వ్యవసాయ మంత్రిత్వ శాఖ
ఉపగ్రహ ఆధారిత పంటల పర్యవేక్షణ, డేటా అనుసంధానం
प्रविष्टि तिथि:
02 DEC 2025 5:39PM by PIB Hyderabad
ఫసల్ కార్యక్రమం కింద మహలనోబిస్ జాతీయ పంటల అంచనా కేంద్రం (ఎంఎన్‌సీఎఫ్‌సీ) దేశంలోని 11 ప్రధాన పంటలకు (వరి, గోధుమ, జనుము, పత్తి, చెరకు, సోయాబీన్, కంది, పప్పు, ఆవాలు, కాయధాన్యాలు, రబీ జొన్న) సంబంధించి ఉపగ్రహ ఆధారిత పంటకోత, పూర్వ పంట ఉత్పత్తి అంచనాలను అందిస్తుంది. పంట మ్యాపింగ్ కోసం మల్టీస్పెక్ట్రల్, మైక్రోవేవ్ ఉపగ్రహ డేటాను ఉపయోగిస్తారు. అలాగే వాతావరణ ఆధారిత, రిమోట్ సెన్సింగ్ నమూనాల ద్వారా పంట దిగుబడిని అంచనా వేయడానికి వాతావరణ డేటాతోపాటు ఉపగ్రహ ఆధారిత సూచికలను ఉపయోగిస్తారు.
ఫసల్ పరిధిలో 20 రాష్ట్రాలు / 557 జిల్లాలు ఉన్నాయి. రాష్ట్రాల వారీగా జిల్లాల సంఖ్య ఇలా ఉంది - ఆంధ్రప్రదేశ్ 26; అస్సాం 33; బీహార్ -38; ఛత్తీస్‌గఢ్ -33; గుజరాత్-29; హర్యానా-22; హిమాచల్ ప్రదేశ్-7; జార్ఖండ్-24; కర్ణాటక 22; కేరళ 02; మధ్యప్రదేశ్-52; మహారాష్ట్ర 29; ఒడిశా 30; పంజాబ్ 22; రాజస్థాన్ 32; తమిళనాడు 21; తెలంగాణ 32; ఉత్తరప్రదేశ్ 75: ఉత్తరాఖండ్ 7; పశ్చిమ బెంగాల్ -21.
పీఎంఎఫ్‌బీవై పథకం కింద అంతరిక్ష ఆధారిత సాధనాలను ఉపయోగిస్తున్నారు. పంట కోత ప్రయోగాల (సీసీఈలు) ప్రణాళిక, వరి, గోధుమలు, సోయాబీన్ కోసం గ్రామ పంచాయతీ స్థాయిలో దిగుబడి అంచనా, యెస్టెక్ (సాంకేతికతను ఉపయోగించి దిగుబడి అంచనా వ్యవస్థ), దిగుబడి - విస్తీర్ణం మధ్య వ్యత్యాసాల సమస్యల పరిష్కారం వంటివి ఇందులో ఉన్నాయి.
ఇస్రో సహకారంతో.. ఎంఎన్‌సీఎఫ్‌సీతో కలిసి వ్యవసాయం- రైతు సంక్షేమ విభాగం (డీఏ, ఎఫ్‌డబ్ల్యూ) సెమీ ఫిజికల్ మోడల్ ఆధారంగా పంట దిగుబడి అంచనాలను అందిస్తోంది. అంచనా కోసం కొత్త పంటలను ఇందులో చేర్చేలా పరిశోధన- అభివృద్ధి కార్యకలాపాలకు కూడా ఇస్రో కేంద్రాలు సహకరిస్తాయి.
ఫసల్ కార్యక్రమం కింద పంటల మ్యాపింగ్ కోసం అవసరమైన మోడళ్లకు శిక్షణ ఇచ్చేందుకు కావాల్సిన క్షేత్ర స్థాయి సమాచారాన్ని సేకరించడంలో రాష్ట్రాల వ్యవసాయ శాఖలు సహకరిస్తున్నాయి.
వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ రాంనాథ్ ఠాకూర్ ఈ రోజు లోకసభలో ఇచ్చిన ఓ లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(रिलीज़ आईडी: 2198105)
आगंतुक पटल : 10