ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డెహ్రడూన్ లో అక్టోబర్ 17న జరిగే ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2025ను ప్రారంభించనున్న కేంద్ర సహాయమంత్రి శ్రీ జితిన్ ప్రసాద


బాధ్యతాయుతమైన, సమ్మిళిత ఏఐ వృద్ధి కోసం 2026లో జరగనున్న ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కు

ముందుగా ఒక సమావేశాన్ని నిర్వహించనున్న ఉత్తరాఖండ్


డిజిటల్ ఇండియా లక్ష్యానికి అనుగుణంగా ఆవిష్కరణ, పాలన, వ్యవస్థాపకతతో జరిగే ఈ కార్యక్రమంలో డిజిటల్ ఉత్తరాఖండ్ దార్శనికత దిశగా కార్యక్రమంలో

పాల్గొననున్న విధాన రూపకర్తలు, పారిశ్రామికవేత్తలు, అంకుర సంస్థలు, విద్యావేత్తలు

Posted On: 16 OCT 2025 11:40AM by PIB Hyderabad

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎంఈఐటీవైఆధ్వర్యంలోని ఇండియా ఏఐ మిషన్ తో కలిసి ఉత్తరాఖండ్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2025ను అక్టోబర్ 17న డెహ్రడూన్ లోని హోటల్ రమదాలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్వహించనుందిన్యూఢిల్లీలోని భారత మండపంలో ఫిబ్రవరి 19 నుంచి 20, 2026న జరగనున్న ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026కు ముందుగా జరిగే సమావేశమే ఈ కార్యక్రమం.

 

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖవాణిజ్యపరిశ్రమల శాఖ సహాయమంత్రి (ఎంఓఎస్శ్రీ జితిన్ ప్రసాదఉత్తరాఖండ్ ప్రభుత్వ సీనియర్ అధికారులతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరవుతారు.

 

గ్లోబల్ సౌత్ దేశాల్లో మొదటిసారిగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఏఐ ఫోరమ్ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 కార్యక్రమంఇది ప్రపంచ ఏఐ అజెండాను రూపొందించటంలో భారత నాయకత్వాన్ని ప్రతిబింబిస్తుంది. "ఏఐ ఫర్ ఆల్అని దేశ లక్ష్యానికి అనుగుణంగావచ్చే ఏడాది జరిగే అంతర్జాతీయ ఏఐ సమ్మిట్ కు సంబంధించిన ముందస్తు సమావేశం.. సామాజిక సమ్మిళితంఆవిష్కరణమెరుగైన ప్రజా సేవలను అందించేందుకు కృత్రిమ మేధాశక్తిని వినియోగించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

 

ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 మూడు ప్రధాన మార్గదర్శక సూత్రాలు ప్రజలుప్రపంచంపురోగతిపై ఆధారపడి ఉందిమానవాళికి ఏఐ చేసే సేవపర్యావరణ పరిరక్షణసమ్మిళిత వృద్ధిని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశాలను ఈ సూత్రాలు నిర్దేశిస్తాయిఏడు చక్రాలునేపథ్య కార్యనిర్వాహక బృందాల ద్వారా ఈ మార్గదర్శక సూత్రాల అమలు జరుగుతుందివీటిలో ప్రతీదీ ఏఐపై ప్రపంచ ప్రభావాల్లోని ముఖ్యమైన అంశాలపై దృష్టి సారిస్తుందిఈ సూత్రాలుచక్రాలు కలిసి అందించే సమన్వయ వ్యవస్థ.. సంభాషణను ఆశావహమైన హామీల నుంచి మెరుగైన ఫలితాల దిశకు నడిపించటంతో ఏఐ ప్రయోజనాలు ప్రపంచవ్యాప్తంగా సమానంగా అందుతాయి.

