రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

పదాతిదళ దినోత్సవాన్ని జరుపుకుంటున్న భారత సైన్యం.. ఇది 79వ శౌర్య దివస్

Posted On: 27 OCT 2025 4:32PM by PIB Hyderabad

పదాతిదళ దినోత్సవం లేదా శౌర్య దివాస్ సందర్భంగా భారత సైన్యం న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద నివాళి కార్యక్రమం నిర్వహించిందిపదాతిదళ సైనికుల పరాక్రమానికిత్యాగానికిఅలుపెరుగని స్ఫూర్తికి శ్రద్ధాంజలి ఘటించింది.

దేశ సేవలో ప్రాణలర్పించిన పదాతిదళ సైనికుల ధైర్య సాహసాలుఅత్యున్నత త్యాగాలను గౌరవిస్తూ జాతీయ యుద్ధ స్మారక చిహ్నంలోని అమర్ చక్ర వద్ద ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నివాళులర్పించారుఈ కార్యక్రమానికి సీనియర్ ఆర్మీ అధికారులుప్రస్తుత సైనికులుమాజీ సైనికులుయుద్ధ వీరుల కుటుంబసభ్యులు హాజరయ్యారు.

వీర్ చక్ర పురస్కార గ్రహీతలుపదవీ విరమణ పొందిన ముగ్గురు సైనికులు మేజర్ ఆశిశ్ సోనాల్ఆపరేషన్ పవన్ (1990); సుబేదార్ మేజర్ అండ్ గౌరవ కెప్టెన్ కున్వర్ సింగ్ఆపరేషన్ మేఘదూత్ (1989), లాన్స్ నాయక్ అమృత్ఆపరేషన్ కాక్టస్ లిల్లీ (1971), పదాతిదళ మాజీ సైనికుల తరపున నివాళులు అర్పించటం ద్వారా పరాక్రమంనిస్వార్థ సేవల శాశ్వత వారసత్వం స్పష్టమైంది.

ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జరిగిన వేడుకల్లో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించారులక్నోలో ఫీల్డ్ మార్షల్ కె.ఎంకరియప్ప స్మారక సెమినార్ఢిల్లీలోని కంటోన్మెంట్ లో శౌర్యవీర్ రన్వీర నారీమణులకు సన్మాన కార్యక్రమాలు జరిగాయిపదాతిదళ బహుముఖ సామర్థ్యాన్ని స్పష్టం చేస్తూసాహసోపేతమైన కథనాలను వివరిస్తూ రూపొందించిన 'ఇన్ ఫాంట్రీ మ్యాగజైన్'ను ఈ సందర్భంగా విడుదల చేశారు.

ఏటా అక్టోబర్ 27న జరుపుకునే పదాతిదళ దినోత్సవం దేశ చరిత్రలో కీలకమైన రోజు. 1947లో ఇదే రోజునభారత సైన్యంలోని పదాతిదళ సిబ్బంది శ్రీనగర్ విమానాశ్రయానికి చేరుకున్న తొలి సైనికులుగా నిలిచారుఅనంతరం ఈ దళాలు చేపట్టిన సాహసోపేత కార్యకలాపాలు పాకిస్తాన్ మద్దతున్న గిరిజన దండయాత్రను తిప్పి కొట్టిదేశ సరిహద్దు భద్రతను కాపాడాయిదేశ సార్వభౌమత్వాన్ని కాపాడటంలో పదాతిదళాల స్థిరమైన అంకితభావంప్రదర్శించిన సాటిలేని అంకితభావానికి ఈరోజు శాశ్వత గుర్తుగా నిలిచింది.  

 

***

 

(Release ID: 2183061) Visitor Counter : 9