కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సెకనుకు 25.6 టెరా బిట్ల సమాచారం పంపే అతున్నత సామర్థ్యంగల ‘సక్షం-3000 స్విచ్ కమ్ రౌటర్‌’ను ప్రారంభించిన


కేంద్ర కమ్యూనికేషన్లు-గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్

“సి-డాట్‌’ 2047 నాటికి ప్రపంచ దిగ్గజాలైన నోకియా, ఎరిక్సన్, హువావే వంటి సంస్థలకు దీటుగా నిలిచేలా ఎదగాలి”

Posted On: 03 JUL 2025 6:58PM by PIB Hyderabad

కేంద్ర కమ్యూనికేషన్లు-గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఈ రోజు సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ టెలిమాటిక్స్‌’ (సి-డాట్‌ప్రాంగణంలో సెకనుకు 25.6 టెరా బిట్ల సమాచారాన్ని పంపే త్యున్నత సామర్థ్యంగల సక్షం-3000 స్విచ్ కమ్ రౌటర్‌’ సదుపాయాన్ని ప్రారంభించారుస్వావలంబనప్రపంచ పోటీతత్వంలో భారత్‌ గణనీయ పురోగమనం లక్ష్యంగా తదుపరి తరం డిజిటల్ మౌలిక సదుపాయాల కోసం సి-డాట్‌’ ఈ అత్యాధునిక డేటా సెంటర్ స్విచ్-కమ్-రౌటర్ ను రూపొందించిందిదీన్ని ప్రారంభించిన అనంతరం ‘సి-డాట్‌’ ఢిల్లీ ప్రాంగణాన్ని సందర్శించిన మంత్రిఅక్కడి ప్రయోగశాలలను పరిశీలించారుఅలాగే వివిధ అత్యాధునిక సాంకేతిక రంగాల్లో పరిశోధనలు చేస్తున్న ఇంజినీర్లుశాస్త్రవేత్తలతో ఆయన మాట్లాడారు.

ఈ  సందర్భంగా మంత్రి మాట్లాడుతూతొలుత ‘సి-డాట్‌’ ఇంజినీర్ల ప్రతిభాపాటవాలను ప్రశంసించారువారి కృషి “సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధికి పరిమితం కాదు... దేశ పురోగమనం కోసం అవిశ్రాంత తపస్సు” అంటూ అభివర్ణించారు. ‘స్వదేశీ 4జి/5జి (ఎన్‌ఎస్‌ఏకోర్త్యాధునిక విపత్తు నిర్వహణ వ్యవస్థలుసైబర్ భద్రత మార్గాలుక్వాంటం కమ్యూనికేషన్‌’  సహా భారత్‌ ఇటీవల సాధించిన ప్రగతిని మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. “ఈ విధంగా ‘సి-డాట్‌’ తన పరిశోధనలువిస్తరణ ద్వారా అంతర్జాతీయ స్థాయికి ఎదిగే దశను చేరుకుంది“ అని ప్రశంసించారు.

ఇంజినీర్లు రోజువారీ లక్ష్యాల సాధనకు అతీతంగా ఆలోచించాలనిమరో ఐదేళ్లకు లేదా ఆ తదుపరి దేశానికి ఏది అవసరమో ఊహించగలగాలని డాక్టర్‌ శేఖర్‌ సూచించారుఈ మేరకు “సంకల్పం అంతరాంతరాల్లోంచి రగలాలి” అని పిలుపునిచ్చారు. “ఒక ప్రాజెక్టులో భాగస్వాములు కావడం... భవిష్యత్తుకు రూపమివ్వడం మధ్య వ్యత్యాసం ఇదే”నని ఉద్బోధించారు. “విజయం నుంచి ప్రాధాన్యాల దిశగా పయనిద్దాంస్వదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్త విశ్వసనీత గల ‘సి-డాట్‌’ను రూపుదిద్దుదాం... ఈ కృషిలో దేశం మీ వెంటే నడుస్తుంది” అంటూ స్ఫూర్తిదాయక సందేశమిచ్చారు.

భారత్‌ కేవలం తయారీకి పరిమితం కాకుండా ప్రపంచానికి మార్గదర్శకత్వం వహించే స్థాయికి ఎదగాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తూ- “2047 నాటికి ప్రపంచ దిగ్గజాలైన నోకియాఎరిక్సన్హువావే వంటి సంస్థలకు దీటుగా సి-డాట్’ ఎదగాలి” అని ఆయన ఆకాంక్షించారుఈ లక్ష్య సాధనలో స్వయంప్రతిపత్తినిధులుభాగస్వామ్యాల రీత్యా ప్రభుత్వం తనవంతు మద్దతిస్తుందని హామీ ఇచ్చారుఅలాగే “3జీపీపీఐటీయూఈటీఎస్‌ఐ” వంటి అంతర్జాతీయ ప్రమాణాల సంస్థలలో మరింత భాగస్వామ్యం కోసం కృషి చేయాలని కూడా పిలుపునిచ్చారు.

