బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బొగ్గు రంగంపై సుదీర్ఘంగా జరిగిన మారథాన్ సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి

प्रविष्टि तिथि: 13 NOV 2025 9:26PM by PIB Hyderabad

కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి శ్రీ జికిషన్ రెడ్డి అధ్యక్షతనబొగ్గుగనుల శాఖ సహాయమంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే సహాధ్యక్షతనబొగ్గు మంత్రిత్వ శాఖకు సంబంధించి ఆరు నెలల మారథాన్ సమీక్షా సమావేశం 13.11.2025న న్యూఢిల్లీలో జరిగిందిఈ సమావేశానికి బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్‌దత్అదనపు కార్యదర్శి శ్రీమతి రూపిందర్ బ్రార్అదనపు కార్యదర్శిసీఐఎల్ సీఎండీ (అదనపు బాధ్యతశ్రీ సనోజ్ కుమార్ ఝాసీఐఎల్ అనుబంధ సంస్థలుఎన్ఎల్‌సీఐఎల్ఎస్‌సీసీఎల్ సీఎండీలు పాల్గొన్నారు.

భారతదేశ ఇంధన భద్రతకు మంత్రిత్వ శాఖపీఎస్‌యూలు అందిస్తున్న సుస్థిర సహకారాన్ని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి శ్రీ జికిషన్ రెడ్డి ప్రశంసించారుభారీ వర్షాలుకార్యకలాపాల్లో సవాళ్లున్నప్పటికీ స్థిరంగా బొగ్గు ఉత్పత్తిని కొనసాగించినందుకు పీఎస్‌యూలను కేంద్రమంత్రి అభినందించారుదృఢ సంకల్పంసమన్వయంతో కృషి చేస్తూ గతేడాది అభివృద్ధిని కొనసాగిస్తూఈ సంవత్సరం ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవాలని కోరారు. "సంస్కరించటంఅమలు చేయటంపరివర్తనసమాచారం ఇవ్వడంఅని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్దేశించిన మార్గదర్శక మంత్రాన్ని స్పష్టం చేస్తూ.. సంస్కరణలుసామర్థ్యంఆవిష్కరణలపై అన్ని పీఎస్‌యూలు దృష్టి సారించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.

 

ఇంటిగ్రేటెడ్ కోల్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీవంటి కార్యక్రమాలు ఆధునీకరణ వైపు ముఖ్యమైన ముందడుగని కేంద్రమంత్రి వ్యాఖ్యానించారునిజమైన పురోగతిని ప్రతిబింబించే స్పష్టమైన అభివృద్ధిపరిమాణాత్మక ఫలితాలు రావాలని ప్రోత్సహించారు.

 

ఉత్పత్తిలాభదాయకతకార్మికుల సంక్షేమంపర్యావరణ పనితీరులో అత్యుత్తమంగా ఉండేలా పీఎస్‌యూల మధ్య ఆరోగ్యకరమైన పోటీని మంత్రి ప్రోత్సహించారుబొగ్గు రంగం అంతటా ఉత్తమ పద్ధతులను అనుసరించాలని అనుబంధ సంస్థలను కోరారు.

 

కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునిరెగ్యులర్ ఉద్యోగుల కోసం రూ.కోటి అదనపు వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీని అందించేందుకు కోల్ ఇండియా లిమిటెడ్ తీసుకున్న చొరవను మంత్రి ప్రశంసించారుదీనివల్ల సంస్థకు అయ్యే ఖర్చు తక్కువే అయినప్పటికీఉదోగ్యుల మనోధైర్యంసామాజిక భద్రతపై గణనీయమైన ప్రభావం ఉంటుందని ఆయన అన్నారుఇతర పీఎస్‌యూలు కూడా ఇదే తరహా చర్యలను చేపట్టాలని మంత్రి సూచించారుచిన్నపాటి సంక్షేమ కార్యక్రమాలు కూడా బొగ్గు కార్మికుల జీవితాలపై అధిక ప్రభావాన్ని చూపుతాయన్నారు.

 

భారతదేశ ఖనిజ భద్రతకు శాస్త్రీయ అన్వేషణ ప్రాముఖ్యతను తెలియజేస్తూపీఎస్‌యూలన్నీ ఓవర్‌బర్డెన్ (ఓబీపరీక్షలను వేగవంతం చేయాలనిఅరుదైన మృత్తికా మూలకాలు (ఆర్ఈఈలు), కీలక ఖనిజాల కోసం తరచూ నమూనా సేకరణ చేపట్టాలని చెప్పారు.

