రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

44వ భారత అంతర్జాతీయ వాణిజ్య సదస్సులో స్వదేశీ రక్షణ శక్తిని ప్రదర్శించనున్న డీడీపీ

Posted On: 13 NOV 2025 3:52PM by PIB Hyderabad

2025 నవంబర్ 14 నుంచి 27 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే 44వ భారత అంతర్జాతీయ వాణిజ్య సదస్సు (ఐఐటీఎఫ్)లో రక్షణ ఉత్పత్తి విభాగం (డీడీపీ), ఒక పెవిలియన్ ను ఏర్పాటు చేయనుందిఆత్మనిర్భర్ భారత్ ద్వారా సాధించిన కీలక మార్పును ఇది స్పష్టం చేస్తుందిరక్షణ తయారీ వ్యవస్థకు పెరుగుతున్న సామర్థ్యంఆవిష్కరణస్వావలంబనను ప్రదర్శిస్తుంది.

భూవ్యవస్థలునౌకాదళ వేదికలుగగనతలంఅభివృద్ధి చెందుతున్న సాంకేతికత వంటి రంగాల్లో అత్యాధునిక ఉత్పత్తులుఆధునిక సాంకేతికతలుఆవిష్కరణల విస్తృతశ్రేణిని ప్రదర్శరించనున్నారు. 16 రక్షణ రంగ ప్రభుత్వ సంస్థలు (డీపీఎస్‌యూలు), ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ (ఐడెక్స్నుంచి రక్షణ విభాగానికి చెందిన అంకుర సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి.

భారత స్వదేశీ రక్షణ సామర్థ్యాలపై అవగాహన పెంపొందించటంపరిశ్రమల సహకారాలను ప్రోత్సహించటంవిస్తృత ప్రచార కార్యక్రమాల్లో భాగంగా సాధారణ ప్రజలతో అనుసంధానం కావటమే డీడీపీ పెవిలియన్ లక్ష్యం.

 

***


(Release ID: 2189758) Visitor Counter : 2