మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవ సందర్భంగా విద్యార్థుల శ్రేయస్సు - ఆత్మహత్యల నివారణ సర్వేల్లో విస్తృత భాగస్వామ్యం కోసం పిలుపునిచ్చిన జాతీయ టాస్క్ ఫోర్స్

Posted On: 10 SEP 2025 9:08PM by PIB Hyderabad

ఈనెల 10న ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవ సందర్భంగా విద్యార్థులుతల్లిదండ్రులుఅధ్యాపకులుసంస్థలుమానసిక ఆరోగ్య నిపుణులంతా సర్వేలో పాల్గొని అభిప్రాయాలను పంచుకోవాలని ఎన్‌టీఎఫ్ విజ్ఞప్తి చేసింది.

టాస్క్ ఫోర్స్ ఆదేశం

ఎన్‌టీఎఫ్ కింది అంశాలతో ఒక సమగ్ర నివేదికను తయారు చేయనుంది:

  • ర్యాగింగ్వివక్షతచదువుల ఒత్తిడిఆర్థికపరమైన ఒత్తిడిమానసిక ఆరోగ్యపరమైన నిందలు సహా ఆత్మహత్యలకు గల ప్రధాన కారణాలను గుర్తించడం.

  • విద్యార్థుల శ్రేయస్సును ప్రభావితం చేసే వ్యవస్థ సంబంధితసంస్థాగత లోపాలను పరిశీలించడం.

  • మానసిక ఆరోగ్యపరమైన సహాయాన్ని మెరుగుపరచడానికిఆత్మహత్యలను నివారించడానికి నిర్దిష్టమైనక్రియాశీల చర్యలను సిఫార్సు చేయడం

ప్రస్తుత పరిస్థితి

దేశంలోని 60,380కి పైగా ఉన్నత విద్యా సంస్థల్లో (హెచ్ఈఐలలో4.46 కోట్ల మంది విద్యార్థులు16 లక్షల మంది అధ్యాపకులు ఉన్నారు (ఏఐఎస్‌హెచ్ఈ 2022–23 ప్రకారం).

ఎన్‌సీఆర్‌బీ-2022 నివేదిక ప్రకారం 13,044 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని మరణించారుఇది మొత్తం ఆత్మహత్యా మరణాల్లో 7.6 శాతం.

టాస్క్ ఫోర్స్ కార్యకలాపాలు

సంస్థాగత సందర్శనలు

ఢిల్లీహర్యానాకర్ణాటకతమిళనాడు రాష్ట్రాల్లోని 13 సంస్థలను ఎన్‌టీఎఫ్ సందర్శించిందివిద్యార్థులుఅధ్యాపకులునిర్వాహకులుఫిర్యాదుల కమిటీలతో సమావేశమైందివెనకబడిన నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థులకువారి సంక్షేమానికి మద్దతునిచ్చే మౌలిక సదుపాయాలుసేవలపై ప్రత్యేకంగా దృష్టి సారించిందిమరిన్ని సంస్థల సందర్శనకూ యోచిస్తున్నారు.

సంబంధిత వ్యక్తులతో సంప్రదింపులు

వైద్య విద్యార్థులుదివ్యాంగుల హక్కుల కార్యకర్తలుప్రత్యేక జెండర్ గల విద్యార్థులుఎస్సీ-ఎస్టీ విద్యార్థులు సహా ఇతర సంబంధిత వ్యక్తులతో టాస్క్ ఫోర్స్ సంప్రదింపులు నిర్వహించిందిపలు సివిల్ సొసైటీ గ్రూపులుఎన్‌జీవోలుసంఘాలు కూడా తమ అభిప్రాయాలను అందించాయి.

సర్వేలు

ఎన్‌టీఎఫ్ వీరి కోసం దేశవ్యాప్తంగా ఇంగ్లీష్హిందీ భాషల్లో ఆన్‌లైన్ సర్వేలు నిర్వహిస్తోంది:

  • ఉన్నత విద్యా సంస్థల విద్యార్థులు

·      తల్లిదండ్రులు/సంరక్షకులు

·      బోధనా సిబ్బంది

·      మానసిక ఆరోగ్య నిపుణులు

·      సాధారణ ప్రజలు

ఇప్పటి వరకు అందుకున్న స్పందనలు:

·      80 వేలకు పైగా విద్యార్థులు

·      10 వేలకు పైగా బోధనా సిబ్బంది

·      15 వేలకు పైగా తల్లిదండ్రులు

·      700 లకు పైగా మానసిక ఆరోగ్య నిపుణులు

·      వేలకు పైగా సంబంధిత పౌరులు

సర్వేలు ఇక్కడ అందుబాటులో ఉంటాయిhttps://ntf.education.gov.in

నియంత్రణ సంస్థలకు ఆదేశాలు

ఏఐసీటీఈఎన్ఎమ్‌సీఫార్మసీ కౌన్సిల్నర్సింగ్ కౌన్సిల్బార్ కౌన్సిల్ వంటి నియంత్రణ సంస్థలు ఈ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని ఉన్నత విద్యా శాఖ ఆదేశించిందిఆయా సంస్థలు కింది వివరాలను అందించాలి:

  • కేటగిరీకోటా వారీగా విద్యార్థి/అధ్యాపక కూర్పు

·      అందుబాటులో ఉన్న మానసిక ఆరోగ్య సేవలు

·      ఆత్మహత్యలుఆత్మహత్యా ప్రయత్నాల రికార్డులు

·      బడికి మానేసిన విద్యార్థులు

  • ఫిర్యాదుల పరిష్కార కమిటీలు (ర్యాగింగ్ వ్యతిరేక కమిటీఅంతర్గత ఫిర్యాదుల కమిటీసమాన అవకాశాల విభాగంమొదలైనవి)

  • విద్యార్థుల శ్రేయస్సుకు సంబంధించిన సవాళ్లు చేపట్టిన చర్యలు

ఏఐఎస్‌హెచ్ఈ కింద నమోదైన అన్ని హెచ్ఈఐలు ఈనెల 12 నాటికి సంస్థాగత సర్వేను పూర్తి చేయాలి.

ఇప్పుడే సర్వేలో పాల్గొనండిhttps://ntf.education.gov.in

 

***


(Release ID: 2165570) Visitor Counter : 2
Read this release in: English , Urdu , Hindi