగమైన అణు ఖనిజాల అన్వేషణ, పరిశోధన డైరెక్టరేట్ (ఏఎండీ) దేశంలో యురేనియం ఖనిజ వనరులను గుర్తించి, అంచనా చేసి, పెంపొందిస్తుంది.

దేశీయంగా సరఫరాలో అంతరాయం లేకుండా, దేశీయ యురేనియం వనరులను వేగంగా పెంపొందించడం లక్ష్యంగా.. అయిదేళ్ల కార్యాచరణ ప్రణాళిక కాలంలో (2024-25 నుండి 2028-29) దేశంలో అవకాశమున్న భౌగోళిక ప్రాంతాల్లో సమగ్రంగా, వివిధ విభాగాలతో కలిసి ఏఎండీ ఖనిజాన్వేషణను నిర్వహిస్తోంది. పథకాల వారీగా వివరాలు, యురేనియం వనరుల పెరుగుదల కింది విధంగా ఉన్నాయి:

అన్వేషణ కార్యకలాపాలు (ప్రధాన కార్యకలాపాలు)

అయిదేళ్ల కార్యాచరణ ప్రణాళికా కాలం (2024- 25 నుంచి 2028-29)

యురేనియం పరిశోధనలు

లక్ష్యం

సాధించినది

(2025 సెప్టెంబరు నాటికి)

1.

పరిశీలన సర్వే (చదరపు కి.మీ)

40,000

9,289.00

2.

భూరసాయన సర్వే (చదరపు కి.మీ)

25,000

5,425.00

3.

వివరణాత్మక సర్వే (చదరపు కి.మీ)

2,000

478.70

4.

క్షేత్రస్థాయి భూభౌతిక సర్వే (చదరపు కి.మీ)

6,000

1,676.10

 

 

 

5.

డ్రిల్లింగ్

శాఖాపరంగా (ఎం) [యురేనియం + కీలక, వ్యూహాత్మక ఖనిజాలు]

ఒప్పంద ప్రాతిపదికన (ఎం)

 

5,00,000

 

8,00,000

 

1,07,578.00

 

1,75,648.20

6

యురేనియం వనరుల పెంపుదల [టన్ను (t) U3O8]

75,000

15,778

 

యురేనియం నిక్షేపాలున్న కొత్త ప్రాంతాలను గుర్తించి, యురేనియం వనరులను పెంపొందించడం కోసం.. దేశవ్యాప్తంగా సమీకృతంగా, వివిధ విభాగాలతో కలిసి ఏఎండీ ఖనిజాన్వేషణ (భూభౌతిక, భూ వైజ్ఞానిక, భూరసాయన, రేడియోమెట్రిక్ సర్వేలు, డ్రిల్లింగ్ సహా) నిర్వహిస్తోంది.

14 రాష్ట్రాలకు చెందిన కింది జిల్లాల్లోని అవకాశమున్న వివిధ భౌగోళిక ప్రాంతాల్లో జీ4 నుంచి జీ2 అన్వేషణ దశలను ఇటీవల ఏఎండీ ప్రారంభించింది.

  1.  

     
    1. రాజస్థాన్: అల్వార్, సికార్, జుంఝును, అజ్మీర్, దౌసా, ఉదయపూర్, భిల్వారా, జైసల్మేర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు.

    2. మధ్యప్రదేశ్: ఛతర్పూర్, బేతుల్, చింద్వారా, సిధి, షాదోల్, సింగ్రౌలి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు.

    3. ఉత్తరప్రదేశ్: సోన్‌భద్ర జిల్లాలోని కొన్ని ప్రాంతాలు.

    4. ఛత్తీస్‌గఢ్ : బలరాంపూర్, సూరజ్‌పూర్, జీపీఎం, రాజ్‌నంద్‌గావ్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు.

    5. మహారాష్ట్ర: గోండియా, గడ్చిరోలి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు.

    6. హర్యానా: మహేంద్రగఢ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు.

    7. అరుణాచల ప్రదేశ్: పశ్చిమ సియాంగ్, లెపరాడా, సియాంగ్, ఎగువ సుబాన్‌సిరి జిల్లాలలో కొన్ని ప్రాంతాలు.

    8. హిమాచల ప్రదేశ్ : మండి జిల్లాలోని కొన్ని ప్రాంతాలు.

    9. తమిళనాడు: సేలం, ఈరోడ్, కోయంబత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు.

    10. సిక్కిం: నామ్చి, సోరెంగ్, గ్యాల్షింగ్, గాంగ్‌టక్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు.

    11. బీహార్: రోహ్‌తస్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు.

ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, మేఘాలయ, రాజస్థాన్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్రల్లోని 47 యురేనియం నిక్షేపాలున్న ప్రాంతాల్లో 4,36,700 టన్నుల (టి) U3O8 భూమిలో ఉందని (ఇన్ సిటు) ఏఎండీ ధ్రువీకరించింది.

* * *


(రిలీజ్ ఐడి: 2199699) సందర్శకుల సూచీ సంఖ్య : : 43
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी