రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుతో కలిసి మంగళగిరి నుంచి రూ.5,233 కోట్లు పెట్టుబడితో 272 కిలోమీటర్ల 29 జాతీయ రహదారి ప్రాజెక్టులకు


శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ...

Posted On: 02 AUG 2025 10:02PM by PIB Hyderabad

272 కిలోమీటర్ల మేర విస్తరించిన 29 జాతీయ రహదారి ప్రాజెక్టులకు కేంద్ర రోడ్డు రవాణారహదార్ల  శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో శంకుస్థాపన చేసిప్రారంభించారుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ కేంద్ర మంత్రులు శ్రీ కింజరాపు రామ్ మోహన్ నాయుడుశ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మడాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసానిఎంపీలుఎమ్మెల్యేలు,  సీనియర్ అధికారులు పాల్గొన్నారుఈ ప్రాజెక్టులపై  రూ.5,233 కోట్లకుపైగా ఖర్చు చేయనున్నారు.

సభను ఉద్దేశించి శ్రీ గడ్కరీ మాట్లాడుతూ, “ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా.... ప్రమాదభరిత ప్రాంతాలురైల్వే క్రాసింగ్‌లను తొలగించేందుకురవాణా ఖర్చులను తగ్గించేందుకుగ్రామీణ-గిరిజన ప్రాంతాలలో తుది దశలోని అనుసంధానతను బలపర్చేందుకుతిరుపతినెల్లూరురాయచోటి వంటి ప్రధాన పట్టణ కేంద్రాల్లో ట్రాఫిక్‌ను తగ్గించేందుకు ఈ ప్రాజెక్టులకు రూపకల్పన చేసినట్లు చెప్పారువీటి  ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను భారత అభివృద్ధి గాథలో ముందుండే రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.

దేశంలో లాజిస్టిక్స్ ఖర్చు గణనీయంగా తగ్గిన విషయాన్ని శ్రీ గడ్కరీ తన ప్రసంగంలో  ప్రత్యేకంగా ప్రస్తావించారుమెరుగైన రహదారి మౌలిక సదుపాయాల వల్ల లాజిస్టిక్స్ ఖర్చు 16 శాతం నుంచి 10 శాతానికి తగ్గిందని, 2025 డిసెంబర్ నాటికి ఇది 9 శాతానికి దిగివచ్చే అవకాశం ఉందని తెలిపారుఈ తగ్గుదల ఎగుమతులను రెట్టింపు చేయడానికిఉద్యోగావకాశాలను పెంచడానికీ దోహదపడుతుందని అన్నారుఅదేవిధంగానేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలో జాతీయ రహదారుల పొడవు 2014లో 4,000 కిలోమీటర్ల నుంచి 2025లో 8,700 కిలోమీటర్లకు అంటే 120% మేర పెరిగిందని తెలిపారుఇది మౌలిక ఆధారిత ఆర్థిక అభివృద్ధిపై ప్రభుత్వం చేసిన గట్టి కృషికి నిదర్శనమని పేర్కొన్నారు.

ఎన్‌హెచ్‌71లోని మదనపల్లె నుంచి పీలేరు వరకు 56 కిలోమీటర్ల పొడవున్న మార్గాన్ని 4 లైన్ల కారిడార్‌గా నవీకరించారుఈ ప్రాజెక్టుపై  రూ.1,994 కోట్లు వెచ్చించారుఇందులో 9 ఫ్లైఓవర్లుఒక రైలు ఓవర్‌బ్రిడ్జ్, 19 ప్రధాన వంతెనలు, 5 వాహన అండర్‌పాస్‌లు, 10 స్థానిక అండర్‌పాస్‌లు ఉన్నాయి.

అదే విధంగాకర్నూలు నుంచి మండ్లెం వరకు 31 కిలోమీటర్ల పొడవైన ఎన్‌హెచ్‌340సీ  రోడ్డును ఫేవ్డ్ షోల్డర్లు కలిగిన నాలుగు లైన్ల మార్గంగా అభివృద్ధి చేశారుదీన్ని రూ.858 కోట్ల వ్యయంతో చేపట్టారుఇందులో ఒక ఫ్లైఓవర్, 4 వయడక్ట్స్, 3 స్థానిక అండర్‌పాస్‌లుఒక చిన్న అండర్‌పాస్ ఉన్నాయి.

ఈ అభివృద్ధి ప్రాజెక్టులతో పాటురాష్ట్రవ్యాప్తంగా కనెక్టివిటీని మెరుగుపరచేందుకు మరో 27 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరుగుతున్నాయిఇవి తిరుపతిశ్రీశైలంకదిరి వంటి పుణ్యక్షేత్రాలకుహార్స్ లీ హిల్స్ఓడరేవు బీచ్ వంటి పర్యాటక కేంద్రాలకు చేరువ చేస్తాయిశ్రీ సిటీకృష్ణపట్నం పోర్ట్తిరుపతి విమానాశ్రయం వంటి ఆర్థిక కేంద్రాలకు మరింత  కనెక్టివిటీను అందించనున్నాయి.

 

***


(Release ID: 2152026)
Read this release in: English , Urdu , Hindi