పార్లమెంటరీ వ్యవహారాలు
azadi ka amrit mahotsav

పార్లమెంట్ ఉభయ సభల నిరవధిక వాయిదా.. ముగిసిన వర్షాకాల సమావేశాలు


15 బిల్లులను ఆమోదించిన పార్లమెంటు ఉభయ సభలు

పహల్గామ్‌లో ఉగ్రదాడి ప్రతిస్పందనగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై ఉభయ సభల్లో ప్రత్యేక చర్చ

Posted On: 21 AUG 2025 7:29PM by PIB Hyderabad

పార్లమెంట్ ఉభయ సభలు 2025 అగస్టు 21 నాడు నిరవధికంగా వాయిదా పడ్డాయి. 2025 జూలై 21వ తేదీ సోమవారం నాడు పార్లమెంటు వర్షకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. 32 రోజుల వ్యవధిలో మొత్తం 21 సెషన్లు జరిగాయి.

 

ఈ సమావేశాల్లో లోక్‌సభలో 14 బిల్లులను ప్రవేశపెట్టారులోక్‌సభ 12 బిల్లులనురాజ్యసభ 15 బిల్లులను ఆమోదించిందిమొత్తం 15 బిల్లులను పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయిలోక్‌సభలో ఒక బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

 

పహల్గామ్‌లో ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్‌ విజయవంతగా చేపట్టిన నిర్ణయాత్మకధీటైన 'ఆపరేషన్ సిందూర్'పై జూలై 28, 29 తేదీల్లో లోక్‌సభలో.. జూలై 29, 30 తేదీల్లో రాజ్యసభలో ప్రత్యేక చర్చ చేపట్టారులోక్‌సభలో 18 గంటల 41 నిమిషాల పాటు చర్చ జరిగిందిఇందులో 73 మంది సభ్యులు పాల్గొన్నారుప్రధానమంత్రి దీనిపై మాట్లాడారురాజ్యసభలో మొత్తం 16 గంటల 25 నిమిషాల పాటు చర్చ జరిగిందిఇందులో 65 మంది సభ్యులు పాల్గొన్నారుఇక్కడ సభ్యులడిగిన ప్రశ్నలకు హోంమంత్రి సమాధానం ఇచ్చారు.

 

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 (4) కింద మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలల పాటు పొడిగించేందుకు ఉద్దేశించిన తీర్మానాన్ని లోక్ సభ 2025 జులై 30రాజ్య సభ 2025 ఆగష్టు 05న ఆమోదించిందిఈ తీర్మానం 2025 ఆగస్టు 13 నుంచి అమల్లోకి వచ్చింది.

 

2025 ఆగస్టు 07న లోక్‌సభలో.. 2025-26 సంవత్సరానికి సంబంధించిన మణిపూర్ రాష్ట్ర బడ్జెట్‌పై సాధారణ చర్చతో పాటు 2025-26 సంవత్సరానికి మణిపూర్ రాష్ట్ర నిధుల డిమాండ్లపై చర్చించారుడిమాండ్ల విషయంలో పూర్తి ఓటింగ్ నిర్వహించారులోకసభలో ప్రవేశపెట్టిన సంబంధిత కేటాయింపు బిల్లును సభ పరిశీలించిన తర్వాత ఆమోదించింది. 2025-26 సంవత్సరానికి మణిపూర్ రాష్ట్ర బడ్జెట్‌మణిపూర్ కేటాయింపుల (సంఖ్య.2) బిల్లు- 2025 లపై రాజ్యసభ చర్చించింది. 2025 అగస్టు 11న తిరిగి పంపించింది.

జూలై 2024లో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఆదాయపు పన్ను చట్టం-1961ని సంక్షిప్తంగాస్పష్టంగా.. చదవడానికిఅర్థం చేసుకోవడానికి సులభంగా ఉండేలా చేసేందుకు కాలానుగుణంగా సమగ్రంగా సమీక్షించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందిదీనికి అనుగుణంగా 13.02.2025న లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను బిల్లు-2025ను పరిశీలించేందుకు సెలెక్ట్ కమిటీకి పంపారుఈ నివేదికను 21.07.2025న లోక్‌సభకు సమర్పించారుసెలెక్ట్ కమిటీ చేసిన దాదాపు అన్ని సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించిందిఅదనంగా ప్రతిపాదిత బిల్లులో చట్టపరమైన పదాల అర్థాన్ని మరింత ఖచ్చితంగా తెలియజేసేందుకు చేయాల్సిన మార్పుల గురించి ఆసక్తిదారుల నుంచి వచ్చిన సూచనలు కూడా పరిగణనలోకి తీసుకున్నారుముసాయిదా రూపకల్పనపదబంధాల అమరికవీటి పర్యవసానంగా చేయాల్సిన మార్పులుపరస్పర అన్వయాలకు సంబంధించిన మార్పులు చేపట్టారువీటన్నింటి దృష్ట్యా సెలెక్ట్ కమిటీ సూచించినట్లుగా ఆదాయపు పన్ను బిల్లు-2025ని ప్రభుత్వం ఉపసంహరించుకుందిసమగ్రంగా తయారుచేసిన ఆదాయపు పన్ను (సంఖ్య. 2) బిల్లు- 2025ను 11.08.2025న లోక్‌సభ చర్చించి ఆమోదించిందిఈ బిల్లును రాజ్యసభ 12.08.2025న తిరిగి పంపించింది.

 

క్రీడల అభివృద్ధి-ప్రోత్సాహించటంక్రీడాకారుల సంక్షేమ చర్యలుసుపరిపాలన ప్రాథమిక సార్వత్రిక సూత్రాల ఆధారితమైన నైతిక పద్ధతులుఒలింపిక్-క్రీడలకు సంబంధించి నీతిన్యాయం.. ఒలింపిక్ చార్టర్పారాలింపిక్ చార్టర్అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులుఇప్పటికే వ్యవస్థీకృతమైన చట్టపరమైన ప్రమాణాలు.. క్రీడా ఫిర్యాదులువివాదాలను లేదా సంబంధిత అంశాలను ఏకీకృతసమానమైనప్రభావవంతమైన పద్ధతిలో పరిష్కరించటాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన జాతీయ క్రీడా పాలన బిల్లు-2025ను లోక్‌సభ ఆమోదించింది.

 

ఆన్‌లైన్ గేమింగ్ ప్రోత్సాహంనియంత్రణ బిల్లు-2025 కూడా ఆమోదం పొందిందిఇది ఈ-స్పోర్ట్స్అవగాహనను పెంచే ఆటలుసామాజిక ఆటలతో సహా ఆన్‌లైన్ గేమింగ్ రంగాన్ని ప్రోత్సహించనుందిదీనితో పాటు సమన్వయ పద్ధతిలో వ్యూహాత్మక అభివృద్ధిసంబంధిత రంగ నియంత్రణ పర్యవేక్షణ కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈ బిల్లు తెలియజేస్తోందిఏదైనా కంప్యూటర్మొబైల్ పరికరం లేదా ఇంటర్నెట్ ద్వారా ఆన్‌లైన్‌లో డబ్బులతో కూడిన ఆటలను వినియోగదారులకు అందించటంనిర్వహించటంనిర్వహణకు సహకరించటంప్రకటనలు జారీ చేయటంప్రోత్సహించటంఇలాంటి ఆటల్లో పాల్గొనడాన్ని.. ముఖ్యంగా రాష్ట్రాల మధ్య లేదా విదేశాల నుంచి నిర్వహించే కార్యకలాపాలను ఇది నిషేధించిందిఅటువంటి ఆటల వల్ల సామాజికఆర్థికమానసికగోప్యత విషయంలో కలిగే ప్రతికూల ప్రభావాల నుంచి ప్రజలను ముఖ్యంగా యువతదుర్బల వ్యక్తులను రక్షించటం.. డిజిటల్ సాంకేతికల బాధ్యతాయుతంగా ఉపయోగించేలా చూసుకోవటం.. ప్రజా క్రమాన్ని కాపాడటంప్రజారోగ్యాన్ని రక్షించడం.. ఆర్థిక వ్యవస్థల సమగ్రతనుదేశ భద్రత -సార్వభౌమత్వాన్ని కాపాడటం.. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఏకరీతిజాతీయ స్థాయిలో చట్టపరమైన వ్యవస్థను ఏర్పాటు చేయటం… ఇతర సంబంధిత అంశాలను బిల్లు తెలియజేస్తోంది.

 

ఓడరేవులునౌకాయానజలమార్గాల మంత్రిత్వ శాఖకు చెందిన అయిదు బిల్లులు అవి: (i) బిల్స్ ఆఫ్ లేడింగ్ బిల్లు- 2025, (ii) సముద్రాల ద్వారా వస్తు రవాణా బిల్లు- 2025, (iii) తీరప్రాంత సరకు రవాణా బిల్లు- 2025 (కోస్టల్ షిప్పింగ్ బిల్లు) (iv) వాణిజ్య సరకు రవాణా బిల్లు-2025 (v) భారత ఓడరేవుల బిల్లు- 2025లను ఈ పార్లమెంటు సమావేశాల్లో ఉభయ సభలు ఆమోదించాయి.

 

వ్యాపార సౌలభ్యంజీవన సౌలభ్యాన్ని పెంచేందుకు లోక్‌సభలో ప్రవేశపెట్టబడిన (i) దివాలా కోడ్ (సవరణబిల్లు-2025 (ii) జన్ విశ్వాస్ (నిబంధనల సవరణబిల్లు-2025 అనే రెండు బిల్లులను లోక్‌సభ సెలెక్ట్ కమిటీకి పంపించింది.

 

(i) 130వ రాజ్యాంగ సవరణ బిల్లు-2025, (ii) కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వం (సవరణబిల్లు- 2025, (iii) జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణబిల్లు- 2025 అనే మూడింటిని 20.08.2025న లోక్‌సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిందిప్రధానమంత్రిని లేదా కేంద్ర మంత్రులు.. రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు లేదా మంత్రులను తొలగించేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును ఉభయ సభల సంయుక్త కమిటీకి పంపారుఆయా మంత్రులు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధించే వీలున్న తీవ్రమైన నేరారోపణలతో అరెస్టయి, 30 రోజుల పాటు కస్టడీలో ఉన్నట్లయితే పదవిని కోల్పోతారుప్రజలువారికి అప్పగించిన రాజ్యాంగ నైతిక బాధ్యతనువిశ్వాసాన్ని నిలబట్టేందుకు ఈ బిల్లును తీసుకొచ్చారు.

 

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారతదేశ మొదటి వ్యోమగామి...'వికసిత్ భారత్-2047 ' కోసం అంతరిక్ష కార్యక్రమాల్లో భారత్ పోషించనునన్న కీలక పాత్రపై 18.08.2025న లోక్‌సభలో ప్రత్యేక చర్చ చేపట్టారుకానీ సభలో తరచూ ఏర్పడ్డ అంతరాయం కారణంగా చర్చ పూర్తి కాలేదు.

 

లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లులుసెలెక్ట్ కమిటీకి పంపిన బిల్లులుజాయింట్ కమిటీకి సూచించిన బిల్లులులోక్‌సభ లేదా రాజ్యసభ ఆమోదించిన బిల్లులుఉభయ సభలు ఆమోదించిన బిల్లుల జాబితాలు అనుబంధంలో ఉన్నాయి.

 

సమావేశాలు జరుగుతున్న సమయంలో... ఉభయ సభల్లో తరచూ అంతరాయాలు చోటు చేసుకున్నాయిఅందువల్ల లోక్‌సభ సఫలత సుమారు 31 శాతంరాజ్యసభ సఫలత సుమారు 39 శాతంగా నమోదైందిఈ సమావేశాల్లో మొత్తం 120 గంటల్లో లోక్‌సభలో 37 గంటలు మాత్రమే చర్చ జరిగిందిరాజ్యసభలో 41 గంటల 15 నిమిషాలు మాత్రమే చర్చ జరిగింది.

 

ఎస్ఎస్/ఐఎస్ఏ

 

అనుబంధం

 

18వ లోక్‌సభ 5వ సెషన్రాజ్య‌సభ 268వ సెషన్‌లో చట్టాలకు సంబంధించిన పురోగతి

 

(వర్షాకాల సమావేశాలు- 2025)

 

I. లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లులు

 

1. జాతీయ క్రీడా పాలన బిల్లు- 2025.

 

2. జాతీయ డోపింగ్ నిరోధక (సవరణబిల్లు- 2025.

 

3. మణిపూర్ వస్తు సేవల పన్ను (సవరణబిల్లు- 2025.

 

4. మణిపూర్ కేటాయింపుల (సంఖ్య. 2) బిల్లు- 2025

 

5. ఆదాయపు పన్ను (సంఖ్య.2) బిల్లు- 2025

 

6. పన్నుల చట్టాల (సవరణబిల్లు- 2025

 

7. గనులుఖనిజాలు (అభివృద్ధినియంత్రణసవరణ బిల్లు- 2025

 

8. దివాలా కోడ్ (సవరణబిల్లు- 2025

 

9. జన్ విశ్వాస్ (నిబంధనల సవరణబిల్లు- 2025

 

10. ఇండియన్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (సవరణబిల్లు- 2025

 

11. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు- 2025

 

12. కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ (సవరణబిల్లు- 2025

 

13. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణబిల్లు- 2025

 

14. ఆన్‌లైన్ గేమింగ్ ప్రోత్సహంనియంత్రణ బిల్లు- 2025

 

II. లోక్‌సభ సెలెక్ట్ కమిటీకి పంపిన బిల్లులు:

 

1. దివాలా కోడ్ (సవరణబిల్లు- 2025

 

2. జన్ విశ్వాస్ (నిబంధనల సవరణబిల్లు- 2025

 

III. ఉభయ సభల సంయుక్త కమిటీకి పంపిన బిల్లులు

 

1. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు- 2025

 

2. కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ (సవరణబిల్లు- 2025

 

3. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణబిల్లు- 2025

 

లోక్ సభ ఆమోదించిన బిల్లులు

 

1. గోవా రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాలలో షెడ్యూల్డ్ తెగల ప్రాతినిధ్య మార్పు బిల్లు- 2025

 

2. వాణిజ్య సరకు రవాణా బిల్లు- 2025

 

3. మణిపూర్ వస్తు సేవల పన్ను (సవరణబిల్లు- 2025

 

4. మణిపూర్ కేటాయింపుల (సంఖ్య. 2) బిల్లు- 2025

 

5. జాతీయ క్రీడా పాలన బిల్లు- 2025

 

6. జాతీయ డోపింగ్ నిరోధక (సవరణబిల్లు- 2025.

 

7. ఆదాయపు పన్ను బిల్లు- 2025

 

8. పన్నుల చట్టాల (సవరణబిల్లు- 2025

 

9. భారత ఓడరేవుల బిల్లు- 2025

 

10. గనులుఖనిజాలు (అభివృద్ధినియంత్రణసవరణ బిల్లు- 2025

 

11. ఇండియన్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (సవరణబిల్లు- 2025

 

12. ఆన్‌లైన్ గేమింగ్ ప్రోత్సహంనియంత్రణ బిల్లు- 2025

 

రాజ్యసభ ఆమోదించినతిరిగి పంపించిన బిల్లులు

 

1. ది బిల్స్ ఆఫ్ లేడింగ్ బిల్లు- 2025.

 

2. సముద్ర వస్తు రవాణా బిల్లు- 2025.

 

3. తీరప్రాంత సరకు రవాణా బిల్లు- 2025

 

4. మణిపూర్ వస్తు సేవల పన్ను (సవరణబిల్లు- 2025.

 

5. మణిపూర్ కేటాయింపుల (సంఖ్య.2) బిల్లు-2025

 

5. వాణిజ్య సరకు రవాణా బిల్లు- 2025

 

6. గోవా రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాలలో షెడ్యూల్డ్ తెగల ప్రాతినిధ్య మార్పు బిల్లు- 2025

 

7. జాతీయ క్రీడా పాలన బిల్లు- 2025.

 

8. జాతీయ డోపింగ్ నిరోధక (సవరణబిల్లు- 2025.

 

10. ఆదాయపు పన్ను బిల్లు- 2025

 

11. పన్నుల చట్టాల (సవరణబిల్లు- 2025

 

12. భారత ఓడరేవుల బిల్లు- 2025

 

13. గనులుఖనిజాలు (అభివృద్ధినియంత్రణసవరణ బిల్లు- 2025

 

14. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (సవరణబిల్లు- 2025

 

15. ఆన్‌లైన్ గేమింగ్ ప్రోత్సహంనియంత్రణ బిల్లు- 2025

 

VI. పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన బిల్లులు

 

1. ది బిల్స్ ఆఫ్ లాడింగ్ బిల్లు- 2025

 

2. సముద్రాల ద్వారా వస్తు రవాణా బిల్లు- 2025

 

3. తీరప్రాంత సరకు రవాణా బిల్లు- 2025

 

4. మణిపూర్ వస్తు సేవల పన్ను (సవరణబిల్లు- 2025

 

5. మణిపూర్ కేటాయింపుల (సంఖ్య. 2) బిల్లు-2025

 

6. వాణిజ్య సరకు రవాణా బిల్లు- 2025

 

7. గోవా రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాలలో షెడ్యూల్డ్ తెగల ప్రాతినిధ్య మార్పు బిల్లు- 2025

 

8. జాతీయ క్రీడా పాలన బిల్లు- 2025

 

9. జాతీయ డోపింగ్ నిరోధక (సవరణబిల్లు- 2025

 

10. ఆదాయపు పన్ను బిల్లు, 2025

 

11. పన్నుల చట్టాల (సవరణబిల్లు, 2025

 

12. భారత ఓడరేవుల బిల్లు- 2025

 

13. గనులుఖనిజాలు (అభివృద్ధినియంత్రణసవరణ బిల్లు- 2025

 

14. ఇండియన్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (సవరణబిల్లు- 2025

 

15. ఆన్‌లైన్ గేమింగ్ ప్రోత్సహంనియంత్రణ బిల్లు- 2025

 

లోక్‌సభలో ఉపసంహరించిన బిల్లులు

 

ఆదాయపు పన్ను బిల్లు- 2025: సెలెక్ట్ కమిటీ సూచనకు అనుగుణంగా దీనిని ఉపసంహరించుకున్నారు

 

***


(Release ID: 2159601) Visitor Counter : 24