పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
జాతీయ జంతు ఉద్యానవనంలో... కొత్త పక్షులేవీ మరణించలేదు
ఏవియన్ ఇన్ఫ్లూయెంజాపై కొనసాగుతోన్న ఎన్‌జెడ్‌పీ నిఘా
నాడు పోస్టు చేయడమైనది:
09 SEP 2025 6:56PM by PIB Hyderabad
జంతు ప్రదర్శనశాల ఆవరణలోని నీటి పక్షుల్లోగానీ, చెరువుల చుట్టూ ఉన్న పక్షుల్లోగానీ గడిచిన 72 గంటల్లో ఎలాంటి మరణం సంభవించలేదని జాతీయ జంతు ఉద్యానవనం అధికారులు వెల్లడించారు.
నీటి పక్షుల చెరువు, ఐసోలేషన్ వార్డులో 24 ఆగస్టు 2025 నుంచి 06 సెప్టెంబర్ 2025 వరకు మొత్తం 9 పెయింటెడ్ స్టార్క్‌లు, 3 బ్లాక్-హెడ్ ఐబీఎస్‌లు మరణించాయి. వీటిలో 7 నమూనాల్లో హెచ్5ఎన్1 ఏవియన్ ఇన్ఫ్లూయెంజా వైరస్ ఉన్నట్లు తేలింది.
28 ఆగస్టు 2025 తర్వాత నీటి పక్షుల చెరువులో ఏదీ మరణించలేదు. 6, సెప్టెంబర్ 2025 తర్వాత ఐసోలేషన్ వార్డులో కూడా ఎలాంటి మరణాలూ నమోదు కాలేదు. వార్డులో 2 పక్షులు కోలుకుంటున్నాయి.
ఇప్పటి వరకు నీటి చెరువులో 5 వలస పెయింటెడ్ స్టార్క్‌లు మరణించాయి. వీటిలో 3 నమూనాలు హెచ్5ఎన్1 వైరస్ ఉన్నట్లు తేలింది. సెప్టెంబర్ 1 తర్వాత వలస పక్షుల్లో ఏదీ మరణించలేదు.
పర్యావరణ నమూనాలను సేకరించి, భోపాల్‌లోని ఎన్‌ఐహెచ్‌ఎస్‌ఏడీకి పరీక్షల కోసం పంపారు. వీటి ఫలితాలు రావాల్సి ఉంది.
జంతు ప్రదర్శనశాలలోని మరే జూ జంతువుల్లో ఇన్ఫ్లూయెంజా లక్షణాలు కనిపించలేదు.
పక్షులు, జంతువులు, జూ సిబ్బంది ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు విస్తృత పారిశుధ్యం, జీవ-భద్రతా చర్యలు కఠినంగా అమలు చేస్తున్నారు.
పక్షుల వ్యాధి వ్యాప్తిని విలీలైనంత త్వరగా అరికట్టేందుకు జాతీయ జంతు ఉద్యానవన అధికారులు పూర్తి అప్రమత్తతతో పనిచేస్తున్నారు. వారు ప్రామాణిక విధానాలు, మార్గదర్శకాలనూ అనుసరిస్తూ.. తక్షణ చర్యలు చేపడుతున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2165189)
సందర్శకుల సూచీ సంఖ్య : : 18