 

సమయానుకూల అనుమతుల ద్వారా స్థిరమైన మద్దతును అందిస్తున్న పర్యావరణంఅటవీవాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (ఎంఏఈఎఫ్‌సీసీ)తో మరింత బలమైన సమన్వయం అవసరమన్నారుబొగ్గు నాణ్యతను మెరుగుపరచటానికిదిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు కోల్ వాషరీల అభివృద్ధిని అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

 

కోల్ వాషరీల కోసం అనుకూలమైన వ్యాపార నమూనాలతో ఔట్ సోర్సింగ్ అవకాశాలను అన్వేషించాలని మంత్రి తెలిపారుఅనేక మంది ప్రైవేట్ వాటాదారులు ఈ రంగంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నందునబాహ్య నిధుల సమీకరణభాగస్వామ్యాల అవకాశాలను కూడా పీఎస్‌యూలు అన్వేషించాలని సూచించారుగనుల మూసివేతసుస్థిరతపై మాట్లాడుతూ.. బొగ్గు తవ్వకం పూర్తయిన 340 గనులను సమయానికి మూసివేసేందుకు ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రత్యేక 'గని మూసివేత సెల్'ను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు.

 

పీఎస్‌యూల సామాజిక పాత్రను ప్రస్తావిస్తూఎస్‌సీసీఎల్ ప్రారంభించిన కార్యక్రమాన్ని ఉదహరిస్తూఅన్ని పీఎస్‌యూలు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత కిందయూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మద్దతివ్వాలని సూచించారులాభదాయక సూచికలు పన్నుకు ముందుపన్ను తర్వాత రెండూ తప్పనిసరిగా మెరుగుపడాలని స్పష్టం చేశారుగతేడాది ఫలితాలను అధిగమించేందుకు అన్ని పీఎస్‌యూల ఆర్థిక పనితీరుసామర్థ్యాన్ని బలోపేతం చేయాలని కోరారు.

 

ఉత్పత్తిపనితీరుసంస్కరణల కార్యక్రమాలను పర్యవేక్షించేందుకుతదుపరి సమీక్షా సమావేశం కోసం కార్యాచరణ ప్రణాళికను రూపొందించటానికిరెగ్యులర్ వాటాదారులతో అధికారులు సంప్రదింపులు జరపాలని కేంద్రమంత్రి సలహా ఇచ్చారుప్రభుత్వ దార్శనికతసంస్కరణలే పురోగతికి కీలకమని స్పష్టం చేస్తూ కేంద్రమంత్రి ప్రసంగాన్ని ముగించారు.

 

బొగ్గు రంగం అద్భుతమైన స్థిరత్వంసామర్థ్యాన్ని ప్రదర్శించిందని బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్ దేవ్‌దత్ అన్నారుబొగ్గు ఉత్పత్తిరవాణా శక్తిమంతంగాస్థిరంగా కొనసాగాయని.. సరఫరాకు ఎక్కడా అంతరాయం కలగలేదనిఅవసరానికి మించి నిల్వ స్థాయిలు ఉన్నట్లు వెల్లడించారుఈ ఏడాది ఎక్కడా విద్యుత్ కొరత రాలేదనిఇది దేశవ్యాప్తంగా నిరంతరాయంగా ఇంధన లభ్యతను అందించగల సామర్థ్యం బొగ్గు రంగానికి ఉందని తెలియజేస్తుందన్నారు.

 

ఈ విజయం కార్యకలాపాల సామర్థ్యాన్ని మాత్రమే కాకభారతదేశ ఇంధన భద్రతను పరిరక్షించాలనే మంత్రిత్వ శాఖప్రభుత్వ రంగ సంస్థల సామూహిక సంకల్పాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన స్పష్టం చేశారుస్వావలంబనసుస్థిరతభవిష్యత్తుకు సిద్ధంగా ఉండే బొగ్గు పర్యావరణ వ్యవస్థ ద్వారా వికసిత్ భారత్ కల సాకారమయ్యేందుకు అర్థవంతంగా సహకరించాలనే ఏకైక లక్ష్యంతో ప్రతి సంస్కరణకార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు శ్రీ దేవ్‌దత్ వెల్లడించారుదేశవ్యాప్తంగా తగినంత ఉత్పత్తిఅంతరాయం లేని సరఫరాకావాల్సినంత నిల్వ స్థాయిలతో కొత్త శకానికి బొగ్గు రంగం సిద్ధంగా ఉందన్నారుమంత్రిత్వ శాఖ చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ సుస్థిరత ప్రధానంగా ఉంటుందనిపర్యావరణ పరిరక్షణసామాజిక నిబద్ధతకు తగిన ప్రాధాన్యతనిస్తూఅభివృద్ధిని బాధ్యతాయుతంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

 

అమల్లో ఉన్న సంస్కరణలను ప్రస్తావిస్తూపారదర్శకత డిజిటల్ పాలనవ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరచటానికి మంత్రిత్వ శాఖ చేస్తున్న నిరంతర ప్రయత్నాల గురించి ఆయన వివరించారుఅంతర్-మంత్రిత్వ శాఖ సహకారం ముఖ్యమైన సాధికారిక శక్తిగా ఉద్భవించిందనిఇది విధాన సమ్మేళనాన్ని పెంపొందించటంకార్యాచరణ సమన్వయందేశ ఇంధన భద్రతను బలోపేతం చేయటానికి సంపూర్ణ విధానాన్ని ప్రోత్సహిస్తుందని తెలిపారు.