సక్షం-3000 గురించి:

ది ఆధునిక డేటా సెంటర్ల కోసం అత్యున్నత సామర్థ్యంసెకనుకు 25.6 ‘టీబీపీఎస్‌’ సమాచారం పంపగల శక్తితో రూపొందించిన స్విచ్-కమ్‌-రౌటర్భారీ కంప్యూటింగ్ సముదాయాలుక్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, 5జి/6జి నెట్‌వర్కులుఏఐ వర్క్‌ లోడ్‌లను శక్తిమంతం చేయడం లక్ష్యంగా ఈ పరికరం తయారైందిఇది 32 పోర్టులతో సెకనుకు గిగాబిట్‌ నుంచి 400 గిగాబిట్ల వరకూ ఈథర్నెట్ వేగానికి వీలు కల్పించగల పరికరం. “అల్ట్రా-లో లేటెన్సీవైర్-స్పీడ్ ప్రాసెసింగ్మాడ్యులర్ సిఆర్‌ఓఎస్‌” (సి-డాట్‌ రూటర్ ఆపరేటింగ్ సిస్టమ్వ్యవస్థలుగల ఈ పరికరం ‘సీఎల్‌ఓఎస్‌’ నెట్‌వర్క్‌లో లీఫ్ నుంచి సూపర్-స్పైన్ నోడ్‌ల వరకూగల వివిధ మార్గాల్లో పనిచేయగల బహుముఖ పరిష్కారంగా రూపొందింది.

కంప్యూటింగ్‌ రంగంలో లెగసీ-క్లౌడ్‌ నేటివ్‌ నెట్‌వర్కులు రెండింటికీ “భవిష్యత్ సంసిద్ధ వేదిక”గా ‘సక్షం-3000’ రూపుదిద్దుకుందిఇది లేయర్-2, ఐపీఎంపీఎల్‌ఎస్‌ ప్రోటోకాల్‌లకు మద్దతిస్తుందిఅంతేకాకుండా విద్యుత్‌ వినియోగంలో పొదుపుతోపాటు పీటీపీసింక్-ఈ ద్వారా సమయానుగుణ అప్లికేషన్లకు తగినట్లు తయరయింది. ఇందులో “సరళ లైసెన్సింగ్హాట్-స్వాప్ అనుగుణ పవర్-ఫ్యాన్ యూనిట్ల అధిక విశ్వసనీయతడబ్ల్యూఆర్‌ఆర్‌ (వెయిటెడ్ రౌండ్ రాబిన్)డబ్ల్యూఆర్‌ఈడీ వంటి అత్యాధునిక ‘క్యూఓఎస్‌’ విశిష్టతలున్నాయిభారీ పరిశ్రమలుటెలికాం ఆపరేటర్లుహైపర్‌స్కేల్ డేటా సెంటర్ల కార్యకలాపాల్లో పెరిగే అవసరాలు తీర్చడం లక్ష్యంగా ఈ పరికరాన్ని తీర్చిదిద్దారు.

ఈ కార్యక్రమం అనంతరం ‘సి-డాట్’ సీఈవో డాక్టర్ రాజ్‌కుమార్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూగౌరవ మంత్రి డాక్టర్‌ చంద్రశేఖర్‌ ప్రయోగశాను సందర్శించిన సందర్భంగా ఇంజినీర్లకు మార్గనిర్దేశకస్ఫూర్తిదాయక సందేశమిచ్చారంటూ కృతజ్ఞతలు తెలిపారుతమ కృషికి అమూల్య మద్దతుపై ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారుచివరగాగౌరవ ప్రధానమంత్రి పిలుపునిచ్చిన స్వయం సమృద్ధ భారత్‌ దృక్కోణానికి అనుగుణంగా ‘సి-డాట్’ నిర్నిబంధ నిబద్ధతతో కర్తవ్య నిర్వహణకు సదా సిద్ధంగా ఉంటుందని ఉపాధ్యాయ్‌ ప్రకటించారు.

 

***


(Release ID: 2142062)
Read this release in: English , Urdu , Hindi