ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అహ్మదాబాద్‌లో బంగారం స్మగ్లింగ్ సిండికేట్‌ను ఛేదించిన డీఆర్‌ఐ.. ఒక ప్రయాణికుడి నుంచి దాదాపు 1.3 కేజీల రూ.1.62 కోట్ల విలువైన 24 క్యారెట్ల బంగారం స్వాధీనం, ఎయిర్‌లైన్‌ సిబ్బందితో సహా నలుగురి అరెస్ట్


విమానయాన సిబ్బందితో కలిసి రెండు నెలల్లో 10 దఫాలుగా రూ.16 కోట్ల విలువైన బంగారం అక్రమంగా తరలింపు

प्रविष्टि तिथि: 21 NOV 2025 9:26PM by PIB Hyderabad

బంగారం స్మగ‌్లింగ్ కేసు దర్యాప్తులో భాగంగా అహ్మదాబాద్‌ ఎస్‌వీపీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఓ విమానంలో రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్బంగారాన్ని స్వాధీనం చేసుకుంది.

నవంబర్ 14, 2025న జెడ్డా నుంచి వచ్చిన విమానంలో ఓ ప్రయాణికుడి వద్ద నుంచి రూ.1.62 కోట్ల విలువైన 1246.48 గ్రాముల 24 క్యారెట్ల బంగారాన్ని రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారునాలుగు క్యాప్సూల్స్‌లో ఉన్న ఆ బంగారాన్ని తెల్లటి టేప్‌లో చుట్టి ప్రయాణికుల సీటు కింద లైఫ్ జాకెట్ పౌచ్‌లో దాచినట్లు తెలిపారు.

పీహెచ్‌డీ చదివిఅహ్మదాబాద్‌లో కేఫ్ నడుపుతున్న వ్యక్తి.. బంగారం తరలించేందుకు, అక్రమ కార్యకలాపాల నిర్వహణకు వ్యక్తులను నియమించిసమన్వయకర్తగా వ్యవహరించినట్లు దర్యాప్తులో తేలిందిప్రముఖ ఎయిర్‌లైన్స్ సంస్థకు చెందిన ఇద్దరు ఉద్యోగుల్లో భద్రతా విభాగానికి చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్అసిస్టెంట్ మేనేజర్ ఈ స్మగ్లర్లకు సహకరించినట్లు అధికారులు గుర్తించారుఈ స్మగ్లింగ్ ముఠా గడచిన  రెండు నెలల్లో 10కన్నా ఎక్కువసార్లు రూ.16 కోట్ల విలువైన బంగారాన్ని అక్రమంగా తరలించినట్లు వెల్లడైంది.

ఈ వ్యక్తులువ్యవస్థీకృత స్మగ్లింగ్ ముఠాలోని కీలక నిర్వాహకులనివిదేశాల్లోని ఇతర నేరస్తులతో కలిసి పనిచేస్తున్నట్లు డిజిటల్ ఆధారాలువాంగ్మూలాల ద్వారా నిర్ధరణ అయిందిస్మగ్లింగ్‌కు పాల్పడిన నలుగురు సభ్యుల ముఠాను కస్టమ్స్ చట్టం 1962 నిబంధనల ప్రకారం అరెస్టు చేశారు.

విజయవంతమైన డీఆర్‌ఐ ఆపరేషన్ ద్వారా వ్యవస్థీకృత నేర ముఠాల నిర్మూలనకు ఈ సంస్థతిరుగులేని ప్రాధాన్యతనిస్తుందని స్పష్టమవుతోంది.

 

***


(रिलीज़ आईडी: 2192933) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी