అంతరిక్ష విభాగం
azadi ka amrit mahotsav

పార్లమెంటులో ప్రశ్నోత్తరాలు: గగన్‌యాన్‌ సహా ‘ఇస్రో’ భవిష్యత్‌ కార్యక్రమాలు

प्रविष्टि तिथि: 04 DEC 2025 4:28PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంతరిక్ష విభాగం 2026 మార్చి వరకూ ఏడు ప్రధాన కార్యక్రమాలను నిర్వహించనుంది. వాటి వివరాలు కిందివిధంగా ఉన్నాయి:

వ.సం.

కార్యక్రమం

లక్ష్యాలు

1.

ఎల్‌వీఎం3ఎం6/

ఎన్‌ఎస్‌ఐఎల్‌

మెస్సర్స్ న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఐఎల్‌)తో వాణిజ్య ఒప్పందం కింద అమెరికాలోని మెస్సర్స్‌ ఏఎస్‌టీ స్పేస్ మొబైల్ సంస్థ తయారీ ‘బ్లూబర్డ్ బ్లాక్-2’ ఉపగ్రహ ప్రత్యేక వాణిజ్య ప్రయోగం.

2.

పీఎస్‌ఎల్‌వీ సి62/ ఈఓఎస్‌ ఎన్‌1

భారత్‌ సహా వివిధ అంతర్జాతీయ వినియోగదారుల 18 సహ-ఉపగ్రహాలతో పాటు వ్యూహాత్మక వినియోగదారుల కోసం ఎన్‌ఎస్‌ఐఎల్‌ చేపట్టిన భూ పరిశీలన ఉపగ్రహ ప్రత్యేక ప్రయోగం.

3.

హెచ్‌ఎల్‌వీ ఎం3 జి1/ ఓఎం1

మానవ సహిత ప్రయోగ వాహన ఏరోడైనమిక్స్ లక్షణాలు, ఆర్బిటల్ మాడ్యూల్ మిషన్ ఆపరేషన్లు, క్రూ మాడ్యూల్ పునఃప్రవేశం, సేకరణ సహా ఆద్యంత కార్యక్రమ నిర్దేశిత గగన్‌యాన్ తొలి మానవరహిత ప్రయోగం.

4.

జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌17/ ఈఓఎస్‌-05

వ్యూహాత్మక వినియోగదారుల కోసం భూ పరిశీలన ఉపగ్రహ ప్రయోగం

5.

పీఎస్‌ఎల్‌వీ సి63/ టీడీఎస్‌-01

హై థ్రస్ట్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్, స్వదేశీ టీడబ్ల్యూటీ (ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్) యాంప్లిఫైయర్, క్వాంటం కీ డిస్ట్రిబ్యూషన్ వంటి ఆధునిక టెక్నాలజీ డెమోన్స్ట్రేషన్ ఉపగ్రహం (టీడీఎస్‌-01) ప్రయోగం.

6.

పీఎస్‌ఎల్‌వీ ఎన్‌1/ ఈఓఎస్‌-10

ఉపగ్రహ ప్రయోగ పరిశ్రమ కన్సార్షియం కింద ఎన్‌ఎస్‌ఐఎల్‌ రూపొందించిన తొలి  పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ద్వారా సముద్ర శాస్త్ర అధ్యయనం లక్ష్యంగా భూ పరిశీలన కోసం ఇండో-మారిషస్ ఉమ్మడి ఉపగ్రహం (ఐఎంజేఎస్‌), భారత ఎన్‌జీఈ తయారీ లీప్-2 ఉపగ్రహాల సంయుక్త ప్రయోగం

7.

ఎస్‌ఎస్‌ఎల్‌వీ ఎల్‌1/ ఎన్‌ఎస్‌ఐఎల్‌

ఎన్‌ఎస్‌ఐఎల్‌ ప్రత్యేక వాణిజ్య ప్రయోగ కార్యక్రమం

అంతరిక్ష రంగంలో సంస్కరణల అనంతరం వాణిజ్య ఉపగ్రహ ప్రయోగ విజయాలకు భరోసాతోపాటు  ప్రపంచ అంతరిక్ష మార్కెట్లో భారత్‌ పోటీతత్వం పెంపు, అప్‌స్ట్రీమ్-డౌన్‌స్ట్రీమ్ సహా అంతరిక్ష విలువ వ్యవస్థ అంతటా ‘న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్’ (ఎన్‌ఎస్‌ఐఎల్‌) అనేక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా వినియోగదారుల అవసరాలు తీర్చడం లక్ష్యంగా డిమాండ్ ప్రాతిపదికన వాణిజ్య ఉపగ్రహ కార్యకలాపాలను చేపట్టింది. తదనుగుణంగా ఇప్పటిదాకా భారత వినియోగదారుల డైరెక్ట్-టు-హోమ్ (డీటీహెచ్‌), బ్రాడ్‌బ్యాండ్ అవసరాల కోసం రెండు వాణిజ్య కమ్యూనికేషన్ ఉపగ్రహాలను అంతరిక్షంలో నిలిపింది. అంతేగాక రాబోయే మూడు నాలుగేళ్లలో కనీసం 3 వాణిజ్య కమ్యూనికేషన్ ఉపగ్రహాల ప్రయోగానికి ‘ఎన్‌ఎస్‌ఐఎల్‌’ ప్రణాళిక సిద్ధం చేసింది.

సంస్థ ఉపగ్రహ ప్రయోగ సేవల వాణిజ్య కార్యకలాపాల్లో అంతర్జాతీయ వినియోగదారులకు పీఎస్‌ఎల్‌వీ, ఎస్‌ఎస్‌ఎల్‌వీ, ఎల్‌వీఎం3 లాంచర్ల ప్రయోగ సేవల చురుకైన మార్కెటింగ్‌ కోసం ‘ఎన్‌ఎస్‌ఐఎల్‌’ చర్యలు చేపట్టింది. ఇప్పటిదాకా పీఎస్‌ఎల్‌వీ ద్వారా 5, ఎల్‌వీఎం3 ద్వారా 2, ఎస్‌ఎస్‌ఎల్‌వీ ద్వారా 2 వంతున ప్రయోగాలతో మొత్తం 137 వినియోగదారు ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది.

వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాల సంఖ్య పెంపు, భారతీయ పరిశ్రమ ద్వారా ఆద్యంతపు ప్రయోగ వాహనాల తయారీకి ‘ఎన్‌ఎస్‌ఐఎల్‌’ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా హెచ్‌ఏఎల్‌, ఎల్‌ అండ్‌ టీ, కన్సార్షియం ద్వారా 5 ‘పీఎస్‌ఎల్‌వీ-ఎక్స్‌ఎల్‌’ రాకెట్లను రూపొందిస్తోంది. పూర్తిగా దేశీయ తయారీతో వీటిలో తొలి రాకెట్‌ను 2026 తొలి త్రైమాసికం నాటికి ప్రయోగించనుంది. భారతీయ అంతరిక్ష పరిశ్రమ సామర్థ్యం పెంపు లక్ష్యంగా ‘ఇన్‌-స్పేస్‌’తో సంయుక్తంగా ‘ఎన్‌ఎస్‌ఐఎల్‌’ 2025 సెప్టెంబరులో ‘హెచ్‌ఏఎల్‌’తో సాంకేతిక బదిలీ ఒప్పందంపై సంతకం చేసింది. పైన పేర్కొన్న కార్యక్రమాల ద్వారా ప్రపంచ అంతరిక్ష మార్కెట్లో భారత్‌ పోటీతత్వం పెంపు లక్ష్యంగా ‘ఎన్‌ఎస్‌ఐఎల్‌’ కృషి చేస్తోంది.

సాంకేతిక ప్రగతి, అంతర్జాతీయ సహకారంతోపాటు ఎదుగుతున్న అంతరిక్ష శక్తిగా భారత్‌ వ్యూహాత్మక స్థానం పరంగా ఈ కార్యక్రమ ఫలితాలపై అంచనాలు కిందివిధంగా ఉన్నాయి:

‘ఎన్‌ఎస్‌ఐఎల్‌’ చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమాలు వాణిజ్య ప్రయోగ సేవల మార్కెట్‌లో కీలక పాత్రధారిగా భారత్‌ను స్థానాన్ని మరింత సుస్థిరం చేస్తాయి.

హై థ్రస్ట్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్ వంటి కొత్త సాంకేతకతల సామర్థ్యం భవిష్యత్తులో అన్ని ఎలక్ట్రిక్ ఉపగ్రహాల ఆవిష్కరణకు వీలు కల్పిస్తుంది.

స్వదేశీ టీడబ్ల్యూటీ (ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్) యాంప్లిఫైయర్ సామర్థ్యం ఉపగ్రహ ట్రాన్స్‌పాండర్ల సంక్లిష్ట సాంకేతికతల పరంగా స్వయంసమృద్ధ భారత్‌కు దోహదం చేస్తుంది.

