రక్షణ మంత్రిత్వ శాఖ
సీడీఎస్ రచించిన ‘రెడీ, రిలవెంట్ అండ్ రిసర్జెంట్ II: షేపింగ్ ఎ ఫ్యూచర్ రెడీ ఫోర్స్’ పుస్తకాన్ని విడుదల చేసిన రక్షణ మంత్రి
Posted On:
14 OCT 2025 8:26PM by PIB Hyderabad
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ రచించిన ‘రెడీ, రిలవెంట్ అండ్ రిసర్జెంట్ II: షేపింగ్ ఎ ఫ్యూచర్ రెడీ ఫోర్స్’ అనే పుస్తకాన్ని రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఈ రోజు విడుదల చేశారు. భారత సాయుధ దళాలను భవిష్యత్తుకు అనుగుణంగా సిద్ధం చేయడానికి సమగ్రమైన, భవిష్యత్తు-ఆధారితమైన ప్రణాళికను ఈ పుస్తకం అందిస్తుంది. ఇది మారుతున్న యుద్ధ స్వభావాన్ని లోతుగా విశ్లేషిస్తుంది.. యుద్ధాల గురించి పరిణామాత్మక అవలోకనాన్ని అందిస్తుంది.. సైబర్స్పేస్, అంతరిక్ష-ఆధారిత ఆపరేషన్స్, కాగ్నిటివ్ వార్‌ఫేర్, భారత సాయుధ దళాల కోసం పెరుగుతున్న వాటి ఔచిత్యంపై ప్రధానంగా దృష్టి సారించింది.
బలమైన సైనిక నాయకత్వం, సంస్థాగత బలం ఆవశ్యకతను ప్రధానంగా ప్రస్తావిస్తూ.. ఈ పుస్తకం భారత సైనిక భవిష్యత్తు గురించిన దృక్పథాన్ని ధైర్యంగా తెలియజేస్తుంది.. ఇది చారిత్రక జ్ఞానంతో ముడిపడి.. సాంకేతిక పురోగతితో నడుస్తూ, సంసిద్ధతను, విశ్వసనీయతను, ప్రఖ్యాతిని పొందాలనే భారత దార్శనికతపై ప్రధానంగా దృష్టి సారించింది. ఈ పుస్తక విడుదల కార్యక్రమంలో సెంటర్ ఫర్ జాయింట్ వార్‌ఫేర్ స్టడీస్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ (డాక్టర్) అశోక్ కుమార్, పెంటగాన్ ప్రెస్ నుంచి ప్రచురణకర్త శ్రీ రాజన్ ఆర్య పాల్గొన్నారు.
***
(Release ID: 2179178)
Visitor Counter : 11