రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

ఐఎన్‌ఎస్ చిల్కాలో 01/25 బ్యాచ్ అగ్నివీరుల పాసింగ్ ఔట్ పరేడ్

Posted On: 07 AUG 2025 7:42PM by PIB Hyderabad

ఆరో అగ్నివీర్ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ (పీఓపీ) 2025 ఆగస్టు 08న ఐఎన్‌ఎస్ చిల్కా‌లో నిర్వహించనున్నారు. ఈ వేడుకతో 300 మంది మహిళలతో కూడిన 2000 మందికి పైగా అగ్నివీరులకు ప్రాథమిక శిక్షణ విజయవంతంగా పూర్తవుతుంది. వీరంతా 16 వారాలపాటు కఠినమైన శిక్షణ పొందారు.

 

అగ్నివీరులతో ప్రయాణంలో పీఓపీ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది పోరాటానికి సిద్ధంగా ఉన్న, విశ్వసనీయత కలిగిన, పూర్తి సమన్వయంతో భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న భారత నావికాదళంలో వారి ప్రయాణ ప్రారంభాన్ని తెలియజేస్తోంది. పాసింగ్ అవుట్ బ్యాచ్‌లో సీనియర్ సెకండరీ రిక్రూట్‌లు, నావిక్‌లు (సాధారణ విధులు) కూడా ఉన్నారు.

 

తూర్పు నావికాదళ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ ఆధ్వర్యంలో పరేడ్ జరగనుంది. ఐఎన్‌ఎస్ చిల్కా కమాండింగ్ ఆఫీసర్ కమోడోర్ బీ దీపక్ అనీల్ కండక్టింగ్ ఆఫీసర్‌గా ఉంటారు.

 

సాయంత్రం వేళ జరిగే ఈ పరేడ్‌ను అగ్నివీరుల కుటుంబ సభ్యులు, ప్రముఖులు, క్రీడలకు సంబంధించిన ప్రముఖులు వీక్షించనున్నారు.

 

అధునాతన నావికా వ్యవస్థలపై సేవలందించేందుకు క్రమశిక్షణ, ధృడత్వం, వృత్తిపరమైన నైపుణ్యాలతో కూడిన సమర్థులైన యోధులగా కొత్తగా నియామకమైన వారిని మార్చటంలో ఐఎన్ఎస్ చిల్కా కీలక పాత్ర పోషిస్తోంది.

 

ముగింపు కార్యక్రమనికి తూర్పు నావికా దళ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ హాజరుకానున్నారు. శిక్షణలో ప్రతిభ కనబరిచిన వారితో పాటు ఛాంపియన్ విభాగానికి అవార్డులు లేదా ట్రోఫీలను ఆయన ఇవ్వనున్నారు. ద్విభాషా శిక్షణార్థుల మ్యాగజైన్ అయిన 'అంకుర్'ను ఆయన ఆవిష్కరించనున్నారు.

 

 

 

ఈ పరేడ్ భారత నావికా‌దళ యూట్యూబ్ ఛానల్, ఫేస్‌బుక్ పేజీ, ప్రాంతీయ దూరదర్శన్ నెట్‌వర్క్‌లో 2025 ఆగస్టు 08న సాయంత్రం 4:30 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం కానుంది.

***


(Release ID: 2153970)
Read this release in: English , Urdu , Hindi