ప్రధాన మంత్రి కార్యాలయం
కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్ మృతి పట్ల ప్రధానమంత్రి సంతాపం
प्रविष्टि तिथि:
21 JUL 2025 6:21PM by PIB Hyderabad
కేరళ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వీఎస్ అచ్యుతానందన్ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు సంతాపం వ్యక్తం చేశారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"కేరళ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వీఎస్ అచ్యుతానందన్ గారి మరణం బాధాకరం. ఆయన తన జీవితాన్ని చాలా సంవత్సరాలపాటు ప్రజాసేవకు, కేరళ పురోగతికీ అంకితం చేశారు. మేమిద్దరం మా రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన సమయంలో మా మధ్య జరిగిన సంభాషణలు నాకింకా గుర్తున్నాయి. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి, మద్దతుదారులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా."
(रिलीज़ आईडी: 2146638)
आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam