రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బక్సర్ - భాగల్‌పూర్ (బీహార్) హైస్పీడ్ కారిడార్‌ పరిధిలో... మోకామా- ముంగేర్ 4 వరుసల హరిత... ప్రవేశ నియంత్రిత

రహదారి నిర్మాణానికి కేబినెట్ ఆమోదం

వ్యయం: రూ. 4447.38 కోట్లు…. విస్తీర్ణం: 82.4 కి.మీ

హైబ్రిడ్ వార్షిక చెల్లింపు (హామ్) విధానంలో నిర్మాణం

Posted On: 10 SEP 2025 3:10PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ బీహార్‌లోని బక్సార్ భాగల్‌పూర్ హైస్పీడ్ కారిడార్‌ పరిధిలోని మోకామా ముంగేర్ వరుసల హరిత కొత్త ప్రావేశిక నియంత్రిత రహదారి నిర్మాణానికి ఈ రోజు ఆమోదం తెలిపిందిమొత్తం 82.4 కి.మీ పొడవున్న ఈ రహదారి ప్రాజెక్టు మొత్తం మూలధన వ్యయం రూ. 4447.38 కోట్లుహైబ్రిడ్ వార్షిక చెల్లింపు విధానం (హామ్)లో దీన్ని నిర్మించనున్నారు.

 

అనుబంధం-Iలోని చిత్రపటంలో సూచించిన విధంగా.. మోకామాబరాహియాలఖిసరాయ్జమల్పూర్ముంగేర్ వంటి ముఖ్యమైన ప్రాంతీయ నగరాలను ఈ కొత్త రహదారి భాగల్పూర్‌తో అనుసంధానిస్తుంది.

 

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ (ప్రస్తుత గన్ ఫ్యాక్టరీఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కారిడార్‌లో భాగంగా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన మరో ఫ్యాక్టరీ), లోకోమోటివ్ కర్మాగారం (జమల్‌పూర్‌లో), ఆహార శుద్ధి (ఉదాముంగేర్‌లోని ఐటీసీ), సంబంధిత రవాణాగిడ్డంగుల ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ... తూర్పు బీహార్‌లోని ముంగేర్జమాల్పూర్భాగల్పూర్ ప్రాంతం కీలక పారిశ్రామిక ప్రాంతంగా ఎదుగుతోందిభాగల్‌పురి సిల్క్ ప్రధాన ఆకర్షణగా.. జౌళిరవాణా ప్రధాన కేంద్రంగా భాగల్‌పూర్ నిలుస్తోంది. (భాగల్‌పూర్‌లోని ప్రతిపాదిత జౌళి అనుకూల వ్యవస్థ వివరాలు). అలాగే ఆహార ప్యాకేజింగ్శుద్ధివ్యవసాయ గిడ్డంగుల నిలయంగా బరాహియా ఎదుగుతోందిఈ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాల పెరుగుదల భవిష్యత్తులో సరుకు రవాణాతోపాటు మోకామా-ముంగేర్ ప్రాంతంలో రాకపోకలను పెంచుతాయని భావిస్తున్నారు.

 

క్లోజ్ టోలింగ్ విధానంలో గంటకు గరిష్టంగా వంద కిలోమీటర్ల వేగానికి తగినట్టుగా నిర్మించిసగటున గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడానికి వీలున్న ఈ కారిడార్ మొత్తం ప్రయాణ సమయాన్ని దాదాపు 1.5 గంటలకు తగ్గిస్తుందిప్రయాణికులకుసరుకు రవాణా వాహనాలకు సురక్షితమైనవేగవంతమైనఅంతరాయాల్లేని అనుసంధానాన్నీ అందిస్తుంది.

 

82.40 కి.మీ ఉన్న ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు ద్వారా దాదాపు 14.83 లక్షల ప్రత్యక్ష పని దినాలు లభిస్తాయిపరోక్షంగా 18.46 లక్షల పని దినాల పరోక్ష ఉపాధి లభిస్తుందిప్రతిపాదిత కారిడార్ పరిసరాల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరగడం వల్ల ఈ ప్రాజెక్టు ద్వారా అదనపు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

 

అనుబంధం-1

మోకామా - ముంగేర్ ప్రాజెక్టు ప్రణాళిక చిత్రపటం

 

 


(Release ID: 2165318) Visitor Counter : 2