 

ఉమ్మడి లక్ష్యంసహకారంఆవిష్కరణ ద్వారా బొగ్గు రంగాన్ని మరింత స్థిరంగాస్వావలంబన దిశగా మంత్రిత్వ శాఖ తీర్చిదిద్దుతోందిదూరదృష్టిబాధ్యతసుస్థిరతతో భారత్ వృద్ధికి ఈ రంగం నిరంతరంగా శక్తినందిస్తూనే ఉంటుంది.

 

కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్), నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎన్‌సీఎల్), సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎస్ఈసీఎల్), వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (డబ్ల్యూసీఎల్), సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (సీసీఎల్), మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎంసీఎల్), భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్), ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఈసీఎల్), సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇనిస్టిట్యూట్ లిమిటెడ్ (సీఎంపీడీఐఎల్), సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్), ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎల్‌సీఐఎల్సీఎండీలు ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో పనితీరుపై సమగ్ర నివేదికలను సమర్పించారుబొగ్గు ఉత్పత్తిరవాణాఅధికభారం తొలగింపుగనుల భద్రతభూమి పునరుద్ధరణసుస్థిరత కార్యక్రమాలుసీఎస్‌ఆర్ జోక్యండిజిటల్ ఔట్‌రీచ్ వంటి ముఖ్య అంశాలను ప్రదర్శనల ద్వారా తెలిపారుప్రతి పీఎస్‌యూ కూడా ఆవిష్కరణలుఉత్తమ పద్ధతులను పంచుకుంది.

 

ఉత్పత్తిసామర్థ్యంపారదర్శకతను పెంచేందుకు ఈ రంగంలోని సవాళ్లుపాలసీ సంస్కరణలుభవిష్యత్తు వ్యూహాలపై లోతైన చర్చల కోసం పరస్పర చర్చా సమావేశం జరిగింది.

 

ఈ సమావేశంలో 'ఇండియా కోల్ డైరెక్టరీ 2024-25'ను కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి శ్రీ జికిషన్ రెడ్డి విడుదల చేశారుఈ ప్రచురణ భారతదేశ బొగ్గు రంగానికి సంబంధించిన సమగ్ర అవగాహనను కల్పిస్తుందిఇందులో మొత్తం బొగ్గు నిల్వలుఉత్పత్తిరంగాల వారీగా పంపిణీ తీరుబొగ్గు దిగుమతిఎగుమతిప్రభుత్వ ఖజానాకు చెల్లింపులుప్రపంచ బొగ్గు ఉత్పత్తిగనులుబ్లాకుల డేటా వంటి సమాచారం ఉంటుందిపాలసీ రూపకల్పనపరిశోధనపారిశ్రామిక విశ్లేషణకు విలువైన వనరుగా ఈ ప్రచురణ ఉపయోగపడుతుంది.

 

ప్రత్యేక ప్రచారం 5.0, స్వచ్ఛతా పక్వాడా కింద బొగ్గు పీఎస్‌యూలు కనబరిచిన అద్భుతమైన పనితీరుని ఈ సమీక్షా సమావేశం గుర్తించిందిపనికిరాని వస్తువులను పారవేయటండిజిటల్ ఫైల్ నిర్వహణసృజనాత్మక ప్రచారంనూతన పరిశుభ్రతా కార్యక్రమాల కోసం ఎస్ఈసీఎల్సీసీఎల్ఎన్ఎల్ సీఐఎల్ఎంసీఎల్ఎస్ సీసీఎల్ చేసిన విశేష కృషిని అభినందించారుదీనిద్వారా సామర్థ్యంపారదర్శకతసుస్థిర పద్దతులపై మంత్రిత్వ శాఖ ప్రాధాన్యత స్పష్టమవుతోంది.

 

ఇంధన స్వయం సమృద్ధివికసిత్ భారత్ 2047 లక్ష్యం దిశాగా భారత్‌ను నడిపించటానికి సమర్థతఆవిష్కరణభద్రత వంటి సూత్రాలను బొగ్గు మంత్రిత్వ శాఖ పాటించాలన్న సంకల్పాన్ని బలపరుస్తూ సమావేశం ముగిసింది.

 

***

 


(रिलीज़ आईडी: 2190454) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी