రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పబ్లిక్ ఇన్విట్ కార్యక్రమానికి ఊతాన్నివ్వడానికి రాజ్‌మార్గ్ ఇన్‌ఫ్రా ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్ (ఆర్ఐఐఎంపీఎల్)ను ఏర్పాటు చేసిన ఎన్‌హెచ్ఏఐ

Posted On: 20 NOV 2025 3:36PM by PIB Hyderabad

రహదారి ఆస్తులను మరింత లాభసాటిగా మార్చడంలో భాగంగాజాతీయ రహదారుల మౌలిక సదుపాయాలను మరింత విస్తరించేందుకు జాతీయ రహదారుల సంస్థప్రజల నుంచి పెట్టుబడి సేకరణ (ఇన్విట్విధానంలోరాజమార్గ్ ఇన్‌ఫ్రా ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్టు (ఆర్ఐఐటీ)ని ఏర్పాటు చేస్తోందిఈ కార్యక్రమంలో భాగంగాప్రతిపాదిత ఇన్విట్‌కు ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్‌గా రాజ్‌మార్గ్ ఇన్‌ఫ్రా ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్ ప్రైవేటు లిమిటెడ్ (ఆర్ఐఐఎంపీఎల్)ను ఏర్పాటు చేసిందిఎన్‌హెచ్ఏఐ చైర్మన్ శ్రీ సంతోష్ కుమార్ యాదవ్ ఆర్ఐఐఎంపీఎల్‌ను ముంబయిలో ప్రారంభించారుఈ కార్యక్రమంలో ఎన్‌హెచ్ఏఐ సీనియర్ అధికారులుభాగస్వామ్య సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

భారతీయ స్టేట్ బ్యాంకుపంజాబ్ నేషనల్ బ్యాంకునాబ్‌ఫిడ్ (NaBFID), యాక్సిస్ బ్యాంకుబజాజ్ ఫిన్‌సర్వ్ వెంచర్స్హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుఐసీఐసీఐ బ్యాంకుఐడీబీఐ బ్యాంకుఇండస్ఇండ్ బ్యాంకుయెస్ బ్యాంకులు సహా ప్రధాన బ్యాంకులుఆర్థిక సహాయ సంస్థలు కలిసి ఏర్పాటు చేసిన సంస్థే ఆర్ఐఐఎంపీఎల్‌చిన్న మదుపరులనూదేశీయ పెట్టుబడిదారులనూ ఆకర్షించగలిగేటట్లు అధిక ప్రయోజనాలను అందించేదీర్ఘకాలిక ప్రాతిపదికను కలిగి ఉండే ఒక పెట్టుబడి పథకాన్ని ప్రవేశపెడుతూదీనికి తోడుగా జాతీయ రహదారులకున్న నగదు సమీకరణ సామర్థ్యాన్నీ ఉపయోగించుకోవాలనేదే ఈ భాగస్వామ్యం ఉద్దేశంఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ (అదనపు బాధ్యత)గా శ్రీ ఎన్.ఆర్.వి.వి.ఎం.కెరాజేంద్ర కుమార్‌ను నియమించారుఈయనకు ఎన్‌హెచ్ఏఐలో మెంబర్ (ఫైనాన్స్)గా పనిచేసిన అనుభవం ఉంది.  
ఈ సందర్భంగా ఎన్‌హెచ్ఏఐ చైర్మన్ శ్రీ సంతోష్ కుమార్ యాదవ్ ప్రసంగిస్తూ... ‘‘రహదారులకున్న నగదు సమీకరణ సామర్థ్యాన్ని వినియోగించుకోవడంలో ఎన్‌హెచ్ఏఐ విశేషమైన అనుభవాన్ని సంపాదించిందిఇటీవల కొన్నేళ్లుగామేం టోల్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ (టీఓటీనమూనాను అనుసరిస్తూ రూ.48,995 కోట్ల విలువైన ఆస్తుల్ని ఉపయోగించి నగదు రాబట్టుకొనే ప్రక్రియలో సఫలమయ్యాంప్రయివేటు ఇన్విట్ల తాలూకు నాలుగు రౌండ్లలో దేశీయఅంతర్జాతీయ స్థాయుల్లో ప్రధాన పెట్టుబడిదారులను ఆకట్టుకొనిదాదాపు రూ.43,638 కోట్లు సమీకరించాంరాబోయే మూడు సంవత్సరాలు లేదా అయిదు సంవత్సరాలలోనిర్మాణ పనులు పూర్తి చేసిన జాతీయ రహదారులు సహా క్రియాశీల జాతీయ రహదారులకు చెందిన సుమారు 1,500 కిలోమీటర్ల మార్గాలను పబ్లిక్ ఇన్విట్ పరిధిలోకి తీసుకు రానున్నాందీంతో ప్రజలకు గణనీయ స్థాయిలో పెట్టుబడి అవకాశాలు లభిస్తాయిఈ కార్యక్రమం జాతీయ రహదారి సదుపాయాలను కల్పించడంలో ప్రజల భాగస్వామ్యంలో ఓ కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని నేను నమ్ముతున్నాన’’న్నారు.  
ఆర్ఐఐఎంపీఎల్ పటిష్ఠ పాలన ప్రమాణాలను ఏర్పరచడంపై దృష్టిని కేంద్రీకరిస్తుందిసెబీ నిర్దేశించిన ఇన్విట్ నియమ నిబంధనలను పక్కాగా అమలుచేస్తుందిపారదర్శకతపెట్టుబడిదారుల ప్రయోజనాల పరిరక్షణలతో పాటునివేదికల రూపకల్పననియమ పాలన యంత్రాంగాల్లో కూడా అత్యుత్తమ స్థాయి పనితీరును కనబరుస్తుందిచిన్న మదుపరులతో పాటు పబ్లిక్ ఇన్వెస్టర్లకు తొలి విడత ఇన్విట్ యూనిట్లను 2026 ఫిబ్రవరిలో జారీ చేసే సూచనలు ఉన్నాయి.

 

***


(Release ID: 2192240) Visitor Counter : 3