ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మధ్యప్రదేశ్, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో... 2025-26 సంవత్సరానికి నల్లమందు పంట సాగు కోసం వార్షిక అనుమతి విధానాన్ని ప్రకటించిన ప్రభుత్వం


సుమారు 1.21 లక్షల మంది రైతులు ఈ లైసెన్సులు అందుకోవడానికి అర్హులు...

ఈ విధమైన అనుమతుల్లో 23.5 శాతం వృద్ధి..

వెనకటి సంవత్సరం కన్నా కొత్తగా 15,000 మంది రైతుల నమోదు

Posted On: 12 SEP 2025 2:16PM by PIB Hyderabad

గసగసాల పంట 2025-26 వార్షిక అనుమతుల విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రకటించిందిఈ ఏడాది అక్టోబరు మొదలు వచ్చే సంవత్సరం సెప్టెంబరు 30 వరకు ఒపియం పంట సంవత్సరంఈ కాలంలో మధ్యప్రదేశ్రాజస్థాన్‌ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ఒపియం రైతులు పంట సాగు కోసం లైసెన్సు తీసుకోవాల్సి ఉంటుంది.

ప్రస్తావిత విధానంలో పేర్కొన్న సాధారణ షరతుల ప్రకారంఈ రాష్ట్రాల్లో ఓపీయం సాగుకు లైసెన్సుల మంజూరుకు... అర్హత ఉన్న రైతులు దాదాపు ఒక లక్షా ఇరవై ఒక్క వేల మంది ఉన్నారుఈ సంఖ్య వెనకటి పంట సంవత్సరంలో జారీ చేసిన అనుమతుల కన్నా 23.5 శాతం ఎక్కువఈ విధంగా చూస్తేఈసారి ఓపీయం సాగుతో అదనంగా 15,000 మంది రైతులు లాభపడనున్నారు.

వైద్య అవసరాలతో పాటు ప్రాణాంతక వ్యాధి అవసరాలను తీర్చడానికి అల్కలాయిడ్లు తగినంతగా సరఫరా అయ్యేటట్లు చూడడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకొంటోందిఅలాగేఅతి ముఖ్య నార్కోటిక్ డ్రగ్స్ ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకొని అవసరపడే అల్కలాయిడ్లను సమకూర్చడానికి దేశీయంగా స్వయంసమృద్ధి చర్యల ద్వారా ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచే దిశగా కూడా ప్రయత్నాలు సాగుతున్నాయి.

వార్షిక అనుమతుల విధానం ముఖ్యాంశాలు:
•  
ప్రస్తుతం నల్లమందు బంక సాగులో ఒక్కో హెక్టారుకు 4.2 కిలోలులేదా అంతకన్నా ఎక్కువగా కనీస అర్హత దిగుబడి (మినిమం క్వాలిఫైయింగ్ యీల్డ్..ఎంక్యూవై)సాధించిన సాగుదారులను వదులుకోకుండా ఉండడం.

•  ఒక్కొక్క హెక్టారుకు 3.0 కేజీ నుంచి 4.2 కేజీ మధ్య స్థాయిలో మార్ఫిన్ దిగుబడులను సాధించే నల్లమందు బంక ఉత్పాదకులు ఇక అయిదు సంవత్సరాల అనుమతి చెల్లుబాటును పొందడానికి అర్హులు కావడంతో పాటు ఎక్కువ సాంద్రత కలిగిన గసగసాల గడ్డి (కాన్సెంట్రేట్ ఆఫ్ పాపీ స్ట్రా.. సీపీఎస్పద్ధతిలో భాగంగా చీరుడుకు లోను చేయని గసగసాల గడ్డి (అన్‌లాన్స్‌డ్ పాపీ స్ట్రా)ని సాగు చేయడానికీ అర్హులు అవుతారు.


దీనికి తోడు, 1995-96 నుంచి రైతుల సమాచారాన్ని డిజిటల్ పద్ధతిలో నమోదు చేస్తుండడంతో పలువురి నమోదులు సాధ్యపడుతున్నాయిదీంతో వెనకటి సంవత్సరాల సన్నకారు రైతులకు నిర్దేశిత యోగ్యతసడలించిన గీటురాళ్లను లెక్కలోకి తీసుకొని అనుమతులను సంపాదించుకోవడంలో తోడ్పాటు లభిస్తోంది.    

ఒక్కొక్క హెక్టారుకు 900 కేజీలుఅంతకన్నా ఎక్కువ అన్‌లాన్స్‌డ్ పాపీ స్ట్రా దిగుబడిని.. సాధించిన రైతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఒక ప్రతిపాదనను తీసుకువచ్చిందివారికి నల్లమందు బంక సాగును సంప్రదాయక పద్ధతికి మారే ఐచ్ఛికాన్ని ఇవ్వజూపనుందిఈ మార్పును ప్రవేశపెట్టడంలో ఉద్దేశం వారి కమతాల్లో అధిక దిగుబడి సామర్థ్యం కల నల్లమందును మరింత సాగు చేయడాన్ని ప్రోత్సహించాలన్నదేదీంతో పాటుఇది పొలం నుంచి నల్లమందును ఇతరత్రా ఉపయోగాల కోసం మళ్లించే అపాయాన్ని తగ్గించడానికి ఉద్దేశించిన ఒక సకారాత్మక ధ్రువీకరణ యంత్రాంగంలా కూడాను పనిచేస్తుంది.

అదే కాలంలోగత సంవత్సరం (2024-25)లో కనీసంగా నిర్దేశించిన ఒక్కో హెక్టారుకు 800 కేజీల ఎంక్యూవై షరతును నెరవేర్చని రైతులకు 2025-26 పంట సంవత్సరానికి గాను సీపీఎస్ సాగులో భాగంగా అనుమతులివ్వడాన్ని ప్రభుత్వం నిలిపేయనుంది.  

ఓపియంఅల్కలాయిడ్ ఫ్యాక్టరీల సామర్థ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం చురుగ్గా చర్యలు చేపడుతోందిఈ సంవత్సరంలోనీమచ్‌లోని ప్రభుత్వ అల్కలాయిడ్ కర్మాగారం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓజీఎంపీ ధ్రువీకరణ పత్రాన్ని పొందిందిఅల్కలాయిడ్ ఏపీఐలుఫార్ములేషన్లలో భారతీయ ఔషధ నిర్మాణ పరిశ్రమలకు సహకారాన్ని అందిస్తూనేమరో వైపు ప్రభుత్వ నియంత్రణలోని అల్కలాయిడ్ యూనిట్లకు స్వయంసమృద్ధిని అందించడం ఈ విధానం ఉద్దేశంవాటి సాంకేతిక ప్రావీణ్యాన్నీబ్రాండుకున్న విశ్వసనీయతనూ సద్వినియోగపరుచుకుంటూ ‘‘మేక్ ఫర్ వరల్డ్’’ (ప్రపంచ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఉత్పత్తి చేయడంవిజన్‌ను ప్రోత్సహించాలన్నది కూడా ఈ కార్యక్రమం ధ్యేయం.

నల్లమందు బంకకు సంబంధించినసీపీఎస్ కు సంబంధించి మరింత సమాచారాన్ని ఈ  కింది లింకులలోకి వెళ్లి తెలుసుకోవచ్చు:  

CLICK HERE FOR GAZETTE NOTIFICATION (OPIUM GUM)

CLICK HERE FOR GAZETTE NOTIFICATION (CPS)

 

***


(Release ID: 2166165) Visitor Counter : 17