మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రూ.5862 కోట్లకు పైగా వ్యయంతో కొత్తగా 57 కేంద్రీయ విద్యాలయాల (కేవీఎస్) ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం

Posted On: 01 OCT 2025 3:14PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య పెరిగిన దృష్ట్యా వారి పిల్లల విద్యావసరాలను తీర్చేందుకు దేశవ్యాప్తంగా ప్రజా విభాగంలో 57 కొత్త కేంద్రీయ విద్యాలయాలను (కేవీఏర్పాటు చేసేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. 2026-27 మధ్య తొమ్మిది సంవత్సరాల పాటు ఈ 57 కొత్త కేవీల ఏర్పాటునిర్వహణకు దాదాపు రూ. 5862.55 కోట్లు వ్యయమవుతుందన్న అంచనా ఉందిఇందులో రూ. 2585.52 కోట్లు (సుమారుగామూలధన వ్యయం కాగా.. రూ. 3277.03 కోట్లు (సుమారుగానిర్వహణ వ్యయంఎన్ఈపీ 2020కి ఆదర్శవంతమైన పాఠశాలలుగా నిలిచేలా మొదటిసారిగా ఈ 57 విద్యాలయాల్లో బాలవాటికలు అంటే సంవత్సరాల ఫౌండేషన్ దశ సౌకర్యాలు (ప్రీ-ప్రైమరీఉండనున్నాయి.

 

రక్షణపారామిలిటరీ దళాలతో సహా బదిలీ అయ్యేబదిలీ కాని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల విద్యా అవసరాలను తీర్చేందుకుదేశవ్యాప్తంగా ఒకే ప్రామాణిక విద్యనందించేందుకు భారత ప్రభుత్వం 1962 నవంబర్‌లో కేంద్రీయ విద్యాలయాల పథకాన్ని ఆమోదించిందిదీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలో "కేంద్రీయ పాఠశాలల సంస్థ (సెంట్రల్ స్కూల్స్ ఆర్గనైజేషన్)" ప్రారంభమైంది.

 

కొత్త కేవీలను ప్రారంభించటం నిరంతర ప్రక్రియకొత్త కేవీలను ఏర్పాటుచేసేందుకు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు-విభాగాలురాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలతో సహా వివిధ స్పాన్సరింగ్ యంత్రంగాల నుంచి మంత్రిత్వ శాఖకేవీఎస్‌లు (కేంద్రీయ విద్యాలయ సంఘటన్తరచుగా ప్రతిపాదనలు అందుకుంటుంటాయిఈ ప్రతిపాదనలను సంబంధిత స్పాన్సరింగ్ యంత్రంగాలు అంటే రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలుమంత్రిత్వ శాఖలుకేంద్ర ప్రభుత్వ విభాగాలు స్పాన్సర్ చేస్తాయినేటికి 1288 కేవీలు పనిచేస్తున్నాయివీటిలో విదేశాల్లో (మాస్కోఖాట్మండుటెహ్రాన్ఉన్నాయి. 2025 జూన్ 30 నాటికి నమోదైన మొత్తం విద్యార్థుల సంఖ్య 13.62 లక్షలు (దాదాపు).

 

