వ్యవసాయ మంత్రిత్వ శాఖ
రైతుల్లో డిజిటల్ అక్షరాస్యత
प्रविष्टि तिथि:
02 DEC 2025 5:40PM by PIB Hyderabad
స్మార్ట్ ఫోన్లు అందరికీ చేరువై, అందుబాటులోకి వస్తున్నాయి. ప్రధాన టెలికాం కంపెనీలు తమ సేవలతో దేశంలోని దాదాపు ప్రతి మూలకూ చేరుకున్నాయి. అయితే, మొబైల్ ఫోన్లు లేని రైతులు కూడా డిజిటల్ సేవల ప్రయోజనాలను పొందేలా అదనపు చర్యలనూ తీసుకున్నాం. అలాంటి రైతులు రైతు ఉత్పత్తిదారు సంస్థలు (ఎఫ్‌పీఓలు), కృషి సఖీలు, ఉమ్మడి సేవా కేంద్రాలు (సీఎస్‌సీలు), రాష్ట్ర ప్రభుత్వ సంస్థల వంటి ప్రస్తుత సహాయక కేంద్రాలను ఉపయోగించుకుని సేవలు, ప్రయోజనాలను పొందవచ్చు. భాషిణి వేదికల ఏకీకరణ ద్వారా ప్రభుత్వం స్థానిక భాషల్లో కూడా డిజిటల్ అప్లికేషన్‌లను అందుబాటులోకి తెస్తోంది.
పంట ఉత్పాదకత, సుస్థిరత, రైతుల జీవనోపాధిని మెరుగుపరచడానికీ.. అలాగే వ్యవసాయ రంగంలో వివిధ సవాళ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం కృత్రిమ మేధ పద్ధతులను ఉపయోగించింది. కొన్న కార్యక్రమాల వివరాలిలా ఉన్నాయి:
- “కిసాన్-ఇ-మిత్ర” అనేది మాటల రూపంలో సేవలందించే కృత్రిమ మేధ ఆధారిత చాట్ బాట్. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం, ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన, కిసాన్ క్రెడిట్ కార్డులపై రైతుల ప్రశ్నలకు సమాధానాలిచ్చి, వారికి సాయమందించేందుకు దీనిని రూపొందించారు. ఇది 11 ప్రాంతీయ భాషల్లో సేవలందిస్తుంది. ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకూ సహాయ పడేలా దీనిని అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇది రోజుకు 8,000 రైతుల సందేహాలకు సమాధానమిస్తోంది. ఇప్పటివరకు 93 లక్షలకు పైగా సందేహాలకు సమాధానాలిచ్చింది.
- వాతావరణ మార్పుల కారణంగా కలిగే పంట నష్టాలను ఎదుర్కునేందుకు ఉద్దేశించిన ‘జాతీయ తెగుళ్ల పర్యవేక్షణ వ్యవస్థ’.. పంట సమస్యలకు సంబంధించి చీడపీడలను గుర్తించడానికి ఏఐ, మెషీన్ లెర్నింగులను ఉపయోగించుకుంటుంది. దీంతో ఆరోగ్యకరమైన పంటల కోసం సకాలంలో తగిన చర్యలు తీసుకోవడం సాధ్యపడుతుంది. ప్రస్తుతం 10,000 మందికి పైగా వ్యవసాయ విస్తరణ సిబ్బంది ఈ సాధనాన్ని ఉపయోగిస్తున్నారు. తెగుళ్ల దాడుల తీవ్రతను తగ్గించడానికి, పంట నష్టాలను నివారించడానికి వీలుగా.. తెగుళ్ల చిత్రాలను తీయడానికి రైతులకు సహాయపడుతుంది. ప్రస్తుతం 66 పంటలు, 432 చీడపీడల విషయంలో ఇది ఉపయోగపడుతోంది. నాటిన పంటలకు సంబంధించి పంట - వాతావరణ సరిపోలిక పర్యవేక్షణలో.. ఉపగ్రహ ఆధారిత పంట మ్యాపింగ్ కోసం క్షేత్రస్థాయి ఛాయాచిత్రాలను ఉపయోగించి కృత్రిమ మేధ ఆధారిత విశ్లేషణలను ఉపయోగిస్తున్నారు.
వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ రాంనాథ్ ఠాకూర్ ఈ రోజు లోకసభలో ఇచ్చిన ఓ లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(रिलीज़ आईडी: 2198102)
आगंतुक पटल : 8