ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రత్యేక ప్రచార కార్యక్రమం 5.0ను వేగంగా అమలు చేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల విభాగం

Posted On: 27 OCT 2025 2:30PM by PIB Hyderabad

ఆఫీసు ప్రాంగణాల్లో పెండింగ్ పనులను పూర్తి చేయటానికిపరిశుభ్రత పాటించడానికి ప్రత్యేక ప్రచార కార్యక్రమం 5.0ను ప్రభుత్వ రంగ సంస్థల విభాగం (డీపీఈ) అమలు చేస్తోందిసీజీఓ కాంప్లెక్స్ ఆవరణలోని కార్యాలయాల్లోనే కాకపరిసరాల్లోనూ పరిశుభ్రంగా ఉండేలా డీపీఈ పర్యవేక్షిస్తుంది.

గతంలోలాగే ఈ ప్రచారం రెండు దశల్లో అమలవుతోంది:

  • ఫేజ్ I (16.09.2025 – 30.09.2025): సన్నాహక దశ – ఈ దశలో ఎంపీల సిఫార్సులుపార్లమెంటరీ హామీలురాష్ట్ర ప్రభుత్వాల సూచనలుఅంతర మంత్రిత్వ శాఖల కమ్యూనికేషన్లుప్రజా ఫిర్యాదుల వంటి పెండింగ్ అంశాలను గుర్తిస్తారుశుభ్రపరచాల్సినమెరుగుపరచాల్సినసుందరీకరించాల్సిన ప్రాంతాలను కూడా ఎంపిక చేస్తారు.

  • ఫేజ్ II (02.10.2025 – 31.10.2025): అమలు దశ గుర్తించిన పెండింగ్ అంశాలను పరిష్కరించటంఎంపిక చేసిన ప్రాంతాల్లో స్వచ్ఛతసుందరీకరణనిర్వహణ పనులను ఈ దశలో చేపడతారు.

ఈ ప్రచార కార్యక్రమంలో ఒక సీటీయూ స్థలాన్ని గుర్తించి దాన్ని సుందరీకరించారుఎంపీల సిఫార్సులుపార్లమెంటరీ హామీలుఅంతర మంత్రిత్వ శాఖల కమ్యూనికేషన్లురాష్ట్ర ప్రభుత్వాల సూచనలుపీఎంఓ సిఫార్సుల అంశాలన్నీ పరిష్కరించారుమొత్తం 550 ఫైళ్లను సమీక్షించితొలగించాల్సిన పాత ఫైళ్లను గుర్తించిఫేజ్ IIలో వాటిని తొలగించారు.

ప్రత్యేక ప్రచార కార్యక్రమం 5.0 పురోగతిని సమీక్షించేందుకు కార్యదర్శి (డీపీఈ) 24 అక్టోబర్ 2025న డీపీఈ ఆవరణను తనిఖీ చేశారుఆఫీసులో వినియోగ స్థలాన్ని పెంచేందుకునిరుపయోగమైన వస్తువులుఏఐఓప్రింటర్లుడెస్క్ టాప్ లు వంటి స్క్రాప్ మెటీరియల్ ను గుర్తించివాటిని తీసివేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారుఈ కమిటీ 45 వస్తువులను గుర్తించగావాటిని నిరుపయోగమని నిర్ధారించితొలగించే ప్రక్రియను 28.10.2025న చేపడతారుదీని ద్వారా 180 చదరపు అడుగుల స్థలం వినియోగంలోకి వస్తుంది.

 

****

 

(Release ID: 2183064) Visitor Counter : 3