బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బొగ్గును అనేక పద్ధతుల్లో వినియోగించడం.. దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడం

Posted On: 11 AUG 2025 2:48PM by PIB Hyderabad

మన దేశంలో కోకింగ్ కోల్‌ ఉత్పత్తిని పెంచడానికి ‘‘మిషన్ కోకింగ్ కోల్’’ను బొగ్గు మంత్రిత్వ శాఖ 2021 ఆగస్టులో ప్రారంభించిందిముఖ్యంగా ఉక్కు రంగం అవసరాలను తీర్చడం కోసం దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడం కూడా ఈ కార్యక్రమం ధ్యేయంఈ  మిషన్‌లో సాధించిన విజయాలునమోదైన  పురోగతి  ఈ  కింది విధంగా ఉన్నాయి..

i.        దేశంలో కోకింగ్ కోల్ ఉత్పత్తి 2021 ఆర్థిక  సంవత్సరంలో 44.79 ఎంటీ స్థాయిలో ఉండగా 2025 ఆర్థిక  సంవత్సరంలో 66.47 ఎంటీకి చేరుకొంది.

ii.        కార్యకలాపాలు నిలిపివేసిన 11 కోకింగ్ కోల్ గనులను రెవన్యూను పంచుకొనే వినూత్న పద్ధతిలో ప్రయివేటు రంగానికి సీఐఎల్ ఇవ్వజూపింది.

iii.        బీసీసీఎల్‌కు చెందిన నూతన మధువన్ కోకింగ్ కోల్ వాషరీని 2024 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించారుఈ వాషరీకి  ఎంటీపీఏ (ఏడాదికి మిలియన్ టన్నుల బొగ్గు లోని మలినాలను తొలగించేసామర్థ్యం ఉంది.  

iv.        ఒక కోకింగ్ కోల్ వాషరీని సీఐఎల్ మానిటైజ్ చేసింది. (అంటే ఇదివరకు దీని నుంచి ఎలాంటి ఆదాయం లేని కారణంగాప్రస్తుతం ఈ వాషరీ కొంత ఆదాయాన్ని సీఐఎల్‌కు సంపాదించి పెట్టే ఏర్పాటు చేశారు.)

దేశీయంగా కోకింగ్ కోల్ ఉత్పత్తిని పెంచడం ద్వారా దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడానికి చేపట్టిన ఇతర కార్యక్రమాలు ఈ కింది విధంగా ఉన్నాయి:

·     అనియంత్రిత రంగ (ఎన్ఆర్ఎస్లింకేజీ వేలం విధానానికి 2020లో సవరణ చేస్తూఎన్ఆర్ఎస్ లింకేజీ వేలంలో కోకింగ్ కోల్ కేటాయింపు కాలాన్ని 30 సంవత్సరాలుగా నిర్ధారించారు. 30 ఏళ్ల వీలును కల్పించడమనేది బొగ్గును దిగుమతి చేసుకోవడానికి బదులు తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసుకొనేటట్లుగా సానుకూల ప్రభావాన్ని కలగజేస్తుందని భావిస్తున్నారు.

 

·         భారత్‌లో బొగ్గును పారదర్శకంగా కేటాయించడానికీఉపయోగించడానికీ ఉద్దేశించిన సవరించిన పథకం (స్కీమ్ ఫర్ హార్నెసింగ్ అండ్ లొకేటింగ్ కోయ్‌లా (బొగ్గుట్రాన్స్‌పరెంట్లీ ఇన్ ఇండియా.. ‘శక్తి’),

·         అనియంత్రిత రంగాన్ని దృష్టిలో పెట్టుకొని రూపొందించిన లింకేజి ఆక్షన్ పాలసీ (ఎన్ఆర్ఎస్).

·         బ్రిడ్జ్ లింకేజి పాలసీ.

·         బొగ్గు కొనుగోలుదారు సంస్థలకు సులభతర సింగిల్ విండో మోడ్ ఎగ్నాస్టిక్ ఆక్షన్ పద్ధతి (ఎస్‌డబ్ల్యూఎంఏ),

·         లింకేజి సక్రమ వ్యవస్థీకరణ మొదలైనవి.

బొగ్గు కంపెనీలకువినియోగదారులకు మధ్య కుదిరే ఇంధన సరఫరా ఒప్పందం ప్రకారం బొగ్గును ఆయా వినియోగదారులకు సరఫరా చేస్తారు.

ఈ సమాచారాన్ని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి శ్రీ జికిషన్ రెడ్డి రాజ్యసభలో ఈ రోజు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపారు.

 

***


(Release ID: 2155071)