 

ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్తరాఖండ్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2025 కార్యక్రమం ఆ రాష్ట్రాన్ని బాధ్యతాయుతమైనసమ్మిళిత ఏఐ వృద్ధిలో ముందువరుసలో నిలబెడుతుందివిధాన రూపకర్తలుపారిశ్రామికవేత్తలుఅంకుర సంస్థలువిద్యావేత్తలు ఈ ముందస్తు కార్యక్రమంలో పాల్గొనిబాధ్యతాయుతమైనసమ్మిళిత ఏఐ వినియోగంతో ఆవిష్కరణలను ప్రోత్సహించటంపాలనను మెరుగుపరచటంఔత్సాహిక పారిశ్రామికవేత్తలను శక్తిమంతం చేయటం ద్వారా ఉత్తరాఖండ్ లో స్థిరమైన అభివృద్ధికి ఏఐ ఎలా సహకరించగలదన్న అంశంపై చర్చించిడిజిటల్ ఉత్తరాఖండ్ విజన్ ను ముందుకు తీసుకెళ్తారుభారత డిజిటల్ పరివర్తన అజెండాఇండియా ఏఐ మిషన్ కు అనుగుణంగా నమ్మకంనైతికతసమ్మిళితత్వం.. వర్దమాన సాంకేతికతల్లో ప్రపంచ నాయకత్వం వహించే దిశగా భారత్ దూసుకెళ్లాలనే ఎంఈఐటీవై ప్రాధాన్యతను ఈ సమ్మిట్ స్పష్టం చేస్తుంది.

 

ఉత్తరాఖండ్ లో మార్పునకు కారణమైన అత్యంత అధునాతన ఏఐ అప్లికేషన్లు, ఔత్సాహిక కార్యక్రమాలను ఈ సమ్మిట్ లో ప్రదర్శిస్తారుఐఐఎం కాశీపూర్ఎస్ టీపీఐ డెహ్రాడూన్ మద్దతుతో పనిచేసే ప్రముఖ ఏఐ ఆధారిత స్టార్టప్ ల ద్వారా ప్రజెంటేషన్లు ఉంటాయిరాష్ట్ర ఐటీ రోడ్ మ్యాప్ఏఐ పాలన విజన్ ను వివరిస్తూ కీలక ఉపన్యాస సెషన్లు ఉంటాయిఇవి సుస్థిరమైనఆవిష్కరణ ఆధారిత వృద్ధిని ముందుకు తీసుకెళ్లే మార్గాన్ని రూపొందిస్తాయి.

 

ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 గురించి

 

ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 19 నుంచి 20, 2026న న్యూఢిల్లీలో ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 జరగనుందిసమ్మిళిత వృద్ధిసుస్థిరతసమానమైన ప్రగతిని పెంపొందించటంలో ఏఐ పరివర్తనాత్మక పాత్రను ఈ ప్రపంచ వేదిక ప్రదర్శించనుందిమానవాళికి సేవ చేయటంసమ్మిళిత వృద్ధిని ప్రోత్సహించటంసామాజిక అభివృద్ధిని పెంపొందించటంప్రపంచాన్ని రక్షించే ఆవిష్కరణలు చేయటం వంటి లక్ష్యాలను ఏఐ ద్వారా సాధించేందుకు ఈ సమ్మిట్ మార్గ నిర్దేశం చేస్తుంది.

 

మూడు సూత్రాలు

 

ఈ సమావేశం మూడు మార్గదర్శక సూత్రాలపై ఆధారపడి ఉంది.

 

ప్రజలు: ఏఐమానవాళి మొత్తానికి సేవ చేయాలివైవిధ్యాన్నిసాంస్కృతిక గుర్తింపులను గౌరవిస్తూవ్యక్తి గౌరవాన్ని కాపాడుతూఏ ఒక్కరూ వెనుకబడకుండా చూడాలిఏఐ ప్రపంచంలో మానవాభివృద్ధిబహుభాషాఅందుబాటులో ఉండే వ్యవస్థలుసురక్షితమైనవిశ్వసనీయమైన ఏఐ వినియోగం వంటివి దృష్టి సారించాల్సిన ప్రధానాంశాలు.

 

ప్రపంచం: ఏఐ అభివృద్ధివినియోగం వనరుల సామర్థ్యం కలిగి ఉండివాతావరణ స్థితిస్థాపకతపర్యావరణ పరిరక్షణశాస్త్రీయ ఆవిష్కరణలను వేగవంతం చేయాలిప్రపంచ పర్యవేక్షణప్రపంచ సుస్థిర లక్ష్యాలకు అనుగుణంగా ఏఐ ఉండాలి.