దేశవ్యాప్తంగా కేవీలను నెలకొల్పటంతో పాటు కేవీలకు ఉన్న అధిక డిమాండ్‌కు అనుగుణంగా గతంలో మంజూరు చేసిన 85 కేవీలకు కొనసాగింపుగా ఈ తాజా ముంజూరు ఉందిఈ 57 విద్యాలయాల్లో కేవీలను హోం మంత్రిత్వ శాఖ స్పాన్సర్ చేయగా.. మిగిలిన 50 కేవీలకు రాష్ట్రకేంద్ర పాలిత ప్రాంతాలు స్వాన్సర్‌గా ఉన్నాయికేంద్రీయ విద్యాలయాల కోసం వచ్చిన 57 కొత్త ప్రతిపాదనలు వెనుకబడినవ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రాంతాలను చేరుకునే విషయంలో బలమైన నిబద్ధతను తెలియజేస్తున్నాయితూర్పు ప్రాంతంలో వృద్ధిని నిర్ధారిస్తూ ఉత్తరదక్షిణపశ్చిమ ప్రాంతాలకు సమతుల్య ప్రాతినిధ్యం ఉండేలా చూసుకుంటూ సమ్మిళితత్వంజాతీయ సమైక్యతను బలోపేతం చేసేందుకు అవలంబించిన విధానాన్ని ఈ కొత్త విద్యాలయాలు మంజూరు తెలియజేస్తోందిడిసెంబర్ 2024లో మంజూరు చేసిన 85 కేవీలకు కొనసాగింపుగా ప్రస్తుతం ముంజూరైన కేవీలు 17 రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల్లో రానున్నాయిప్రస్తుతం ఆమోదించిన వాటిలో 20 కేవీలు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గణనీయంగా ఉన్నప్పటికీ... కేవీల్లేని జిలాల్లో రానున్నాయిఆకాంక్షాత్మక జిల్లాల్లో 14 కేవీలుఎల్‌డబ్ల్యుఈ జిల్లాల్లో కేవీలుఎన్‌ఈఆర్కొండ ప్రాంతాల్లో కేవీలు ఉన్నాయిమార్చి 2019 నుంచి కేవీల మంజూరులో ప్రాధాన్యత లభించని రాష్ట్రాలకు ఈ విడతలో కేవీలను కేటాయించారుడిసెంబర్ 2024లో చేసిన 85 కేవీల మంజూరుకు కొనసాగింపుగా ప్రస్తుతం 57 విద్యాలయాల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.

 

కొత్త కేవీల ప్రాజెక్టును అమలుచేసేందుకు దాదాపు 1520 మంది విద్యార్థుల సామర్థ్యంతో ఒక పూర్తి స్థాయి కేవీని నిర్వహించేందుకు సంఘటన్ నిర్ణయించిన నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించాల్సి ఉంటుందిమొత్తంగా 86640 మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారుప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఒక పూర్తి స్థాయి కేవీ (బాల్‌వాటిక నుంచి 12వ తరగతి వరకు) 81 మందికి ఉపాధి కల్పిస్తుందితదనుగుణంగా 57 కొత్త కేవీల ఆమోదంతో ప్రత్యక్షంగా మొత్తం 4617 మంది శాశ్వత ఉపాధి పొందనున్నారుకేవీల నిర్మాణంసౌకర్యాల పెంపుతో సంబంధం ఉన్న పనులు.. అనేక మంది నైపుణ్యం కలిగిననైపుణ్యం లేని కార్మికులకు ఉపాధి అవకాశాలు సృష్టించే అవకాశం ఉంది.

 

జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం 913 కేవీలను ‘పీఎం శ్రీ’ పాఠశాలలుగా మార్చారుఇది ఎన్ఈపీ 2020 అమలవుతోన్న తీరును తెలియజేస్తోందినాణ్యమైన విద్యవినూత్న బోధనఅధునాతన మౌలిక సదుపాయాల కారణంగా కేవీలకు డిమాండు ఎక్కువగా ఉందిప్రతి సంవత్సరం కేవీలలో బాలవాటికఒకటో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య పెరుగుతూనే ఉందిసీబీఎస్ నిర్వహించే బోర్డు పరీక్షలలో కేంద్రీయ విద్యాలయ విద్యార్థుల ఉత్తీర్ణత అన్ని విద్యా వ్యవస్థలతో పోల్చితే అత్యుత్తమంగా ఉంది.

 

కేవీలు మోడల్ పాఠశాలలుగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు చేసిన మంజూరులలో ప్రాతినిధ్యం పొందని లేదా తక్కువ ప్రాతినిధ్యం లభించిన రాష్ట్రాలలో నాణ్యమైన విద్యను పెంపొందించేందుకు తాజా మంజూరు ఉపయోగపడుతుందిఅదే సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గణనీయమైన సంఖ్యలో ఉండి అధిక డిమాండ్ ఉన్న ప్రాంతాలలోఆకాంక్షాత్మక జిల్లాల్లో కేవీలను బలోపేతం చేయడం.. కేవీఎస్ నెట్‌వర్క్‌ను భౌగోళిక సవాళ్లున్నసామాజికంగా కీలకమైన ప్రాంతాలకు విస్తరించేలా ప్రస్తుత ప్రతిపాదన చూసుకోనుంది.

***


(Release ID: 2173877) Visitor Counter : 7