రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ రహదారులపై టెలికాం ఆధారిత భద్రతా హెచ్చరిక వ్యవస్థ అమలుకు రిలయన్స్ జియోతో ఎన్‌హెచ్ఏఐ అవగాహన ఒప్పందం

प्रविष्टि तिथि: 02 DEC 2025 1:31PM by PIB Hyderabad

భద్రతను మెరుగుపరచడంతోపాటు జాతీయ రహదారులపై ఎలాంటి అవాంతరాలూ లేకుండా ప్రయాణ సదుపాయాన్ని అందించడం లక్ష్యంగా.. రిలయన్స్ జియోతో ఎన్‌హెచ్ఏఐ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుందిదీనిద్వారా జాతీయ రహదారులపై టెలికాం ఆధారిత భద్రతా హెచ్చరిక వ్యవస్థను ప్రవేశపెట్టిందిప్రస్తుత జియో 4జీ, 5జీ నెట్‌వర్కును ఉపయోగించి.. ప్రమాద అవకాశాలున్న ప్రాంతాలురోడ్లపై పశువులు ఎక్కువగా ఉండే ప్రదేశాలుపొగమంచు ఆవరించి ఉన్న ప్రాంతాలుఅత్యవసర మళ్లింపుల వంటి ప్రదేశాలను సమీపించే సమయంలో ప్రయాణికులు మొబైల్ ఫోన్లలో ముందస్తు హెచ్చరికలను అందుకుంటారు.

జాతీయ రహదారిపై ప్రయాణించే వారికి సకాలంలో సమాచారాన్ని అందించడం ద్వారా రహదారి భద్రతను బలోపేతం చేయడంఅలాగే వేగాన్నీడ్రైవింగ్ విధానాన్నీ ముందుగానే సర్దుబాటు చేసుకోవడానికి వీలు కల్పించడం ఈ కార్యక్రమ లక్ష్యం. ప్రయాణికులకు ఎస్ఎంఎస్వాట్సాప్హై ప్రయారిటీ కాల్స్ ద్వారా హెచ్చరికలు అందుతాయి. ‘రాజ్‌మార్గ యాత్ర’ మొబైల్ యాప్ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్1033 సహా ఎన్‌హెచ్ఏఐ డిజిటల్ వేదికలతో దశలవారీగా ఈ వ్యవస్థను అనుసంధానిస్తారు.

జాతీయ రహదారులపై లేదా సమీపంలో ఉన్న జియో మొబైల్ వినియోగదారులందరికీ ఈ స్వయంచాలిత (ఆటొమేటెడ్వ్యవస్థ సేవలందిస్తుందిప్రమాదకర ప్రాంతంలోకి ప్రవేశించడానికి ముందే.. జాతీయ రహదారి ప్రయాణికులకు ముందస్తు హెచ్చరికలను అందిస్తుందిఈ సాధనం ఇప్పటికే ఉన్న టెలికాం టవర్లను ఉపయోగించుకుంటుందిరోడ్ల పక్కన మరే ఇతర అదనపు హార్డ్‌వేర్ లేకుండానే సత్వరమే అమర్చవచ్చుదేశంలో 500 మిలియన్లకు పైగా వినియోగదారులకు సేవలందిస్తున్న జియో డిజిటల్ మౌలిక సదుపాయాలను ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం వినియోగించుకుంటుంది.

ఈ కార్యక్రమంపై స్పందిస్తూ.. ప్రయాణికులకు సకాలంలో నమ్మదగిన సమాచారాన్ని అందించడంలో ఇదొక ముఖ్యమైన ముందడుగుతద్వారా వారు ముందుగానే తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికిసురక్షితమైన డ్రైవింగ్ పద్ధతులను అవలంబించడానికి అవకాశం ఉంటుందిజాతీయ రహదారిపై సాంకేతిక ఆధారిత రహదారి భద్రతా నిర్వహణలో ఇది సరికొత్త ప్రమాణాలను నిర్దేశిస్తుందని నేను కచ్చితంగా చెప్పగలను” అని ఎన్‌హెచ్ఏఐ చైర్మన్ శ్రీ సంతోష్ కుమార్ యాదవ్ అన్నారు.

రిలయన్స్ జియో ప్రెసిడెంట్ శ్రీ జ్యోతీంద్ర ఠాకర్ మాట్లాడుతూ.. ఈ వ్యవస్థ జియో టెలికాం నెట్వర్క్ పరిధిని ఉపయోగించుకుని.. సకాలంలో భద్రతా హెచ్చరికలను అందించడానికిఅలాగే సురక్షితమైనకచ్చితమైన సమాచారంతో కూడిన జాతీయ రహదారి ప్రయాణానికి దోహదపడుతుందన్నారు.

ఈ కార్యక్రమ తొలి ప్రయోగాత్మక అమలు.. ప్రమాద ప్రాంతాలను గుర్తించడంఎన్‌హెచ్ఏఐలోని కొన్ని ప్రాంతీయ కార్యాలయాల పరిధిలో నిర్దేశిత హెచ్చరికలను జారీ చేయడంలో దోహదపడుతుందివర్తించే అన్ని నియంత్రణా నిబంధనలుడేటా రక్షణ అవసరాలకు ఇది పూర్తిగా అనుగుణంగా ఉంటుంది.

ఇతర టెలికాం సర్వీస్ ప్రొవైడర్లతో కూడా ఎన్‌హెచ్ఏఐ ఇలాంటి విధానాన్ని అనుసరిస్తుందిబలమైన డిజిటల్ మౌలిక సదుపాయాలను రియల్ టైమ్ కమ్యూనికేషన్ సాధనాలతో కలపడం ద్వారా.. ప్రయాణికుల్లో విశేషంగా అవగాహన పెంపొందించేందుకునివారించదగిన రహదారి ప్రమాదలను తగ్గించేందుకు ఈ కార్యక్రమం సహాయపడుతుందిదేశవ్యాప్తంగా సురక్షితఆధునికసమర్థమైన జాతీయ రహదారి ప్రయాణానికి వీలు కల్పించేలా తగినవినూత్న మార్గాలను అవలంబించడానికి ఎన్‌హెచ్ఏఐ కట్టుబడి ఉంది.

 

*** 


(रिलीज़ आईडी: 2197576) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Gujarati , Urdu , हिन्दी , Tamil