శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఈఎస్‌టీఐసీలో క్వాంటమ్ డైమండ్ మైక్రోస్కోపీ ఆవిష్కరణ.. న్యూరోసైన్స్, మెటీరియల్స్ పరిశోధనకు సహకారం

Posted On: 12 NOV 2025 12:08PM by PIB Hyderabad

సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (డీఎస్ టీ)లోని జాతీయ క్వాంటమ్ మిషన్ (ఎన్ క్యూఎం) కింద, ఐఐటీ బాంబేలోని పీ-క్వెస్ట్ గ్రూప్ డైనమిక్ మాగ్నెటిక్ ఫీల్డ్ ఇమేజింగ్ కోసం మొదటి స్వదేశీ క్వాంటమ్ డైమండ్ మైక్రోస్కోప్‌ (క్యూడీఎం)ను అభివృద్ధి చేసింది. క్వాంటమ్ సెన్సింగ్ రంగంలో ఇది ముఖ్యమైన పురోగతి. ఈ ఆవిష్కరణ ఈ విభాగంలో భారత్‌ను మొదటి పేటెంట్‌ దక్కించుకునేలా చేసింది.

ఇటీవల ముగిసిన ఎమర్జింగ్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాన్‌క్లేవ్ (ఈఎస్‌టీఐసీ 2025) సందర్భంగా అధికారికంగా ప్రకటించిన క్వాంటమ్ డాట్ మైక్రోస్కోపీ (క్యూడీఎం), న్యూరోసైన్స్, మెటీరియల్స్ పరిశోధన రంగాల్లో అభివృద్ధికి సహకరిస్తుంది. సెమీ కండక్టర్ చిప్‌ల నిర్మాణ లోపాలను పరీక్షించే ప్రక్రియను మార్చగల సామర్థ్యం దీనికి ఉంది. చిప్ లోపల పొందుపరిచిన 3డీ లేయర్లలోని అయస్కాంత క్షేత్రాన్ని మ్యాపింగ్ చేయటం ద్వారా ఈ పరివర్తన సాధ్యమవుతుంది.

గౌరవ కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు ప్రొఫెసర్ అజయ్ కె. సూద్, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కార్యదర్శి ప్రొఫెసర్ అభయ్ కరంధికర్, ఇతర అధికారుల సమక్షంలో ఈ ప్రకటన చేశారు.

ప్రొఫెసర్ కస్తూరి సాహా నేతృత్వంలోని పీ-క్వెస్ట్ గ్రూప్ అభివృద్ధి చేసిన క్యూడీఎం, వజ్రంలోని నైట్రోజన్-వేకెన్సీ (ఎన్ వీ) కేంద్రాలపై ఆధారపడి పనిచేస్తుంది. సూక్ష్మ స్థాయిలో త్రిమితీయ అయస్కాంత క్షేత్ర ఇమేజింగ్ కోసం ఒక శక్తివంతమైన వేదికను ఇది సూచిస్తుంది.

ఎన్‌వీ కేంద్రాలు – ఇవి ఒక నైట్రోజన్ పరమాణువు, దాని పక్కనున్న ఖాళీ స్థానం కలయికతో ఏర్పడిన అణు స్థాయిలోని లోపాలను గది ఉష్ణోగ్రత వద్ద కూడా శక్తివంతమైన క్వాంటమ్ పొందికతో ప్రదర్శిస్తాయి. ఈ లక్షణం వాటిని అయస్కాంత, విద్యుత్, ఉష్ణ మార్పులకు అత్యంత సున్నితంగా మారుస్తుంది. వాటి స్పిన్-ఆధారిత ఫ్లోరోసెన్స్ ను ఆప్టికల్లీ డిటెక్టెడ్ మాగ్నెటిక్ రెసొనెన్స్ (ఓడీఎంఆర్) ద్వారా గుర్తించటం వలన, స్థానిక అయస్కాంత క్షేత్రాలను ఆప్టికల్ పద్ధతిలో చదవటానికి వీలవుతుంది. ఎక్కువ ఎన్‌వీ సాంద్రత కలిగిన పలచని వజ్రపు పొరను రూపొందించడం ద్వారా, క్యూడీఎం డైనమిక్ అయస్కాంత కార్యకలాపాలను విశాలమైన ప్రాంతంలో ఇమేజింగ్ చేయటానికి వీలు కలుగుతుంది. ఇది ఆప్టికల్ మైక్రోస్కోప్‌తో సమానం.

అధునాతన ఎలక్ట్రానిక్స్‌లో 3డీ చిప్ ఆర్కిటెక్చర్లు, క్రయోజెనిక్ ప్రాసెసర్లు, స్వయం ప్రతిపత్తి వ్యవస్థల పెరుగుదలతో, సాంప్రదాయ రోగనిర్ధారణ సాధనాల అంతర్గత బహుళ-పొరల్లో విద్యుత్ ప్రవాహాన్ని చూపించటంలో విఫలమవుతున్నాయి. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు, బ్యాటరీలు, మైక్రో ఎలక్ట్రానిక్ పరికరాల ప్రత్యక్ష, అధిక-రిజల్యూషన్ 3డీ అయస్కాంత మ్యాపింగ్‌కు క్యూడీఎం ఒక మార్గాన్ని సూచిస్తుంది.

***

 


(Release ID: 2189157) Visitor Counter : 11