తొలి మానవరహిత గగన్‌యాన్ ప్రయోగం తదుపరి మానవరహిత-వ్యోమగామి సహిత గగన్‌యాన్ ప్రయోగ కార్యక్రమాలలో వివిధ కొత్త సాంకేతికతల వినియోగ అవకాశాలను నిర్ధారిస్తుంది.

ఉపగ్రహ వేదిక, కొత్త సాంకేతికతలు-స్వదేశీ విడిభాగాల తయారీ ధ్రువీకరణకు తోడ్పడే టీడీఎస్‌-01 ఉపగ్రహ ప్రయోగం దాంతోపాటు స్వావలంబనకూ దోహదం చేస్తుంది. ఈ ప్రయోగంతో నిరూపితమయ్యే సాంకేతికతలు, విడిభాగాలను సమీప భవిష్యత్తులో చేపట్టే నావిగేషన్, కమ్యూనికేషన్ ఉపగ్రహ ప్రయోగాల్లో ఉపయోగిస్తారు.

దేశానికి పీఎన్‌టీ సేవలందించే ‘నావిక్‌’ సమూహంలో ఎన్‌వీఎస్‌-03 ఉపగ్రహం ఒక భాగంగా ఉంటుంది. ఇది ప్రస్తుతం వాడుతున్న వాహన ట్రాకింగ్, రియల్-టైమ్ రైలు ట్రాకింగ్, ఫిషింగ్ వెసెల్ కమ్యూనికేషన్-సపోర్ట్ సిస్టమ్ తదితర అనువర్తానలకు కోసం కూడా ఉపయోగపడుతుంది.

వచ్చే ఏడాది (2026) మార్చినాటికి ప్రయోగించే ఉపగ్రహాల్లో ఓషన్‌శాట్‌-3ఎ (ఈఓఎస్‌-10) వాతావరణ, సముద్ర శాస్త్ర, భూ పరిశీలన కార్యకలాపాలకు ఉపయోగపడుతుంది. ఈ ఉపగ్రహంలో ఓషన్ కలర్ మానిటర్ (ఓసీఎం), స్కాటరోమీటర్, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత మానిటర్ (ఎస్‌ఎస్‌టీఎం), మిల్లీమీటర్ వేవ్ అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ అండ్ హ్యుమిడిటీ సౌండర్ (మాథ్స్‌) వంటివి ఉంటాయి. ఇది ఇప్పటికే అంతరిక్షంలోగల (ఈఓఎస్‌-06)తో సంయుక్తంగా వివిధ అంశాల సంబంధిత రోజువారీ సమాచారాన్ని అందిస్తుంది.

ఈ ఉపకరణాల నుంచి అందే సమాచార ఉత్పత్తులు సంభావ్య ఫిషింగ్ జోన్ గుర్తింపు, ఫైటోప్లాంక్టన్/ క్లోరోఫిల్/సాంద్రత, తీరప్రాంత మండలాల నిర్వహణ, మహాసముద్ర గతిశీలత, గణాంక సహిత  వాతావరణ అంచనా నమూనాలు, ఉష్ణమండల తుఫాను పర్యవేక్షణ-అంచనా సహా వివిధ భూ, వాతావరణ కార్యకలాపాలకు మద్దతిస్తాయి.

అంతరిక్ష ప్రయోగ కార్యక్రమాలు జాతీయ పురోగమన కీలక చోదకాలు. పూర్తిస్థాయి ఆవిష్కరణలకు మించి, ప్రయోజనాలు అందిస్తాయి. చంద్రయాన్ సిరీస్, ఆదిత్య ఎల్‌-1 వంటి విజయవంతమైన ప్రయోగాలు ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు అపార ప్రతిష్ఠను ఆర్జించి, దేశం స్థానాన్ని మరింత బలోపేతం చేశాయి. దేశీయంగా భావితరం విద్యార్థులను సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం (స్టెమ్‌) కోర్సుల వైపు ప్రోత్సహిస్తాయి. అలాగే ప్రత్యేక హార్డ్‌ వేర్, అధునాతన సాఫ్ట్‌ వేర్ రెండింటా వేగంగా నైపుణ్యాభివృద్ధికి దోహదం చేస్తాయి.

 

***


(रिलीज़ आईडी: 2199139) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil