ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
త్వరలో ప్రవేశపెట్టే ఆధార్ యాప్‌తో ఆఫ్ లైన్్ ద్వారా ధ్రువీకరించే వ్యవస్థను రూపొందించడానికీ, బలోపేతం చేయడానికీ ఆసక్తిదారుల సమావేశాన్ని నిర్వహించిన యూఐడీఏఐ
కాగితాలు అక్కర్లేకుండానే గుర్తింపును పంచుకొనే సౌలభ్యాన్ని అందించనున్న ఆధార్ యాప్...
ఆధార్ సమాచారాన్ని పూర్తిగా గాని లేదా ఎంపిక చేసిన సమాచారాన్ని మాత్రమే గాని
ధ్రువీకరించేందుకు, పంచుకొనేందుకు వెసులుబాట్లు ...
ఆధార్‌లో తాజా వివరాల్ని పొందుపరిచే సౌలభ్యం...
వివిధ సంస్థలకు సేవలను అందించడంతో పాటు, లక్షలాది మందికి మేలు
ఆఫ్ లైన్ ధ్రువీకరణ ప్రయోజనాల సమగ్ర సమాచారం 250కి పైగా సంస్థలకూ, వ్యక్తులకూ అందజేత
प्रविष्टि तिथि:
19 NOV 2025 6:05PM by PIB Hyderabad
‘ఆధార్ యాప్‌ను ఉపయోగించి ఆఫ్ లైన్ంగా ధ్రువీకరించడం’ పై అవగాహనను కలిగించే వెబినార్‌ను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) నిర్వహించింది. కొత్త ఆధార్ యాప్‌ను లాంఛనంగా ప్రారంభించడాని కన్నా ముందుగా నిర్వహించిన ఈ వెబినార్‌లో, వివిధ రంగాలకు చెందిన 250కి పైగా సంస్థలతో పాటు వ్యక్తులు పాలుపంచుకున్నారు. ఆఫ్ లైన్ ధ్రువీకరణతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయన్నది యూఐడీఏఐ ఈ సందర్భంగా వివరించింది.
యూఐడీఏ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీ భువనేశ్ కుమార్ స్వాగతోపన్యాసాన్నిస్తూ ఏ లక్ష్యాలతో వెబినార్‌ను నిర్వహిస్తోందీ తెలియజేశారు. ఆఫ్ లైన్ ధ్రువీకరణను ప్రోత్సహించడం, దీని కోసం ఒక పక్కా వ్యవస్థను రూపొందించడం, త్వరలో పరిచయం చేసే ఆధార్ యాప్ సాయంతో ఆఫ్ లైన్ ధ్రువీకరణ సౌలభ్యానికి సంబంధించిన ముఖ్యాంశాలనూ, ప్రయోజనాలనూ, అవకాశాలనూ తెలియజెప్పడానికి ఈ వెబినార్‌ను నిర్వహిస్తున్నామన్నారు.
గుర్తింపును సరిచూసేటప్పుడు సౌకర్యవంతమైన పద్ధతిని, గోప్యతను కాపాడే పద్ధతిని ఆఫ్ లైన్ ధ్రువీకరణ విధానం ఇటు వినియోగదారులకూ, అటు సంస్థలకూ అందుబాటులోకి తెస్తుందని ఆయన చెప్పారు. ఆధార్‌ను గాని, ఆధార్ నకలునుగాని చూపించే లేదా ఈ పద్ధతిపై ఆధారపడే అవసరం లేకుండా ఆఫ్ లైన్ ధ్రువీకరణ చూస్తుందని ఆయన చెప్పారు. ప్రజలు మోసపోతుండటానికి ఆధార్‌ను లేదా ఆధార్ నకలును చూపే అలవాటు కూడా బహుశా ఒక కారణం కావచ్చన్నారు.
ఆఫ్ లైన్ ధ్రువీకరణ ఉద్దేశాన్నీ, పరిధినీ, ఆఫ్ లైన్ ధ్రువీకరణను ఎలా ఉపయోగించాలి అనే అంశాల్నీ యూఐడీఏఐ డీడీజీ శ్రీ వివేక్ చంద్ర వర్మ వివరించారు. సాంకేతిక ప్రణాళిక, ఏకీకరణ పద్ధతులు, రాబోయే కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ధ్రువీకరణ ప్రక్రియలను తీర్చిదిద్దడం గురించి కూడా వెబినార్‌లో చర్చించారు.
