భారత ఎన్నికల సంఘం
రాజకీయ పార్టీలు ఇచ్చే ప్రకటనలకు ఎంసీఎంసీ నుంచి ముందస్తు ధ్రువీకరణ పొందాలని, అభ్యర్థులు అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాల సమాచారాన్ని సమర్పించాలని ఆదేశించిన కమిషన్
Posted On:
14 OCT 2025 10:05AM by PIB Hyderabad
-
బీహార్‌లో సాధారణ శాసనసభ ఎన్నికలతో పాటు ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్లో 8 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను 2025 అక్టోబర్ 6న భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రకటించింది.
-
సోషల్ మీడియాతో సహా ఎలక్ట్రానిక్ మీడియాలో అన్ని రాజకీయ ప్రకటనలను ప్రచురించడానికి ముందస్తు ధ్రువీకరణ కోసం ప్రతి నమోదైన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీ, పోటీ చేసే ప్రతి అభ్యర్థి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ)కు దరఖాస్తు చేసుకోవాలని 2025, అక్టోబర్ 9న ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
-
నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం రాజకీయ ప్రకటనలకు ముందస్తు ధ్రువీకరణ అందించేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో ఎంసీఎంసీలు ఏర్పాటయ్యాయి.
-
ఎంసీఎంసీ నుంచి ముందస్తు ధ్రువీకరణ లేకుండా సోషల్ మీడియా వెబ్‌సైట్లతో పాటు.. ఇంటర్నెట్ ఆధారిత మీడియా లేదా వెబ్‌సైట్లలో రాజకీయ పార్టీలు కానీ, అభ్యర్థులు కానీ ఎలాంటి రాజకీయ ప్రకటనలు చేయరాదు.
-
మీడియాలో వచ్చే చెల్లింపు వార్తలకు సంబంధించిన అనుమానాస్పద కేసులపై ఎంసీఎంసీలు నిఘా ఉంచి అవసరమైన చర్యలు తీసుకుంటాయి.
-
ఎన్నికల సమయంలో సోషల్ మీడియా ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని.. నామినేషన్లను దాఖలు చేసే సమయంలో తమ అధికారిక సామాజిక ఖాతాల వివరాలు సమర్పించాల్సిందిగా అభ్యర్థులను ఆదేశించింది.
-
ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని 77(1) సెక్షన్, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన 75 రోజుల్లోగా అన్ని రాజకీయ పార్టీలు సామాజిక మాధ్యమ వెబ్‌సైట్లతో పాటు ఇంటర్నెట్ ద్వారా ప్రచారానికి చేసిన ఖర్చుల వివరాలను ఈసీఐకు సమర్పించాలి.
-
అలాంటి ఖర్చుల్లో ఇతర విషయాలతో పాటు.. ప్రకటనలు ప్రచురించడానికి, ప్రచారానికి సంబంధించిన కంటెంట్ తయారు చేయడానికి సంబంధించి ఇంటర్నెట్ సంస్థలు, వెబ్సైట్లకు చేసిన చెల్లింపులు, సామాజిక మాధ్యమ ఖాతాల నిర్వహణా వ్యయానికి సంబంధించిన వివరాలు ఉండాలి.
***
(Release ID: 2178781)
Visitor Counter : 6