 

పురోగతి: ఏఐ ప్రయోజనాలను సమానంగా పంపిణీ చేసేందుకు డేటాసెట్లుకంప్యూట్నమూనాలను అందరికీ అందుబాటులో ఉండేలా విస్తరించి.. వైద్యంవిద్యపరిపాలనవ్యవసాయ రంగాల్లో ఏఐని అమలు చేయాలి.

 

ఏడు చక్రాలు

మార్గదర్శక సూత్రాలు ఏడు చక్రాల ద్వారా అమలవుతాయి. వివిధ సహకార విభాగాలుఫలితాలను అందించేందుకు ఈ చక్రాలను రూపొందించారు.

 

మానవ వనరుల పెట్టుబడి - ఉపాధినైపుణ్యంశ్రామిక శక్తి పరివర్తన అంశాలను పరిష్కరించటంఅక్షరాస్యతకొత్త నైపుణ్యాల శిక్షణభవిష్యత్ నైపుణ్యాలను అందరికీ అందుబాటులోకి తీసుకురావటానికి ప్రపంచవ్యాప్తంగా వ్యవస్థను అభివృద్ధి చేయటం.

 

సమ్మిళిత సామాజిక సాధికారత – భాషలు, సంస్కృతులుగుర్తింపులను ప్రతిబింబించే ఏఐని రూపొందించటంవికలాంగులుకు అందుబాటులో ఉంచటంలింగపరమైనడేటా పక్షపాతాలను నిరోధించటం.

 

సురక్షిత, విశ్వసనీయ ఏఐ – భద్రతాపరమైన పరీక్షలుపారదర్శకతఆడిటింగ్ సాధనాలు అందరికీ అందుబాటులో ఉండేలా చూడటంసమైక్య పాలనాహామీ వ్యవస్థలను నిర్మించటం.

 

స్థితిస్థాపకత, ఆవిష్కరణసామర్థ్యం వనరులను సమర్థంగా వినియోగించుకునేతక్కువ భారంతోస్థానిక వాస్తవాలకు అనుగుణంగా మార్చుకోగలిగే ఏఐని ప్రోత్సహించటం వల్ల అసమానతలుపర్యావరణ భారం తగ్గుతాయి.

 

సైన్స్ - పరిశోధనఆవిష్కరణలను వేగవంతం చేసేందుకు బాధ్యతాయుతమైన ఏఐ వినియోగాన్ని విస్తరించాలిగ్లోబల్ సౌత్ దేశాల్లో పర్యావరణ వ్యవస్థలనుభాగస్వామ్యాలను బలోపేతం చేయాలిబహిరంగవివిధ విభాగాల పరిశోధనను ప్రోత్సహించాలి.

 

ఏఐ వనరులను అందరికీ అందుబాటులో ఉంచటం - డేటాకంప్యూట్నమూనాలుకీలక మౌలిక సదుపాయాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ మార్గాలను ఏర్పరచటం ద్వారా ప్రపంచ వాస్తవికతను ప్రతిబింబించే వైవిధ్యమైన ఏఐ పరిష్కారాలను రూపొందించానికి వీలవుతుంది.

 

ఆర్థికాభివృద్ధి, సామాజిక శ్రేయస్సుకు ఏఐ – ప్రజాప్రయోజన రంగాల్లో ఏఐ అప్లికేషన్లను గుర్తించివాటిని విస్తృతం చేయాలిజ్ఞానంవనరులను పంచుకోవటానికి వేదికలను సృష్టించాలిఅంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించాలి.

 

ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, ఏఐ ప్రభావంపైఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో చర్చించనున్నారుగ్లోబల్ సౌత్ దేశాలతో సహా ప్రపంచ దేశాలన్నిటికీ సమావేశకర్తగా భారత్ పాత్రను ఈ సదస్సు స్పష్టం చేస్తుందిప్రపంచ నాయకులుఆవిష్కర్తలువిధాన రూపకర్తలుపారిశ్రామిక నిపుణులు ఈ సదస్సులో పాల్గొని ఎక్కువ మందికి సేవలందించే ఏఐకి ఉమ్మడి దార్శనికతను రూపొందిస్తారు.

 

***


(Release ID: 2180101) Visitor Counter : 9