ఆఫ్ లైన్ ధ్రువీకరణకు సంబంధించిన అనేక అంశాలతో పాటు హోటళ్లలో దిగడం, రెసిడెన్షియల్ సొసైటీలోకి వెళ్లడం, కార్యక్రమాలకు హాజరు కావడం... ఇలాంటివి సహా ఇంకా ఏయే చోట్ల దీనిని ఉపయోగించవచ్చో యూఐడీఏఐ అధికారులు తెలిపారు. క్యూఆర్ ఆధారిత ధ్రువీకరణ సహా ఆఫ్ లైన్ ధ్రువీకరణలోని వివిధ పద్ధతుల్ని కూడా వారు వివరించారు.
వెబినార్‌లో పాల్గొన్న వారికి ఆఫ్ లైన్ ధ్రువీకరణ వల్ల కలిగే ప్రయోజనాలనూ ప్రతిదీ అర్థమయ్యేటట్లు చెప్పారు. ఆధార్‌కు సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా ధ్రువీకరించడానికీ లేదా ఎంపిక చేసిన కొంత సమాచారాన్ని మాత్రమే ధ్రువీకరించడానికీ లేదా పంచుకోవడానికీ వెసులుబాటు ఉన్న విషయం, ముఖ ధ్రువీకరణ ద్వారా హాజరీని ఖాయపరచవచ్చన్న విషయం వంటివి ఈ ప్రయోజనాల్లో కొన్ని.
ఆధార్ సంఖ్యను కలిగి ఉన్న వారికి లభించే అనేక ఇతర ప్రయోజనాలను యూఐడీఏఐ అధికారులు ప్రస్తావించారు. ఉదాహరణకు... యాప్‌లో గరిష్ఠంగా అయిదు మంది కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలను చేర్చవచ్చు, ఆధార్‌లోని ఏ సమాచారాన్ని పంచుకోవచ్చనే విషయంలో పూర్తి నియంత్రణ గాని, ఎంపిక చేసిన సమాచారాన్ని గాని తెలియజేసేందుకు ఉన్న వెసులుబాటు, మరింత భద్రత కోసం ఒక క్లిక్ ద్వారా బయోమెట్రిక్ విధానంలో లాకింగ్, అన్లాకింగ్ సౌలభ్యాలు, ఇబ్బందులకు తావీయని విధంగా మొబైల్ నంబర్‌తో పాటు అడ్రసులో మార్పును పొందుపరిచేందుకు అవకాశాలు.. దీన్లో ఉన్నాయన్నారు.
ఈ వెబినార్‌లో కొత్త వ్యవస్థతో జతపడ్డ భాగస్వాములు ఎంతో ఉత్సాహంగా స్పందించారు. వాళ్లు అడిగిన అనేక ప్రశ్నలకు యూఐడీఏఐ బృందం సమాధానాలిచ్చింది. ఏయే రకాలుగా ఉపయోగించుకోవచ్చు, సాంకేతికంగా ముడిపడాల్సిన అవసరం, ఆఫ్ లైన్ ధ్రువీకరణను కోరే సంస్థల (ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ సీకింగ్ ఎంటిటీస్.. ఓవీఎస్ఈల) రూపంలో దీన్లో చేరే ప్రక్రియను తెలుసుకోవడానికిగాను యూఐడీఏఐతో అనుబంధాన్ని ఏర్పరుచుకోవాల్సిందిగా వెబినార్‌లో పాలుపంచుకున్నవాళ్లను ప్రోత్సహించారు.
కార్యక్రమం చివర్లో, ప్రజలకు మరిన్ని సౌకర్యాలను అందించడంతో పాటు దేశవ్యాప్తంగా భద్రమైన డిజిటల్ గుర్తింపు సేవలను పటిష్ఠపరచాలన్న ధ్యేయంతో త్వరలో తీసుకు వస్తున్న కొత్త ఆధార్ యాప్‌తో మరిన్ని సౌకర్యాలను అందుకొంటూ, అవకాశాలను గురించి తెలుసుకొంటూ ఉండటానికి దీంతో అనుబంధాన్ని ఏర్పరుచుకోవాల్సిందిగాను, ఆఫ్ లైన్ ధ్రువీకరణ వ్యవస్థను ప్రోత్సహించాల్సిందిగాను సంస్థలనూ, భాగస్వాములనూ కోరారు.
***
(रिलीज़ आईडी: 2192043)
आगंतुक पटल : 38